tiredness
-
విద్యుదీకరణలో యూపీఏ విఫలం
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం వల్లే దేశంలో సంపూర్ణ విద్యుదీకరణ లక్ష్యాలు ఆలస్యమయ్యాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఇప్పటి వరకు విద్యుత్‌కు దూరంగా ఉన్న 2.67 కోట్ల కుటుంబాలకు కూడా ఈ ఏడాది చివరి నాటికి ఆ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకం లబ్ధిదారులతో మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. ఇటీవల చిట్టచివరగా విద్యుదీకరణ జరిగిన మణిపూర్‌లోని లీసాంగ్ గ్రామస్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ పథకాల లబ్ధిదారులతో మోదీ నిర్వహిస్తున్న వరస సమావేశాల్లో ఇది పదోది. 2009 నాటికే దేశంలోని అన్ని గృహాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢాంబికాలకు పోయారని మోదీ ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి 2005లో ఆమె విడుదల చేసిన ఓ ప్రకటనను చదివి వినిపించారు. ఎప్పుడో పూర్తవ్వాల్సింది.. తాము అధికారంలోకి వచ్చే సరికి దేశంలో విద్యుత్ లేని గ్రామాలు 18 వేలు ఉన్నాయని మోదీ వెల్లడించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘ప్రజలకు మంచి చేయాలనుకునే వారు గ్రామాలకు వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలి. నివేదికలు తయారుచేయాలి. పౌర సమాజాలతో మాట్లాడాలి. అలా చేస్తే 2010–11 నాటికే సంపూర్ణ విద్యుదీకరణ జరిగేది. కానీ అప్పుడు చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు లేకపోవడం వల్ల ఆ వాగ్దానాలు అలాగే మిగిలిపోయాయి. మేము ఇచ్చిన వాగ్దానాలపై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, తప్పు లు వెతకడానికి విపక్షాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. వాళ్లకు వెలుగుంటేనే ఉపాధి.. విద్యుత్ సౌకర్యం లేని ఇళ్ల గురించే ప్రతిపక్షాలు మాట్లాడటం తమను విమర్శించడం కాదని, వారిని వారే విమర్శించుకోవడమని మోదీ అన్నారు. ‘70 ఏళ్లు దేశాన్ని నడిపిన వారిదే ఈ వైఫల్యం. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. 4 కోట్ల కుటుంబాలకు వి ద్యుత్ సౌకర్యం లేదంటే.. దాని అర్థం గతంలో వారికి ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను మా ప్రభుత్వం తొలగించిందని కాదు. సున్నా నుంచి మొదలుపెట్టి విద్యుదీకరణకు మౌలిక వసతులు సమకూరుస్తున్నాం. రోజులో మొత్తం సమయా న్ని 12 గంటలకు కుదిస్తే అన్ని పనులు పూర్తవుతాయా? మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న లక్షలాది ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యే వారికి ఉపాధి దొరుకుతోంది. పగటిపూ ట వెలుగును ఆధారంగా చేసుకునే వారి పని గంటలను నిర్ణయిస్తున్నారు’ అని అన్నారు. -
మిగిలింది ఒక్కరోజే
♦ ఖర్చు చేయాల్సింది అక్షరాలా రూ.16 కోట్లు ♦ అధికారుల అలసత్వంతో 13వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి ♦ పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పట్టణం ఒక్కటీ లేదు ♦ జిల్లాలో మున్సిపాల్టీల దుస్థితి... సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా జిల్లాలో పురపాలక సంఘాల పనీతీరు తయారైంది. 13వ ఆర్థిక సంఘం నిధులున్నా ఖర్చు చేయలేని దయనీయ స్థితిలో జిల్లాలోని పలు మున్సిపాలిటీలు ఉండటం గమనార్హం. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా ఖర్చు చేయాల్సిన నిధులు అక్షరాలా రూ.16 కోట్లు పైచిలుకు. అధికారుల అలసత్వం వల్ల నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఒక ప్రణాళిక లేకపోవడంతో పాటు అధికారుల మధ్య నమన్వయ లేమి, రాజకీయ పెత్తనాలు ఈ నిధులు ఖర్చు చేయలేక మురిగిపోయే పరిస్థితికి కారణంగా నిలిచారుు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు మిగిలిన మున్సిపాలిటీలకు 29 కోట్ల 92 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అందులో రూ.13 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయగా 16 కోట్ల రూపాయల పైచిలుకు మురిగిపోయూరుు. హా ఒంగోలు నగరపాలక సంస్థకి మంజూరైన నిధులను నగరపాలక పరిధిలో 40 పనులకు కేటాయించగా, వీటిలో రూ. 6.36 కోట్లకి సంబంధించిన 32 పనులు పూర్తి కాగా, మరో రూ.4.81 కోట్లకి సంబంధించిన 8 పనులు జరుగుతున్నాయి. హా అద్దంకి నగర పంచాయతీలో పాలక వర్గం ఒక్క రూపాయి ఖర్చు చేయలేయలేదు. అధికారులు, పాలక వర్గం మాత్రం నిధులు సరిపడా టెండర్లు పిలిచాం, నిధులు వెనక్కి వెళ్లవు మాకే ఫరవాలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోటీ 26 లక్షల 50 వేలు కేటాయించగా, టెండర్లు మాత్రం పిలిచారు. హా చీరాల మున్సిపాలిటీ విషయానికి వస్తే 2015-16 సంవత్సరానికిగాను రూ.6.12కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకుగాను ఇప్పటి వరకు రూ.3.55 కోట్లు మాత్రమే మున్సిపల్ అధికారులు ఖర్చు చేశారు. హా గిద్దలూరు నగర పంచాయతీకి విడుదలైన రూ.కోటి, 56లక్షల,87వేలు నిధులలో కేవలం రూ.11.69 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన రూ.రూ.కోటి,45లక్షల18వేలు రూపాయలు మురిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. హా కనిగిరి నగర పంచాయతీలో రూ.2 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో డ్రైనేజీ, శానిటేషన్ తదితర పనులకు సంబంధించి రూ.1.40 లక్షలు నిధులు ఖర్చు చేశారు. వాటిల్లో కొన్నింటికి బిల్లులు చెల్లింపులు జరిగాయి. మిగిలిన రూ. 60 లక్షల నిధులు ఖర్చు చేయాల్సి ఉంది.హా మార్కాపురంలో 3.88 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటిలో 1.70 కోట్లను అభివృద్ధి పనులకు వినియోగించారు. 2.18 కోట్లు మిగులు నిధులుగా ఉన్నాయి. హా చీమకుర్తి నగరపంచాయితీకి సంబంధించి రూ.1.14 కోట్లు మంజూరైనా వాటిని ఖర్చుపెట్టేందుకు అధికారులకు తీరిక లేదు. దానితో చీమకుర్తి నగర పంచాయతీలో 13వ ఫైనాన్స్‌కు చెందిన రూ.1.14 కోట్లు మురిగిపోయే ప్రమాద ం ఏర్పడింది. ఆయా నిధులతో నగర పంచాయితీలో సైడు కాలువలను నిర్మించాలని నాలుగు రోజుల క్రితం టెండర్లు పిలిచారు. వాటిని ఏప్రిల్ 2వ తేదీన ఓపెన్ చేస్తారు. కానీ నిధులు ఖర్చుపెట్టేందుకు మార్చినెలాఖరు గడువు మాత్రమే ఉండటంతో నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. హా కందుకూరు మున్సిపాలిటీకి మూడు కోట్ల 60 లక్షలు విడుదల కాగా, రెండు కోట్ల 9 లక్షల రూపాయలు మురిగిపోయాయి. -
ఆంధ్రా శిల్పారామం ఏక్కడ?
