ఈ బ్యాంకులు పొదుపు ఖాతాలపై 7.25శాతం వడ్డీ! | These new banks are offering interests as high as 7.25% on your savings accounts | Sakshi
Sakshi News home page

ఈ బ్యాంకులు పొదుపు ఖాతాలపై 7.25శాతం వడ్డీ!

Published Tue, Apr 11 2017 4:48 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

ఈ బ్యాంకులు పొదుపు ఖాతాలపై  7.25శాతం వడ్డీ!

ఈ బ్యాంకులు పొదుపు ఖాతాలపై 7.25శాతం వడ్డీ!

ముంభై: ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో కొత్త పేమెంట్‌  బ్యాంకులు , స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు రంగంలో దిగనున్నాయి. 300 బేసిస్‌ పాయింట్ల కంటే ఎక్కువగా పొదుపు ఖాతాలపై సుమారు 7.25 శాతం వడ్డీని అందించనున్నాయి. త్వరలోనే ఇవి  ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.    విశ్వబ్యాంకులు పొదుపు ఖాతాలపై  అందిస్తున్న వడ్డీ రేటుతో పోలిస్తే..అధిక వడ్డీ  చెల్లించడానికి ముందుకు రావడానికి విశేషం. ముఖ్యంగా ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కు చెందిన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, ఇప్పటికే పే మెంట్‌ బ్యాంకింగ్‌ సేవలకోసం ఆర్‌బీఐ అనుమతి లభించిన  ఫినో టెక్‌ ఈ భారీ ఆఫర్‌ ను అందించనున్నాయి. 
 
ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఫినో పేటెక్‌ చెల్లింపు బ్యాంకునుత్వరలో లాంచ్‌ చేయనుంది.  కొద్ది కాలంలో తమ  చెల్లింపు బ్యాంకు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ,  ఇందుకు ఐసీఐసీఐ బ్యాంకు సహకారం తీసుకుంటున్నామని ఫినో పేటెక్‌  చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిషి గుప్తా తెలిపారు.  దాదాపు రూ.లక్షవరకు డిపాజిట్లను స్వీకరించనున‍్నట్టు చెప్పారు. ఈ చెల్లింపు బ్యాంకులో ఐసీఐసీఐ బ్యాంకు 20 శాతం వాటాను కలిగి ఉంటుందన్నారు. మరోపక్క వ్యూహాత్మక భాగస్వామి అయిన ఐసీఐసీఐ గ్రూప్‌ అందించే ఐసీఐసీఐ లాంబార్డ్‌, ఐసీఐసీఐ పుడెన్షియల్‌ పాలసీలను ఈ బ్యాంకు ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు.  
 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం  ప్రధానంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని, ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవలకు నోచుకోని ప్రాంతాల్లో ఈ బ్యాంకులు సేవలందించాల్సి ఉంటుంది. ఈ బ్యాంకులు దేశంలో ఎక్కడైనా శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే రుణ పోర్ట్‌ఫోలియోలో 50 శాతం వాటి విలువ రూ.25 లక్షల వరకు ఉండాలి. షెడ్యూలు వాణిజ్య బ్యాంకులకు వర్తించే నిబంధనలన్నీ చిన్న బ్యాంకులకూ వర్తిస్తాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లు సేకరించడంతోపాటు రైతులు, అసంఘటిత రంగానికి చెందిన చిన్న వ్యాపారులు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణాలిచ్చేందుకు వీలుంటుంది.  అలాగే  యూనివర్సల్‌ బ్యాంకుల్లాగే ఇవి కూడా ఆర్‌బీఐ వద్ద విధిగా నగదు నిల్వ నిష్పత్తి(సీఆర్‌ఆర్) నిబంధన ప్రకారం డిపాజిట్లలో కొంత వాటాను జమచేయాల్సి ఉంటుంది. అలాగే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్) నిబంధన ప్రకారం ప్రభుత్వ రంగ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
 
​​ కాగా భారతి ఎయిర్‌టెల్‌కుచెందిన  ఎయిర్‌టెల్‌ పే మెంట్‌ బ్యాంకు  వినియోగదారుల ఖాతాలోని సొమ్ముకు 7శాతం వడ్డీ ఆఫర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement