దేశంలో పురాతన, అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆగస్టు 12 లోపు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని తమ కస్టమర్‌లను కోరింది. నిర్ణీత గడువులోపు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే, వారి ఖాతాలను నిలిపివేయనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ అల్టిమేటం మార్చి 31 నాటికి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయని ఖాతాల కోసమని బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు కస్టమర్‌లు తమ శాఖకు వెళ్లి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటో, పాన్, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్ వంటివి అందించి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి ఆగస్టు 12 లోపు కేవైసీని అప్‌డేట్ చేసుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూచించింది. పీఎన్‌బీ వన్ యాప్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ (IBS) / రిజిస్టర్డ్ ఈ-మెయిల్ / పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఏదైనా బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా కేవైసీ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment