న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకు, ప్రైవేట్‌రంగ బ్యాంకులు కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీలను భారీగా మోత మోగిస్తున్నాయి. తమ సేవింగ్స్ అకౌంట్లలో బ్యాంకు నిర్దేశించిన మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే, ఇక అంతే సంగతులు. కానీ అసలు బ్యాంకులు విధించే ఈ ఛార్జీలు సమంజమేనా? లేదా? అని ఐఐటీ ముంబై ప్రొఫెసర్ ఓ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం లేదని కస్టమర్లకు విధిస్తున్న ఛార్జీలు అసమంజసంగా ఉన్నాయని తేలింది. ఆశిష్ దాస్ ఈ సర్వే చేపట్టారు. యస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్‌సీస్ లాంటి బ్యాంకులు విధిస్తున్న పెనాల్టీలు వార్షికంగా 100 శాతం కంటే పైననే ఉన్నాయని తేలింది.
అయితే మినిమమ్ బ్యాలెన్స్‌లు నిర్వహించలేని కస్టమర్లకు విధించే ఛార్జీల విషయంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూపొందించిన మార్గదర్శకాలు, చాలా సమంజసంగా ఉన్నాయని, సర్వీసులు అందజేసే ఖర్చుల కంటే ఎక్కువగా ఇవి ఉండవని దాస్ సర్వే పేర్కొంది. కానీ చాలా బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు సగటున చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయని తెలిపింది. దాస్ అందించిన డేటా ప్రకారం ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు వార్షిక ఛార్జీ 159.48 శాతంగా, యస్ బ్యాంకు ఛార్జీ 112.8 శాతంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఛార్జీ 83.76 శాతంగా, యాక్సిస్ బ్యాంకు ఛార్జీ 82.2 శాతంగా ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ విధించే పెనాల్టీలు కూడా 24.6 శాతంగా ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. ఈ పెనాల్టీలను బ్యాంకులు అసమంజసంగా విధిస్తున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment