సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం మార్కెట్ సంచలనం రిలయన్స్ జియో దెబ్బతో విలవిలలాడిన ప్రయివేటు దిగ్గజ టెల్కో ఎయిర్‌టెల్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తాజా నివేదికల ప్రకారం ఇప్పటికే.. జియో దెబ్బకు కుదేలైన ఎయిర్‌టెల్ సుమారు 5-7 కోట్ల ఖతాదారులను ఎయిర్‌టెల్ కోల్పోనుంది. జీవిత కాల కస్టమర్లు ఉచిత ఇన్‌కమింగ్ కోసం 35రూపాయల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధన కంపెనీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
లైఫ్ టైం ఫ్రీ ఇన్‌కం ప్లాన్‌లో ఉన్న కస్టమర్లు నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ. 35గా ఎయిర్‌టెల్ ఇటీవల ఆదేశించింది. కస్టమర్లు నెలకు ఈ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని లేదంటే కనెక్షన్‌ను కట్ చేస్తానని నోటీసులు కూడా పంపింది. దీంతో చాలా మంది కస్టమర్లు ఎయిర్‌టెల్‌ను వీడనున్నారని సమాచారం.
ఎయిర్‌టెల్ ఏమంటోంది?
తమ తాజా నిర్ణయం వల్ల తమకు నష్టం ఏమీ ఉండదని ఎయిర్‌టెల్ ధీమాగా చెబుతోంది. ఖాతాదారులను నష్టపోనుందన్న అంశంపై స్పందించిన ఎయిర్‌టెల్ ఈ చర్య వల్ల యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (సగటు వినియోగదారుని నుండి వచ్చే ఆదాయం) ఏపీఆర్‌యూ పెరుగుతుందని, ఇప్పటికే చాలా సిమ్‌లు లైఫ్ టైం ప్యాకేజ్ కింద కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ కోసమే వాడుతున్నారని , దీన్ని అరికట్టడానికే ఈ చర్య తీసుకున్నామని ఎయిర్‌టెల్ తెలిపింది. అంతేకాదు ఒక వేళ కస్టమర్లు తగ్గినా ఆ భారాన్ని మోయడానికే తాము సిద్ధ పడ్డామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 4జీ సేవలతో బాటు , ఇతర రంగాల్లో నుంచి తమకు ఆదాయం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
Comments
Please login to add a commentAdd a comment