withdraw funds
-
పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే..?
బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఏం చేస్తారు.. ‘సింపుల్..ఏటీఎం ద్వారా కావాల్సిన నగదును డ్రా చేస్తాం’ అంటారు కదూ. ఒకవేళ మీ ఖాతాలో రూ.5 లక్షలు ఉన్నాయనుకోండి దాన్ని విత్‌డ్రా చేయాలన్నా ఏటీఎం ద్వారానే చేస్తారా..? ఏటీఎం, చెక్‌బుక్, డీడీ ఇలా ప్రతిదానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయో తెలుసుకుందాం.ఏటీఎం విత్డ్రాఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేయాలంటే మీ కార్డును అనుసరించి రోజుకు రూ.40,000 నుంచి గరిష్ఠంగా రూ.ఒక లక్ష వరకు మాత్రమే సాధ్యం అవుతుంది. కొన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులకు సంబంధించి విత్‌డ్రా పరిమితులు కింది విధంగా ఉన్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాక్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు: రోజుకు రూ.40,000.గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000.ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ఇంటర్నేషనల్, ఉమెన్స్ అడ్వాంటేజ్, ఎన్ఆర్వో డెబిట్ కార్డులు: రోజుకు రూ.25,000టైటానియం రాయల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.75,000ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డులు: రోజుకు రూ.1,00,000.ఐసీఐసీఐ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000గోల్డ్ డెబిట్ కార్డు: రోజుకు రూ.50,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000యాక్సిస్ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..చెక్బుక్చెక్ లేదా పాస్‌బుక్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకుకు ముందుగా సమాచారం అందించాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ వంటి డాక్యుమెంటేషన్ అవసరం కావచ్చు. రూ.2 లక్షలకు మించి నగదు విత్‌డ్రా చేస్తే పాన్ కార్డ్ కాపీ తప్పనిసరి.డిమాండ్ డ్రాఫ్ట్పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్‌లు ఉపయోగించవచ్చు. ఇలా చేసే లావేదేవీలను బ్యాంకులు ట్రాక్ చేసేందుకు కొన్ని నియామాలు పాటించాయి. -
మిగిలింది ఒక్కరోజే
♦ ఖర్చు చేయాల్సింది అక్షరాలా రూ.16 కోట్లు ♦ అధికారుల అలసత్వంతో 13వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి ♦ పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పట్టణం ఒక్కటీ లేదు ♦ జిల్లాలో మున్సిపాల్టీల దుస్థితి... సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా జిల్లాలో పురపాలక సంఘాల పనీతీరు తయారైంది. 13వ ఆర్థిక సంఘం నిధులున్నా ఖర్చు చేయలేని దయనీయ స్థితిలో జిల్లాలోని పలు మున్సిపాలిటీలు ఉండటం గమనార్హం. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా ఖర్చు చేయాల్సిన నిధులు అక్షరాలా రూ.16 కోట్లు పైచిలుకు. అధికారుల అలసత్వం వల్ల నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఒక ప్రణాళిక లేకపోవడంతో పాటు అధికారుల మధ్య నమన్వయ లేమి, రాజకీయ పెత్తనాలు ఈ నిధులు ఖర్చు చేయలేక మురిగిపోయే పరిస్థితికి కారణంగా నిలిచారుు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు మిగిలిన మున్సిపాలిటీలకు 29 కోట్ల 92 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అందులో రూ.13 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయగా 16 కోట్ల రూపాయల పైచిలుకు మురిగిపోయూరుు. హా ఒంగోలు నగరపాలక సంస్థకి మంజూరైన నిధులను నగరపాలక పరిధిలో 40 పనులకు కేటాయించగా, వీటిలో రూ. 6.36 కోట్లకి సంబంధించిన 32 పనులు పూర్తి కాగా, మరో రూ.4.81 కోట్లకి సంబంధించిన 8 పనులు జరుగుతున్నాయి. హా అద్దంకి నగర పంచాయతీలో పాలక వర్గం ఒక్క రూపాయి ఖర్చు చేయలేయలేదు. అధికారులు, పాలక వర్గం మాత్రం నిధులు సరిపడా టెండర్లు పిలిచాం, నిధులు వెనక్కి వెళ్లవు మాకే ఫరవాలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోటీ 26 లక్షల 50 వేలు కేటాయించగా, టెండర్లు మాత్రం పిలిచారు. హా చీరాల మున్సిపాలిటీ విషయానికి వస్తే 2015-16 సంవత్సరానికిగాను రూ.6.12కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకుగాను ఇప్పటి వరకు రూ.3.55 కోట్లు మాత్రమే మున్సిపల్ అధికారులు ఖర్చు చేశారు. హా గిద్దలూరు నగర పంచాయతీకి విడుదలైన రూ.కోటి, 56లక్షల,87వేలు నిధులలో కేవలం రూ.11.69 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన రూ.రూ.కోటి,45లక్షల18వేలు రూపాయలు మురిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. హా కనిగిరి నగర పంచాయతీలో రూ.2 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో డ్రైనేజీ, శానిటేషన్ తదితర పనులకు సంబంధించి రూ.1.40 లక్షలు నిధులు ఖర్చు చేశారు. వాటిల్లో కొన్నింటికి బిల్లులు చెల్లింపులు జరిగాయి. మిగిలిన రూ. 60 లక్షల నిధులు ఖర్చు చేయాల్సి ఉంది.హా మార్కాపురంలో 3.88 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటిలో 1.70 కోట్లను అభివృద్ధి పనులకు వినియోగించారు. 2.18 కోట్లు మిగులు నిధులుగా ఉన్నాయి. హా చీమకుర్తి నగరపంచాయితీకి సంబంధించి రూ.1.14 కోట్లు మంజూరైనా వాటిని ఖర్చుపెట్టేందుకు అధికారులకు తీరిక లేదు. దానితో చీమకుర్తి నగర పంచాయతీలో 13వ ఫైనాన్స్‌కు చెందిన రూ.1.14 కోట్లు మురిగిపోయే ప్రమాద ం ఏర్పడింది. ఆయా నిధులతో నగర పంచాయితీలో సైడు కాలువలను నిర్మించాలని నాలుగు రోజుల క్రితం టెండర్లు పిలిచారు. వాటిని ఏప్రిల్ 2వ తేదీన ఓపెన్ చేస్తారు. కానీ నిధులు ఖర్చుపెట్టేందుకు మార్చినెలాఖరు గడువు మాత్రమే ఉండటంతో నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. హా కందుకూరు మున్సిపాలిటీకి మూడు కోట్ల 60 లక్షలు విడుదల కాగా, రెండు కోట్ల 9 లక్షల రూపాయలు మురిగిపోయాయి.