మిగిలింది ఒక్కరోజే | muncipality funds withdraw | Sakshi
Sakshi News home page

మిగిలింది ఒక్కరోజే

Published Wed, Mar 30 2016 5:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

మిగిలింది ఒక్కరోజే

మిగిలింది ఒక్కరోజే

ఖర్చు చేయాల్సింది అక్షరాలా రూ.16 కోట్లు
అధికారుల అలసత్వంతో 13వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి
పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పట్టణం ఒక్కటీ లేదు
జిల్లాలో మున్సిపాల్టీల దుస్థితి...

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా జిల్లాలో పురపాలక సంఘాల పనీతీరు తయారైంది. 13వ ఆర్థిక సంఘం నిధులున్నా ఖర్చు చేయలేని దయనీయ స్థితిలో జిల్లాలోని పలు మున్సిపాలిటీలు ఉండటం గమనార్హం. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా ఖర్చు చేయాల్సిన నిధులు అక్షరాలా రూ.16 కోట్లు పైచిలుకు. అధికారుల అలసత్వం వల్ల నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఒక ప్రణాళిక లేకపోవడంతో పాటు అధికారుల మధ్య నమన్వయ లేమి, రాజకీయ పెత్తనాలు ఈ నిధులు ఖర్చు చేయలేక మురిగిపోయే పరిస్థితికి కారణంగా నిలిచారుు.

గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు  మిగిలిన మున్సిపాలిటీలకు 29 కోట్ల 92 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అందులో రూ.13 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయగా 16 కోట్ల రూపాయల పైచిలుకు మురిగిపోయూరుు.  హా ఒంగోలు నగరపాలక సంస్థకి మంజూరైన నిధులను నగరపాలక పరిధిలో 40 పనులకు కేటాయించగా, వీటిలో రూ. 6.36 కోట్లకి సంబంధించిన 32 పనులు పూర్తి కాగా, మరో రూ.4.81 కోట్లకి సంబంధించిన 8 పనులు జరుగుతున్నాయి. హా అద్దంకి నగర పంచాయతీలో పాలక వర్గం ఒక్క రూపాయి ఖర్చు చేయలేయలేదు. అధికారులు, పాలక వర్గం  మాత్రం నిధులు సరిపడా టెండర్లు పిలిచాం, నిధులు వెనక్కి వెళ్లవు మాకే ఫరవాలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోటీ 26 లక్షల 50 వేలు కేటాయించగా, టెండర్లు మాత్రం పిలిచారు. హా చీరాల మున్సిపాలిటీ విషయానికి వస్తే 2015-16 సంవత్సరానికిగాను రూ.6.12కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

ఇందుకుగాను ఇప్పటి వరకు రూ.3.55 కోట్లు మాత్రమే మున్సిపల్ అధికారులు ఖర్చు చేశారు. హా గిద్దలూరు నగర పంచాయతీకి  విడుదలైన రూ.కోటి, 56లక్షల,87వేలు నిధులలో  కేవలం రూ.11.69 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన రూ.రూ.కోటి,45లక్షల18వేలు రూపాయలు మురిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.  హా కనిగిరి నగర పంచాయతీలో రూ.2 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో డ్రైనేజీ, శానిటేషన్ తదితర పనులకు సంబంధించి రూ.1.40 లక్షలు నిధులు ఖర్చు చేశారు. వాటిల్లో కొన్నింటికి బిల్లులు చెల్లింపులు జరిగాయి. మిగిలిన రూ. 60 లక్షల నిధులు ఖర్చు చేయాల్సి ఉంది.హా మార్కాపురంలో 3.88 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.

వీటిలో 1.70 కోట్లను అభివృద్ధి పనులకు వినియోగించారు. 2.18 కోట్లు మిగులు నిధులుగా ఉన్నాయి.  హా చీమకుర్తి నగరపంచాయితీకి సంబంధించి రూ.1.14 కోట్లు మంజూరైనా వాటిని ఖర్చుపెట్టేందుకు అధికారులకు తీరిక లేదు. దానితో చీమకుర్తి నగర పంచాయతీలో 13వ ఫైనాన్స్‌కు చెందిన రూ.1.14 కోట్లు మురిగిపోయే ప్రమాద ం ఏర్పడింది. ఆయా నిధులతో నగర పంచాయితీలో సైడు కాలువలను నిర్మించాలని నాలుగు రోజుల క్రితం టెండర్లు పిలిచారు. వాటిని ఏప్రిల్ 2వ తేదీన ఓపెన్  చేస్తారు. కానీ నిధులు ఖర్చుపెట్టేందుకు మార్చినెలాఖరు గడువు మాత్రమే ఉండటంతో నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. హా  కందుకూరు మున్సిపాలిటీకి మూడు కోట్ల 60 లక్షలు విడుదల కాగా, రెండు కోట్ల 9 లక్షల రూపాయలు మురిగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement