withdraw cash
-
అకౌంట్ లో డబ్బులు లేకున్నా 80,000 విత్ డ్రా చేసుకోవచ్చు...
-
బ్యాంక్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఈ లావాదేవీలపై..
ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ సంస్థలు తన కస్టమర్లకు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డిజిటల్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి ఈ నేపథ్యంలో ప్రతి రోజు లక్షలాది బ్యాంక్ ఖాతాదారులు అటు ఆఫ్‌లైన్ ఇటు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే వీటిలో పలు సేవలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం సేవలు అందిస్తున్న పలు బ్యాంకులు ఇటీవల ఆయా సేవలపై చార్జీలు పెంచేశాయి. బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్ చార్జీల బాదుడిని మొదలెట్టాయి. ఏ బ్యాంకులు ఎంత పెంచాయో తెలుసుకుందాం! ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఏటీఎం పై ప్రతి ప్రాంతంలో ఉచితంగా 5 లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే, మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంక్ ఏటీఎం( ATM)లలో ఈ సంఖ్య మూడుకి తగ్గించింది. అవి ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్. ఒకవేళ ఈ పరిమితి దాటి విత్‌డ్రా చేస్తే.. ఎస్బీఐ ఏటీఎంల్లో 5 లావాదేవీలు దాటాక ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో పరిమితి దాటి జరిపే వాటిపై రూ.20 వసూలు చేస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ HDFC బ్యాంక్ తన ఏటీఎం (ATM) నుంచి నెలకు 5 చొప్పున ఉచిత లావాదేవీలను అందిస్తుంది. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఉచిత లావాదేవీల సంఖ్య మూడు కాగా, నాన్ మెట్రో నగరాల్లో ఐదు. ఆ తర్వాత, విత్‌డ్రా చేస్తే రూ. 21 కాగా, ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 ఛార్జ్ చేస్తారు. ఐసీఐసీఐ బ్యాంక్ ICICI బ్యాంక్ కూడా 5, 3 రూల్స్‌ని పాటిస్తుంది. అనగా ఆరు మెట్రో స్థానాల్లో(ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) ఐసీఐసీఐ ఏటీఎం ( ATM) నుంచి 5 విత్‌డ్రాలు, ఇతర బ్యాంక్ ATMల నుంచి 3 ఉచిత లావాదేవీలు మాత్రమే ఉచితం. దీని తర్వాత, బ్యాంకు ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సొంత ఏటీఎంల్లో మెట్రో సిటీల పరిధిలో 5 ఉచితంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఒకవేళ ఈ పరిమితి దాటిన ప్రతి నగదు లావాదేవీలపై రూ.21, ఆర్థికేతర లావాదీవీలపైన రూ.10 వసూలు చేస్తుంది. పీఎన్బీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా మెట్రో పాలిటన్ సిటీల పరిధిలో తమ ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీల వరకు మాత్రమే ఉచితం. అంతకు మించి జరిపే ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల్లో పరిధి దాటిన ఆర్థిక లావాదేవీలపై రూ. 20, ఆర్థికేతర లావాదీవీల మీద రూ. 9 చార్జ్ చేస్తోంది. చదవండి: ట్విటర్లో ఉద్యోగాల కోతలు షురూ -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు చేదువార్త. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న విత్ డ్రా, డిపాజిట్ సేవలకు జనవరి 1, 2022 నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు అందించే ఉచిత లావాదేవీల పరిమితిని అధిగమించిన తర్వాత ప్రత్యేకమైన ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఐపీపీబీ తెలిపింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రతి నెల ఉచితంగా 4 లావాదేవీలు చేయవచ్చు, ఆ తర్వాత ప్రతి విత్ డ్రా లావాదేవీకి దాని విలువలో 0.50%(కనీసం రూ.25) ఛార్జీల రూపంలో వసూలు చేయనుంది. ఈ ఖాతాదారులకు క్యాష్ డిపాజిట్ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కాకుండా ఇతర పొదుపు ఖాతాదారులు, కరెంట్ ఖాతాదారులు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకునే మొత్తంలో 0.50 శాతం (కనీసం రూ.25) వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఈ ఖాతాదారులు రూ.10వేల వరకు క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేల మొత్తానికి పైగా డిపాజిట్ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది. గతంలో కూడా ఉచితంగా అందిస్తున్న డోర్ స్టెప్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తుంది. 01 ఆగస్టు 2021 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. (చదవండి: మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్..! వచ్చే మూడేళ్లలో..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు ఊరట
