PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కోట్లాది మంది ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి గత కొన్నేళ్లుగా ఉపయోగించకపోతే జూలై 1 తర్వాత అలాంటి ఖాతాలు రద్దు కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విషయాన్ని చెబుతోంది. సేవింగ్స్ అకౌంట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ముందుగా దాని స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ నెలాఖరు కల్లా వాడుకలో లేని ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను, అలాగే గత మూడేళ్లుగా అకౌంట్ బ్యాలెన్స్ సున్నా ఉన్న అకౌంట్లను క్లోజ్ చేయబోతున్నట్లు బ్యాంకు తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాంటి కస్టమర్లకు ఇప్పటికే నోటీసులు సైతం పంపించింది.
వాడుకలో లేని ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలని పీఎన్‌బీ కొన్ని రోజుల క్రితమే ఖాతాదారులకు తెలియజేసింది. అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఈ ఖాతాలు క్లోజ్ అవుతాయి. చాలా కాలంగా కస్టమర్లు ఉపయోగించని ఇలాంటి ఖాతాలను చాలా మంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఖాతా లెక్కింపు 2024 ఏప్రిల్ 30 ఆధారంగా జరుగుతుంది.
తిరిగి యాక్టివేట్ చేసుకోండిలా..
బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయి, ఖాతాదారు అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. కేవైసీ ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment