సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) పొదుపు ఖాతాదారులు తమ ఖాతాల్లో నిర్వహించే కనీస బ్యాలెన్స్‌ను రెట్టింపు చేసింది. నగర, మెట్రో, సెమీ అర్బన్ బ్రాంచ్‌ల్లో కనీస నిల్వను రూ 1000 నుంచి రూ 2000కు పెంచుతున్నట్టు బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్‌ల్లో కనీస నిల్వను రూ 500 నుంచి రూ 1000కి పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి నూతన మినిమం బ్యాలెన్స్‌లు అమల్లోకి వస్తాయని బ్యాంకు పేర్కొంది.
బీఓబీలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లు విలీనం కావడంతో ఈ రెండు బ్యాంకుల పొదుపు ఖాతాలకూ ఇవే నిబంధనలు వర్తించనున్నాయి. కాగా మినిమం బ్యాలెన్స్ నిర్వహణను వంద శాతం మేర బ్యాంకు పెంచినప్పటికీ కనీస నిల్వను నిర్వహించని ఖాతాదారులపై విధించే జరిమానాను పెంచకపోవడం ఖాతాదారులకు కొంత ఊరట ఇస్తోంది. అయితే అదనంగా మినిమమ్ బ్యాలెన్స్‌ను నిర్వహించడం ఖాతాదారులపై భారం మోపనుంది.
Comments
Please login to add a commentAdd a comment