కరోనా మహమ్మారి కొనసాగుతున్న ఈ తరుణంలో వినియోగదారులకు ఉపశమనం కలిగే విధంగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రోజులో ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేసే పరిమితిని పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు మీ పొరుగు శాఖకు(హోమ్ బ్రాంచ్ మినహా) వెళ్లి ఒక రోజులో విత్ డ్రా ఫారం సహాయంతో రూ.25000 వరకు విత్ డ్రా చేయొచ్చు. బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. విత్ డ్రా ఫారం ద్వారా మరొక శాఖకు వెళ్ళినప్పుడు వినియోగదారులు తమ పొదుపు ఖాతా నుంచి 25 వేల రూపాయల వరకు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది. అదే చెక్ ద్వారా అయితే మరో శాఖ నుంచి 1 లక్ష రూపాయల వరకు తీసుకోవచ్చు అని తెలిపింది. థర్డ్ పార్టీ నగదు ఉపసంహరణ పరిమితిని 50 వేల రూపాయలకు పెంచారు. తక్షణమే ఈ కొత్త నిబంధనల అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు 30 సెప్టెంబర్ 2021 వరకు వర్తిస్తాయి. నగదు ఉపసంహరించుకునే కొత్త నిబంధనలతో పాటు, బ్యాంక్ కూడా షరతులను అమలు చేసింది. థర్డ్ పార్టీ ఉపసంహరణ ఫారం ద్వారా నగదు ఉపసంహరించుకోలేమని బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాకుండా థర్డ్ పార్టీ కేవైసీ పత్రం కూడా అవసరం. ఎస్బీఐ తన రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలలో 8 ఉచిత లావాదేవీలను అందిస్తుంది. ఇందులో 5 ఎస్బీఐ ఎటిఎంలు, మరో 3 బ్యాంక్ ఎటిఎంల లావాదేవీలు ఉంటాయి. నాన్-మెట్రో నగరాల్లో 10 ఉచిత ఎటిఎం లావాదేవీలు ఉంటాయి. ఇందులో 5 లావాదేవీలు ఎస్బీఐతో పాటు మరో 5 లావాదేవీలు వేరే బ్యాంకుల ఎటిఎంల ద్వారా తీసుకునే సదుపాయం కల్పించింది. చదవండి: గుడ్ న్యూస్ : మూడు రోజుల్లోనే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా -
15 రోజుల్లో రూ.950 కోట్ల ఈపీఎఫ్ విత్‌డ్రాయెల్స్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్‌డౌన్ పరిస్థితులతో ఎన్నో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగుల భవిష్యనిధి– ఈపీఎఫ్ఓ నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతించడంతో.. స్పందన అధికంగానే వస్తోంది. గడచిన 15 రోజుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువకు సంబంధించి 3.31 లక్షల క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో పరిష్కరించినట్టు గురువారం కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఈపీఎఫ్ నిధిలో చందాదారుని వాటా మొత్తం నుంచి 75 శాతం లేదా మూడు నెలల మూలవేతనం, కరువు భత్యం ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ఓ స్కీమ్ నోటిఫికేషన్ మార్చి 28న వెలువడింది. -
మాయమాటలతో బురిడీ కొట్టించి
కడప కోటిరెడ్డి సర్కిల్: తాము ఫలానా విభాగానికి చెందిన అధికారులమంటూ పలువురికి ఫోన్ చేసి మాయమాటలతో బురిడీ కొట్టించి వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును డ్రా చేసుకునే సైబర్ నేరగాళ్లను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. బుధవారం కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఇటీవల మైదుకూరు పట్టణానికి చెందిన గిద్దలూరు ఉమాదేవికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను ఎల్ఐసీ అధికారినని మీకు ఎల్ఐసీ నుంచి బోనస్‌గా కొంతమేర డబ్బులు వచ్చాయని, వాటిని చెక్ రూపంలో పంపించామని, మీరు ఇంటి వద్ద లేకపోవడంతో తమ ఆఫీసుకు తిరిగి