శిల్పారామం నిర్మాణంలో అలసత్వం వనరులు సమకూరినా పనులు ప్రారంభించని ైవె నం పర్యాటక శాఖాధికారుల పని తీరుపై సర్వత్రా విమర్శలు ‘అమరావతిని ప్రపంచంలోకెల్లా సుందర రాజధానిగా తీర్చిదిద్దుతాం’ ఇదీ మైక్ పట్టినప్పుడలా ప్రజాప్రతినిధులు పదే పదే వల్లె వేసే పలుకులు. అయితే వీరు చెప్పేదానికి, చేసే దానికి పొంతన ఉండడం లేదు. దీనికి శిల్పారామం ఏర్పాటే నిదర్శనం. జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు భూమి, నిధులు సమకూరాయి. అనుమతులు మంజూరయ్యాయి. అధికారుల్లో మాత్రం చలనం రాలేదు. ప్రజాప్రతినిధులకు పర్యవేక్షించాలన్న ఆలోచన కలగలేదు..శిల్పారామం నిర్మాణానికి అడుగు ముందుకు పడలేదు. గుంటూరు వెస్ట్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పారామానికి దీటుగా రాజధాని ప్రాంతంలో శిల్పారామం నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నదే తడవుగా 13వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించతలపెట్టిన శిల్పారామం కోసం స్థలాన్ని సేకరించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ కాంతిలాల్ దండే గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడులోని సర్వే నంబర్ 237లో 3.60 ఎకరాల ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖకు అప్పగించారు. ఇదంతా కొన్ని నెలల క్రితమే పూర్తయింది. ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ నెల 23న అడవితక్కెళ్లపాడులో జరిగే క్రిస్టియన్ భవన్ శంకుస్థాపనకు సీఎం చంద్రబాబు విచ్చేస్తున్నారు. ఆయనైనా దృష్టి సారించిశిల్పారామం నిర్మాణానికి చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. కళాత్మక విలువలు ఉట్టిపడేలా.. 1992లో శిల్పారామాల ఏర్పాటు ప్రారంభమైంది. సాంస్కృతిక వారసత్వం, భారత కళల సంరక్షణ, చేతివృత్తిల వారిని చైతన్య పరచటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ శిల్పారామాలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఎన్నో కొయ్యబొమ్మలు, ఆభరణాలు, వస్త్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల కళలు, కళాత్మక విలువలను ఉట్టిపడేలా రూపొందిస్తుంటారు. హాలిడే స్పాట్స్‌గా వీటిని తీర్చిదిద్దడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇంత ప్రాధాన్యమున్న శిల్పారామం ఏర్పాటుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక అధికారిని నియమించాలి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న శిల్పారామాలకు తక్షణం ప్రత్యేక అధికారిని నియమించాలి. గతంలో శిల్పారామాల కంటే అత్యంత అద్భుతంగా, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలాగా వాటిని తీర్చిదిద్దాలి. రాజధాని ప్రాంతమైన గుంటూరులో శిల్పారామం నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలి. జాస్తి వీరాంజనేయులు, జాతీయ కార్యదర్శి, అఖిల భారత పంచాయతీ పరిషత్ -
సర్కారుపై సమర శంఖం
-
కేసుల విచారణలో అలసత్వం వద్దు
ఏడుగురు సీఐలకు చార్జి మెమోలు కర్నూలు : కేసుల విచారణలో అలసత్వం వీడాలని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శనివారం కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో అక్టోబర్ నెలలో నమోదైన నేరాలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లెల్ల, జలదుర్గం లాంటి ప్రాంతాల్లో అంటరానితనం తదితర సమస్యల పరిష్కారంపై సంబంధిత పోలీసు అధికారుల పనితీరును ఎస్పీ తప్పుబట్టారు. తాను ఫోన్ చేసి ఆదేశించినా అలసత్వం వహించారని మండిపడ్డారు. కర్నూలు, ఆదోని పట్టణాల్లో అసాంఘిక శక్తులు మత విద్వేషం రెచ్చగొట్టే కార్యకలాపాలు చేసే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో అలసత్వం వహించిన ఏడుగురు సీఐలకు చార్జి మెమోలు జారీ చేశారు. మరికొంతమందిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వచ్చే నెల సమావేశానికి పెండింగ్ కేసుల విచారణను పూర్తి చేసుకుని రాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా తానే బాధితులను పరామర్శిస్తుంటే మీరు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. గుర్తు తెలియని మృతదేహాల కేసుల విచారణలో కర్నూలు టౌన్ పోలీసు అధికారుల పనితీరు బాగాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, విచారణ చేపట్టడానికి ఇబ్బందులేమిటంటూ సీఐలను పేరు పేరున మందలించి సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి నేరస్తులను అరెస్టు చేయాలని ఆదేశించారు. గ్రేవ్ క్రైమ్, నాన్ గ్రేవ్ క్రైమ్‌లను డీఎస్పీలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. కొంతమంది ఎస్ఐలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని ఫిర్యాదులు అందాయన్నారు. ఫ్యాక్షన్, మతపరమైన సంఘటనలు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిసెంబర్ 6వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నందున అందరూ వినియోగించుకోవాలని సూచించారు. సమావేశానికి అదనపు ఎస్పీ శివకోటి బాబురావు, డీఎస్పీలు సీఐలు, ఎస్ఐలు సమావేశానికి హాజరయ్యారు. -
ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ఆళ్లగడ్డ: ఎన్నికల విధుల్లో బీఎల్ఓల పాత్ర కీలకమని.. అందులో నిర్లక్ష్యం విహ ంచినా..పక్షపాతం చూపినా చర్యలు తప్పవని కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారిశాలలో సోమవారం బీఎల్ఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. బీఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఓటరు పేరు ఓట్ల జాబితాలో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. డెత్ రిజిష్టర్ చూసి చనిపోయిన వారి పేర్లు తొలగించాలన్నారు. ఓటరు నమోదుకు ఈనెల 11 వతేదీ వరకు వచ్చిన అర్జీలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే పోలింగ్ బూత్ పరిధిలో ఒకేసారి ఎక్కువ ఓట్లు పెరిగినా, తగ్గినా ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించాలని ఆదేశించారు. ఓట్ల స్లిప్‌లు పంచలేదని ఫిర్యాదులు వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలింగ్ రోజున ప్రతి బీఎల్ఓ ఓటరు సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. వీఆర్వోలు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే కష్టమవుతుందన్నారు. ఇప్పటి నుంచి ఓ ప్రణాళికతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్లు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ ఆళ్లగడ్డ టౌన్: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఎన్నికల, పోలీస్ అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలుసూచనలు, సలహాలు చేశారు. నిర్భయంగా ఓటేయ్యండి శిరివెళ్ల: వచ్చే నెల 8వ తేదీన జరిగే ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఓటర్లకు సూచించారు. సోమవారం గోవిందపల్లె గ్రామంలోని ఎస్పీజీ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో కరెంట్, తాగునీటి సదుపాయాలపై తహశీల్డార్ రాంసుబ్బయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళిత వాడలో ఓ చెట్టు కింద అరుగుపై కూర్చొని దళితులతో ముచ్చటించారు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా.. పోలింగ్ కేంద్రం తెలుసునా అని ఓటర్లను ప్రశ్నించారు. -
అధికారులు అలసత్వం వహిస్తే సహించం
జన్మభూమి-మాఊరులో మంత్రి పలె బుక్కపట్నం : జన్యభూమి-మాఊరు కార్యక్రమంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించమని రాష్ట్ర సమాచార, ఐటీ, మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శనివారం ఆయన హిందూపురం ఎంపీ నిమ్మలకిష్టప్ప, జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌లతో కలసి మండలంలోని కృష్ణాపురంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా అధికారులు అంకిత భావంతో పని చేసి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. నీటి సమస్యను అధిగమించేందుకు ఉన్న నీటి వనరులను వృథా చేయరాదని పేర్కొన్నారు. రైతు, డ్వాక్రా రుణాలను దశల వారీగా మాఫీ చేస్తామని, పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000కి పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పల్లె అన్నారు. ఐదెకరాలకు పైబడి భూమి ఉన్న వారికి సైతం పింఛన్ మంజూరు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఇందులో భాగంగా రైతులందరికి సూక్ష్మ సేద్య పరికరాలు సబ్సిడీపై అందిస్తామన్నారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లోని పలు గ్రామాలకు సత్య సాయి ట్రస్టు సహకారంతో బాబా జన్మదినమైన నవంబర్ 23న తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎంపీ నిమ్మలకిష్టప్ప మాట్లాడుతూ అనంతపురం జిల్లాను దుర్భిక్షం నుంచి శాశ్వతంగా కాపాడాలంటే హంద్రీ-నీవా కాలువలను పూర్తి చేయాల్సిన అవసరముందన్నారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అన్నారు. అనంతరం ముగ్గురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సర్పంచ్ నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కదిరి ఆర్డీ రాజశేఖర్, మండల ప్రత్యేకాధికారి కృష్ణానాయక్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ కుష్‌కుమార్‌రెడ్డి, తహశీల్దార్ ఉషారాణి, ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఎంపీపీ రవి, ఏఓ నటరాజ్, పశువైద్యుడు చెన్నకేశవులునాయక్, డాక్టర్లు రాగిణి, కిజరున్నీషా, ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పలత, యాదలంకపల్లి సర్పంచ్ గంగమనాయుడు, తదితరులు పాల్గొన్నారు.