నగదు విత్‌డ్రాపై కేంద్రానికి రవాణా వాహన సంఘాల అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడిని నానా తిప్పలు పెడుతున్న ‘పెద్ద నోట్ల రద్దు’వ్యవహారం ఇప్పుడు మరిన్ని సమస్యలకు దారితీసేలా కనిపిస్తోంది. పాత నోట్ల మార్పిడి కోసం గంటల తరబడి లైన్లలో పడిగాపులు పడడం, ఇచ్చే మొత్తంపై పరిమితి, కొత్త రెండు వేల నోట్లకు మార్కెట్‌లో చిల్లర దొరకకపోవటం వంటి బాధలు పడలేమంటూ ప్రైవేటు ట్రావెల్స్, రవాణా వాహనాల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. నగదు విత్‌డ్రా పరిమితుల నుంచి తమను మినహాయించాలని.. లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు ఆయా సంఘాల అఖిల భారత స్థాయి ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కలిసి అల్టిమేటం ఇచ్చాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా సంఘాలు సమ్మెకు సన్నద్ధమవుతున్నారుు. ఖమ్మంలో మంగళవారం జరుగనున్న తెలంగాణ లారీ యజమానుల సంఘం సమావేశంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
నానా పాట్లు పడుతున్నాం..
మార్గమధ్యంలో లారీ టైరు పంక్చర్ అయితే దాన్ని మరమ్మతు చేసుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితి నెలకొందని.. ఏదైనా వాహనం మరమ్మతుకు గురైతే, అక్కడే నిలిపివేసి దిక్కులు చూడాల్సిన దుస్థితి వచ్చిందని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటం, ఇది ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు లేకపోవడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమ్మెకు సిద్ధం కావాలని ఆలిండియా ట్రాన్‌సపోర్టు వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే సమ్మెకు సిద్ధం కావాలని కొన్ని రాష్ట్రాల సంఘాలు సూచించడంతో.. జాతీయ నేతలు మెరుపు సమ్మె యోచన విరమించుకుని కేంద్ర మంత్రులను కలిశారు. పర్మిట్ పత్రాలు చూపిస్తే బ్యాంకుల్లో తమకు ఎక్కువ మొత్తం సొమ్ము విత్‌డ్రా చేసుకుని వెసులుబాటు కల్పించాలని కోరారు.
దీనిపై సానుకూల స్పందనేదీ రాలేదని సమాచారం. అయితే సోమవారం నాటికి స్పష్టత రాని పక్షంలో సమ్మెపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అదే జరిగితే ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోరుు సామాన్యుడి కష్టాలు రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక చేతిలో సరిపడా చిల్లర లేక, అవసరమైనంత డబ్బు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు లేక, ఏటీఎంలు పనిచేయక చాలా మంది ప్రయాణాలను వారుుదా వేసుకుంటున్నారని... ఇది తమపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో వారు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు
పరిమితి ఎత్తేస్తారా..సమ్మె చేయమంటారా?
Published Mon, Nov 14 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
Advertisement
Advertisement