వచ్చిందని చెప్పాడు. మీరు ఒప్పుకుంటే మీ ఖాతాకు డబ్బు పంపుతామని నమ్మబలికాడు. ఈ మేరకు సదరు మహిళకు చెందిన ఏటీఎం నంబరు వివరాలు చెబితే వెంటనే డబ్బులు జమ చేస్తామని అతను చెప్పాడు. దీంతో ఆమె అందుకు అంగీకరించి ఏటీఎం నంబరు చెప్పింది. ఆ వెంటనే ఆమె ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా అపరిచిత వ్యక్తికి చెప్పేసింది. దీంతో క్షణాల్లో ఆమె ఖాతా నుంచి రూ.10వేలు డ్రా చేసినట్లు ఆమె మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. ఆమె వెంటనే వివరాలు అడిగిన వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తప్పని పరిస్థితుల్లో బాధితురాలు గత నెల 31వ తేదీన మైదుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు చేసిన ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుడు మైదుకూరుకు చెందిన వీరనాగయ్యగా కడప సైబర్ క్రైమ్ స్టేషన్‌వారు గుర్తించారు. తీగ లాగితే.. వీరనాగయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా 2017లో మైదుకూరు పాతపాలెంకు చెందిన శివ అనే వ్యక్తి పరిచయమై ఢిల్లీలో కాల్ సెంటర్ ఉద్యోగం ఇప్పిస్తామని నెలకు రూ.13000 జీతంతోపాటు ఉచిత నివాసం, భోజన సదుపాయం ఉంటుందని చెప్పి వీరనాగయ్యతో పాటు వనిపెంటకు చెందిన మురళి యాదవ్, ఆళ్లగడ్డకు చెందిన రవి, గిద్దలూరుకు చెందిన రమణలను ఢిల్లీకి తీసుకెళ్లాడు. ధనలక్ష్మీ యంత్రం, కాలేయ సమస్యల నివారణకు ఆయుర్వేద మందులను ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొబైల్ వినియోగదారుల సమాచారాన్ని సేకరించి ఢిల్లీకి చెందిన సుమిత బన్సాలి, శివరా త్రి కార్తీక్, నరాల కార్తీక్‌లకు ఇచ్చే వారు. మైదుకూరు కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ఢిల్లీకి సమాచారం పంపుతూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఎల్ఐసీ పాలసీదారులు, రైతులను మోసగిస్తూ సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న నలుగురు నిందితులను ముందే అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీకి వెళ్లి సుమిత బన్సాలి, శివరాత్రి కార్తీక్, నరాల కార్తీక్ అనే నేరగాళ్లను అరెస్టు చేసి కడపకు తీసుకువచ్చారు. నిందితుల మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, లాప్‌టాప్‌లు సీజ్ చేశామని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో మైదుకూరు, కడప సైబర్ స్టేషన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
రూ.1.40 వేలు మాయం!
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టి ఆదర్శ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న మిత్తన నిమ్మయ్య ఈ నెల 6న ఇచ్ఛాపురం ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న ఏటీఎం కేంద్రానికి వెళ్లి రూ.20 వేలు విత్ డ్రా చేశారు. సొమ్ము వచ్చినట్లు శబ్ధం వచ్చినప్పటికీ డబ్బులు రాలేదు. ఆయన టోల్ ఫ్రీ నంబర్ 1800112211కు ఫోన్ చేయడంతో పాటు స్థానిక ఎస్బీఐ మేనేజర్‌కు సమాచారం అందించారు. అదే రోజు రాత్రి మరలా బ్యాంకు ఖాతాలో రూ.20వేలు చేరినట్లు మేసేజ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అక్కడకు మూడు రోజుల అనంతరం 10వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో వరుసగా రూ.20వేలు, రూ.40వేలు, రూ.20వేలు, రాత్రి 12 తర్వాత రూ.40వేలు మొత్తం రూ.1లక్షా 40వేలు విత్ డ్రా అయినట్లు వచ్చిన మెసేజ్‌ను ఉదయం చూసి అవాక్కయ్యారు. ఈ సొమ్మును రాజస్తాన్ రాష్ట్రంలో ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసినట్లు మేసేజ్ రావడంతో మరలా బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించడంతోపాటు ఈ నెల 17న ఇచ్ఛాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేటికి వారం రోజులు కావస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో సోమవారం ఆయన విలేకరులను ఆశ్రయించి తన గోడును వెళ్లబుచ్చారు. తన సొమ్మును తనకు ఇప్పించాలంటూ ఆయన బ్యాంకు, పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. -
డిజి‘డల్’!
పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసి నేటికి ఏడాదికి గడిచిపోయింది. కొత్త రంగుల్లో రూ.2000, రూ.500 నోట్లు వచ్చాయి. ఇటీవలే రూ.200 నోట్లు, రూ.50 నోట్లు కూడా దర్శనమిస్తున్నాయి. కానీ బ్యాంకులు, ఏటీఎంల ముందు ఖాతాదారుల కష్టాలు మాత్రం నేటికీ తీరట్లేదు. నెల ప్రారంభంలోనే ఏటీఎంలు వెలవెలబోతున్నాయి. ఖాతాల్లో నగదు ఉన్నా బ్యాంకుల్లో నిబంధనల వల్ల అక్కడా విత్‌డ్రా కష్టాలు తప్పట్లేదు. నగదుతో సంబంధం లేకుండా స్వైపింగ్ మెషిన్లు వాడండంటూ ప్రభుత్వం హోరెత్తించినా అవి కాస్త ఢమాల్‌మన్నాయి. వ్యాపారులు మెషిన్ వాడకం కన్నా ‘క్యాష్’ తీసుకోవడంపైనే ఆసక్తి చూపిస్తున్నారు. కాదు కార్డే ఇస్తామంటే 2 శాతం ఎక్కువ మొత్తం బాధేస్తున్నారు. డిజిటల్ కరెన్సీ వాడకంపై బ్యాంకు సిబ్బందితో పాటు డీఆర్డీఏ, డ్వామా, పురపాలక సంఘాలు, పంచాయతీల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ఇటీవల వరకూ అవగాహన సదస్సులు నిర్వహించి నా పెద్దగా ఫలితం కనిపించట్లేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నగదు రహిత లావాదేవీల నిర్వహణ ఏడాది తిరిగేకల్లా పూర్తిస్థాయిలో సాధిస్తామని అధికార పార్టీ నాయకులు ప్రారంభంలో చాలా హడావుడి చేశారు. డిజిటల్ కరెన్సీ వాడకం సాధ్యాసాధ్యాలపై నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేసినా కొట్టిపారేశారు కూడా. వాస్తవానికి జిల్లాలో నగదురహిత లావాదేవీలు నిర్వహించడానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అంతంత మాత్రమే. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలు దాదాపు 5.27 లక్షల వరకూ ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం సజీవంగా (కేవైసీ) ఉన్నవి కేవలం 3 లక్షలకు మించిలేవు. అంటే 60 శాతమే. మిగిలినవన్నీ ఉపయోగంలో లేనివే. సాధారణ బ్యాంకు ఖాతాలు జిల్లాలో 25 లక్షల వరకూ ఉన్నాయి. వాటిలో 30 శాతం మంది మొబైల్లో బ్యాంకింగ్ సేవలు వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నా సాంకేతిక సమస్యల వల్ల ఆ స్థాయిలో కూడా ఉండవనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మొబైల్ బ్యాంకింగ్‌కు స్మార్ట్‌ఫోన్‌తో పాటు లావాదేవీలపై అవగాహన ఉన్నవారు సామాజిక, ఆర్థిక, అక్షరాస్యత పరిస్థితుల దృష్ట్యా చూస్తే జిల్లాలో రెండు లక్షలు వరకూ ఉంటే గొప్ప విషయమే. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు, నిరక్షరాస్యులు ఎక్కువ. జన్‌ధన్ ఖాతాలు ఎక్కువగా మహిళలకే ఉన్నాయి. నిరక్షరాస్యత వారిలోనే ఎక్కువ. అయితే జిల్లాలో 3,90,771 రూపే కార్డులు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ అవి పెద్దగా ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. ‘పని’కిరాని పీవోఎస్‌లు.. ఎక్కడికక్కడ చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకూ, ఆర్టీసీ, రైలు టిక్కెట్ల నుంచి బిల్లుల చెల్లింపుల వరకూ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తామని పెద్దనోట్ల మార్పిడి ప్రక్రియ తర్వాత ప్రభుత్వం ఊదరగొట్టింది. కానీ అవెక్కడున్నాయో ప్రస్తుతం కనిపించట్లేదు. తొలుత 891, ఆ తర్వాత మరో 2,500 పీవోఎస్ మెషిన్లు అందుబాటులోకి తెచ్చామని అధికారులు చెప్పారే తప్ప అవెప్పుడో మూలకు చేరిపోయాయి. జిల్లాలో బ్యాంకు ఆఫ్ బరోడా ద్వారా 480 పీవోఎస్ మెషిన్లు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉపయోగించేందుకు తెప్పించామని అధికారులు ప్రకటించినా ఇప్పటివరకూ ఏ ఒక్క బస్సులోనూ వాడిన దాఖలాలు లేవు. స్వైపింగ్ మెషిన్లు వాడకం కొందరికే.... జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లోనూ సూపర్ మార్కెట్లకే స్వైపింగ్ మిషన్లు పరిమితమయ్యాయి. కిరాణా దుకాణాల్లో ఎక్కడా కనిపించట్లేదు. పెద్ద దుకాణాల్లో మాత్రమే స్వైపింగ్ మెషిన్లు కనిపిస్తున్నాయి. కానీ నగదు తీసుకోవడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కాదు కార్డు ఉందని చెబితే అదనంగా రెండు శాతం వరకూ నగదు వసూలు చేస్తున్నారు. కార్డు ఎందుకు దండగ అంటూ కొంతమంది వ్యాపారులు నగదు లావాదేవీలనే ప్రోత్సహించడం గమనార్హం. ఇక బంగారం దుకాణాల్లో చాలావరకూ నగదుతోనే లావాదేవీలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం సహా జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సుల్లో టిక్కెట్ల కౌంటర్లలో ప్రయాణికుల కోసం స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏ ఒక్క కౌంటర్లోనూ కనిపించట్లేదు. స్వైపింగ్ మిషన్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ సమస్యలతో మొరాయిస్తుండటంతో వాటిని ఎప్పుడో పక్కనపెడేశారు. పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మెషిన్లతో లావాదేవీలు 20 శాతం మించట్లేదు. పెద్ద నోట్లు రద్దు తర్వాత చిల్లర కొరత ఏర్పడిన సమయంలో చౌక డిపోల్లో తప్పనిసరిగా నగదురహితలావాదేవీలు అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. కానీ ప్రస్తుతం ఎక్కడా చౌక డిపోల్లో అమలు చేయటంలేదు. బ్యాంకుల్లో రూ.50 వేలుకు మించి విత్‌డ్రా, డిపాజిట్లకు పాన్ కార్డు అడుగుతుండటంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నగదు కొరత లేకున్నా విత్‌డ్రాలపై పరిమితి విధించడం వల్ల సమస్య తప్పట్లేదని కొంతమంది వాపోతున్నారు. ఏటీఎంల్లో కూడా తరచుగా నగదు కొరత సమస్య ఏర్పడుతోంది. -
అంత ఇవ్వలేం!
నగదు విత్‌డ్రాపై బ్యాంకుల అనధికార కోతలు ♦ వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చంటున్న కేంద్రం ♦ బ్యాంకుల్లో మాత్రం ఇస్తున్నది రూ.నాలుగైదు వేలే ♦ ఆర్బీఐ మౌఖిక ఆదేశాలున్నాయంటున్న మేనేజర్లు ♦ హైదరాబాద్‌లో భారీగా నగదు మార్పిడి జరుగుతోందంటూ ఆర్థిక శాఖకు నివేదికలు ♦ బ్లాక్‌మనీని విపరీతంగా చలామణీలోకి తెచ్చారంటూ ఐబీ రిపోర్ట్.. పాతబస్తీ కేంద్రంగా వందల కోట్ల పాత నోట్ల మార్పిడి! ♦ నగరంలో రూ.4,200 కోట్ల మేర నగదు మార్పిడి! సాక్షి, హైదరాబాద్ వారానికి రూ.24 వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం, రిజర్వు బ్యాంకు ప్రకటనలు ఆచరణలో అమలుకావడం లేదు. ఏ బ్యాంకుకు వెళుతున్నా ఖాతాదారులకు కేవలం రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు మాత్రమే నగదు చేతిలో పెడుతున్నారు. అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. ఇదేమిటంటే రిజర్వుబ్యాంకు నుంచి అనధికారిక ఆదేశాలు ఉన్నాయంటూ బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. పెళ్లిళ్లు ఉన్నవారు పత్రికలు, ఆధారాలు పట్టుకుని బ్యాంకులకు వెళుతున్నా.. రూ.2.5 లక్షలు నగదు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అంటే బ్యాంకుల్లో సరిపడినం తగా నగదు ఉందన్న రిజర్వు బ్యాంకు ప్రకటనలు ఉత్తి డొల్లేనని స్పష్టమవుతోంది. ఖాతాదారులకు చుక్కలు.. శనివారం హైదరాబాద్‌లోని అన్ని బ్యాంకులూ నగదు ఉపసంహరణ కోసం వచ్చిన ఖాతాదారులకు చుక్కలు చూపించాయి. బ్యాంకులో నగదు లేదంటూ వచ్చిన ప్రతి ఖాతాదారుడికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు మాత్రమే ఇచ్చాయి. మరీ అత్యవసరంగా కావాలంటూ నిలదీసిన వారికి మాత్రం కొన్ని బ్యాంకులు రూ.10 వేల వరకు ఇచ్చాయి. ప్రైవేటు బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిం చింది. అయితే సాధారణ ఖాతాదారులకు రూ.10 వేలు ఇవ్వడానికి కూడా నిరాకరించిన ప్రైవేటు బ్యాంకులు.. ప్రాధాన్య ఖాతాదారులకు మాత్రం రూ.24 వేల వరకు ఇచ్చాయి. మామూలుగా రూ.50 కోట్ల నుంచి వంద కోట్ల మేర టర్నోవర్ చేసే బ్యాంకులు శనివారం రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు మాత్రమే లావాదేవీలు నిర్వహించడం గమనార్హం. భారీగా నల్లధన మార్పిడి జరిగిందంటూ నివేదికలు నోట్ల రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా భారీగా నల్లధనం మార్పిడి జరిగిందని కేంద్రం గుర్తించింది. నగదు మార్పిడిలో ఇందులో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తరువాత దేశంలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె ఉన్నాయి. గత వారం రోజుల్లో హైదరాబాద్‌లో సుమారు రూ.4,200 కోట్ల మేర కరెన్సీ మార్పిడి జరిగిందని... ప్రత్యేకించి నగరంలోని ఓ ప్రాంతంలో ఏకంగా రూ.1,900 కోట్ల మేర పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చారని కేంద్ర ఆర్థిక శాఖకు నిర్దిష్టమైన సమాచారం అందింది. మార్పిడికి వచ్చిన వారు ఒకసారి ఉపయోగించిన ఆధార్ పత్రాన్నే 10 సార్లకంటే ఎక్కువగా వినియోగించారని ఇంటెలిజె¯Œ్స బ్యూరో (ఐబీ) కూడా అనుమానం వ్యక్తం చేస్తూ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో నగదు చలామణికి అడ్డుకట్ట వేయాలని కూడా రిజర్వుబ్యాంకుకు సూచించినట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా కొందరు బ్యాంకర్లు పెద్ద ఎత్తున నగదును బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు వచ్చిన ఫిర్యాదులపై రిజర్వుబ్యాంకు మౌనం దాల్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ సాధారణ ఖాతాదారుల లావాదేవీలపై మాత్రం అనధికార నియంత్రణ విధించడం గమనార్హం. ఖాతాలో డబ్బున్నా.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రామకృష్ణారావు ముసారాంబాగ్‌లోని ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళ్లి రూ.24 వేలకు చెక్కు సమర్పించారు. కొద్దిసేపు తటపటాయించిన అధికారులు బ్యాంకులో నగదు లేదన్నారు. నిబంధనల ప్రకారం తనకు రూ.24 వేలు ఎందుకివ్వరని ఆయన నిలదీశారు. దీంతో నగదు రావాల్సి ఉందంటూ గంటసేపు కూర్చోబెట్టి రూ.5 వేలు మాత్రమే ఇచ్చి పంపారు. ఎల్బీ నగర్‌కు చెందిన ఈసీఐఎల్ ఉద్యోగి చంద్రశేఖర్‌రావు తనకు డబ్బు అవసరమంటూ స్థానిక ఆంధ్రాబ్యాంకుకు వెళితే నగదు లేదని తిప్పిపంపారు. సింగపూర్‌లో ఉన్నత విద్య కోసం తన కుమారుడు వెళుతున్నాడంటూ సరైన ఆధారాలతో దిల్సుఖ్నగర్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖకు వచ్చిన ప్రతాప్‌రెడ్డికి అధికారులు చుక్కలు చూపించారు. తన ఖాతాలో ఉన్న మొత్తానికి ట్రావెలర్ చెక్కు ఇవ్వడానికీ అధికారులు ససేమిరా అనడంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవే కాదు.. శనివారం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. ఒక్క ఎస్బీఐ శాఖలకు వెళ్లిన ఖాతాదారులకు మాత్రం రూ.10 వేల వరకు నగదు ఇచ్చారు. ప్రయాణాలన్నీ వాయిదా.. విదేశాలకు వెళ్లేందుకు ఆరు నెలలు ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకున్నవారు ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకుంటున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన సీతారామారావు తన నలుగురు కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 21న యూరప్ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. కానీ అక్కడి ఖర్చుల కోసం అవసరమైన మేర యూరోలు (యూరప్ కరెన్సీ) తీసుకొనేందుకు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. తనకు ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి ఖాతాలో ఉన్న నగదుకు సరిపడా యూరోలు ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ అందుకు నిబంధనలు అంగీకరించవని బ్యాంకర్లు స్పష్టం చేయడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. టికెట్ల రద్దుతో రూ.93 వేలు నష్టపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలా ఎందరో దేశ విదేశీ ప్రయాణాల కోసం ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నా.. రద్దు చేసుకున్నారు. ‘‘నా తమ్ముడి కుమారుడి పెళ్లి ఉంది. వివాహం సందర్భంగా ఓ పది గ్రాముల బంగారం కొనుగోలు చేయడానికి రూ.31 వేలు కావాలి. నిబంధనల ప్రకారం నాకు రూ.24 వేలు అయినా ఇవ్వండంటూ చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళితే.. అబ్బే రూ.10 వేలతో సర్దుకొండంటూ చేతిలో పెట్టారు. మరో నాలుగు రోజులు ఇలాగే ఉంటే ప్రజలు దాడులు చేసినా ఆశ్చర్యం లేదు..’’ అని బంజారాహిల్స్‌కు చెందిన దక్షిణామూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి ఖర్చులకు 2.5 లక్షలు ఉత్తిదే..! వివాహాలు జరుగుతున్న కుటుంబాల వారికి రూ.2.5 లక్షలు నగదు ఇస్తామని కేంద్రం ప్రకటించి మూడు రోజులవుతున్నా బ్యాంకర్లు దానిని అమలు చేయడం లేదు. ఇంకా తమకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదని కొన్ని బ్యాంకులు చెబుతుంటే... పెళ్లికి సంబంధించి వివిధ కార్యక్రమాలకు ఇచ్చిన అడ్వాన్స్ రసీదులు చూపాలంటూ మరికొన్ని బ్యాంకులు సతాయిస్తున్నాయి. దీంతో ఆశగా బ్యాంకులకు వెళుతున్నవారు ఆందోళనతో వెనుదిరుగుతున్నారు. ‘‘ఈ చర్యతో దేశం బాగుపడుతుందో లేదో నాకు తెలియదు. నాలాంటి వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేమేమో నగదు లేక ఇబ్బంది పడుతుంటే.. కొందరు ఏం ఫరవాలేదు మా దగ్గర కొత్త నోట్లున్నాయి.. 