ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు గట్టి షాక్‌ను ఇచ్చింది. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 4, 2022 నుంచి అమలులోకి రానుంది.
ఖాతాదారులకు నిరాశపరుస్తూ వడ్డీరేట్లను పీఎన్‌బీ తగ్గించింది. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి గాను 2.70 శాతానికి తగ్గించినట్లు పీఎన్‌బీ ప్రకటించింది. అంతేకాకుండా రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును ఏడాదికి 2.75 శాతానికి తగ్గిస్తూ పీఎన్‌బీ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు డొమెస్టిక్, ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు వర్తించనుంది.
పీఎన్‌బీ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది డిపాజిటర్లను ప్రభావితం చేయనుంది. వీరిలో చాలా మందికి రూ.10 లక్షల కంటే తక్కువ ఖాతా నిల్వలు ఉన్నాయి. రెండు నెలల సమయంలో రెండోసారి డిపాజిట్‌దారుల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును పీఎన్‌బీ మరింత తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొదుపు ఖాతాపై రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగే నేపథ్యంలో పీఎన్‌బీ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో భాగంగా స్వల్పకాలిక డిపాజిట్లపై 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. మధ్యస్థ, దీర్ఘకాలిక డిపాజిట్లపై సంవత్సరానికి 2.25 శాతం, 2.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.
చదవండి: స్టాక్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నది తెలుగువారే..
Comments
Please login to add a commentAdd a comment