35 శాతం ఎక్కువ పాత నోట్లు ఇచ్చి తీసుకువెళ్లండంటూ ఫోన్లు చేస్తున్నారు. ఇదేనా నల్లధనం కట్టడి..?’’ అని నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన రిటైర్డ్ టీచర్ భావ నారాయణ ఆవేదన చెందారు. తన మనవరాలి వివాహం దృష్టా ్య రూ.2.5 లక్షలు ఇవ్వాలంటూ దిల్‌సుక్‌నగర్‌లో ఓ ప్రైవేట్ బ్యాంకుకు వెళ్లినా ఫలితం లేదని.. తన ఖాతాలోని డబ్బుకే ఇన్ని ఆంక్షలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రూ.2 వేల నోట్లతో తంటాలు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లోని అన్ని చోట్లా భారీ క్యూలు దర్శనమిస్తూనే ఉన్నాయి. బ్యాంకుల్లో మొదట వచ్చిన వారికి మాత్రమే రూ.వంద నోట్లు లభిస్తుండగా.. తరువాత వచ్చిన వారికి రూ.2 వేల నోట్లు ఇస్తున్నారు. వీటికి మార్కెట్లో చిల్లర లభించకపోతుండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలు ఏటీఎంలలోనూ రూ.2 వేల నోట్లు మాత్రమే రావడంతో చిల్లర కష్టాలు తప్పడం లేదు. శనివారం బ్యాంకుల్లో ఖాతాదారులకు మాత్రమే సేవలు అందించిన నేపథ్యంలో ఎక్కువ శాతం ప్రజలు ఏటీఎంల వైపు మళ్లడంతో అన్ని చోట్లా రద్దీ కనిపించింది. ప్రజల్లో అశాంతి పెరుగుతోంది నగదు లభించకపోతుండడంతో ప్రజల్లో అశాంతి నెలకొంటోందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)తో పాటు రాష్ట్ర నిఘా విభాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌కు ఇంటెలిజెజెన్స్ విభాగం తాజా పరిస్థితిపై నివేదిక అందజేసింది. పెద్ద నోట్లు రద్దు చేసి పది రోజులైనా పరిస్థితిలో మార్పు రాలేదని.. నగదు కోసం ప్రజలు అల్లాడుతున్నారని వివరించింది. ఐబీ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల జనం ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటనలను ప్రస్తావించింది. సోమవారం బ్యాంకులకు కొత్త రూ.500 నోట్లు అందుతాయని, ప్రస్తుతమున్న అలజడి బుధవారం నాటికి సర్దుకుంటుందని రిజర్వుబ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
పరిమితి ఎత్తేస్తారా..సమ్మె చేయమంటారా?
నగదు విత్‌డ్రాపై కేంద్రానికి రవాణా వాహన సంఘాల అల్టిమేటం సాక్షి, హైదరాబాద్: సామాన్యుడిని నానా తిప్పలు పెడుతున్న ‘పెద్ద నోట్ల రద్దు’వ్యవహారం ఇప్పుడు మరిన్ని సమస్యలకు దారితీసేలా కనిపిస్తోంది. పాత నోట్ల మార్పిడి కోసం గంటల తరబడి లైన్లలో పడిగాపులు పడడం, ఇచ్చే మొత్తంపై పరిమితి, కొత్త రెండు వేల నోట్లకు మార్కెట్లో చిల్లర దొరకకపోవటం వంటి బాధలు పడలేమంటూ ప్రైవేటు ట్రావెల్స్, రవాణా వాహనాల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. నగదు విత్‌డ్రా పరిమితుల నుంచి తమను మినహాయించాలని.. లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు ఆయా సంఘాల అఖిల భారత స్థాయి ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కలిసి అల్టిమేటం ఇచ్చాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా సంఘాలు సమ్మెకు సన్నద్ధమవుతున్నారుు. ఖమ్మంలో మంగళవారం జరుగనున్న తెలంగాణ లారీ యజమానుల సంఘం సమావేశంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. నానా పాట్లు పడుతున్నాం.. మార్గమధ్యంలో లారీ టైరు పంక్చర్ అయితే దాన్ని మరమ్మతు చేసుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితి నెలకొందని.. ఏదైనా వాహనం మరమ్మతుకు గురైతే, అక్కడే నిలిపివేసి దిక్కులు చూడాల్సిన దుస్థితి వచ్చిందని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటం, ఇది ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు లేకపోవడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమ్మెకు సిద్ధం కావాలని ఆలిండియా ట్రాన్సపోర్టు వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే సమ్మెకు సిద్ధం కావాలని కొన్ని రాష్ట్రాల సంఘాలు సూచించడంతో.. జాతీయ నేతలు మెరుపు సమ్మె యోచన విరమించుకుని కేంద్ర మంత్రులను కలిశారు. పర్మిట్ పత్రాలు చూపిస్తే బ్యాంకుల్లో తమకు ఎక్కువ మొత్తం సొమ్ము విత్‌డ్రా చేసుకుని వెసులుబాటు కల్పించాలని కోరారు. దీనిపై సానుకూల స్పందనేదీ రాలేదని సమాచారం. అయితే సోమవారం నాటికి స్పష్టత రాని పక్షంలో సమ్మెపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అదే జరిగితే ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోరుు సామాన్యుడి కష్టాలు రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక చేతిలో సరిపడా చిల్లర లేక, అవసరమైనంత డబ్బు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు లేక, ఏటీఎంలు పనిచేయక చాలా మంది ప్రయాణాలను వారుుదా వేసుకుంటున్నారని... ఇది తమపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో వారు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు -
కార్డు కాజేశారు... క్యాష్ డ్రా చేశారు...
రణస్థలం : ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడంలో సహాయం చేసినట్లు నటించి ఏటీఎం కార్డు తస్కరించిన ఓ ఆగంతకుడు సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు విత్‌డ్రా చేశాడు. విషయం తెలిసి బాధితుడు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే... లావేరు మండలం లింగాలవలసకి చెందిన లుకలాపు అప్పలనాయుడికి రణస్థలంలోని ఎస్బీఐలో 32033222913 నంబరుతో ఖాతా ఉంది. సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేయడంతో ఆ సంస్థ యాజమాన్యం అప్పలనాయుడు ఖాతాలో ఈ నెల 3న రూ.2 లక్షలు జమచేసింది. అదేరోజున అప్పలనాయుడు డబ్బులు తీసుకోడానికి రణస్థలంలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎంలో కార్డు పెట్టినా డబ్బులు రాకపోవడంతో పక్కనే ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం తీసుకున్నాడు. మూడు విడతలుగా రూ.35 వేలు తీసుకున్న తర్వాత ఆగంతుకుడు అప్పలనాయుడుకు వేరొకరి ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిని అప్పలనాయుడు కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బలు అవసరమై ఏటీఎంకు వెళ్లగా డబ్బులు రాకపోవడంతో అప్పలనాయుడు బ్యాంకు అధికారులను సంప్రదించగా కార్డు టిబిక్రమ్ ప్రధాన్‌ది అని చెప్పడంతో మోసపోయానని గుర్తించాడు. ఖాతాలో నిల్వ ఎంత ఉన్నదీ వాకబుచేయగా రూ. 2 లక్షలకు 71 మాత్రమే ఉండడంతో విస్తుపోయిన అప్పలనాయుడు శుక్రవారం రణస్థలం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్పై ఎల్.సన్యాసినాయుడు బ్యాంకుకు వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఆగంతుకుడి ఆనవాళ్లు గమనించారు. అప్పలనాయుడి నుంచి ఏటీఎం కార్డు తస్కరించిన వ్యక్తి 3వ తేదీన కోస్టలోని ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసుకోవడమేకాకుండా మహాబీర్ ప్రధాన్ అనే వ్యక్తి ఖాతాకి రూ.20 వేలు బదిలీ చేశాడు. 4వ తేదీన ఒడిశా రాష్ట్రం జైపూర్‌లోని హోటల్ ప్రిన్స్ ఏటీఎం నుంచి రూ.40 వేలు, 5న కోరియా బైపాస్ దికానా ఏటీఎం నుంచి మూడు విడతల్లో రూ.35 వేలు డ్రా చేశాడు. అలాగే మహాబీర్ ప్రధాన్ ఖాతాకి మరోకసారి రూ.20 వేలు బదిలీ చేశాడు. 6న చండోల్ ఏటీఎం నుంచి రూ.30 వేలు, 7న జైపూర్ ఏటీఎం నుంచి రూ.3 వేలు డ్రా చేశాడు. మొత్తంమీద 3వ తేదీ నంచి 7వ తేదీ వరకూ అప్పలనాయుడి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు డ్రాచేశాడు. ఒకే ఖాతాకు రెండుసార్లు నగదు బదిలీ చేసినందుకు నిందితుడు దొరికిపోతాడని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.