రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మే నెలలో రూ.2 వేల నోట్లను ఉపసంహరించింది. 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లేదా ఏదైనా బ్యాంకు శాఖలో ఇతర డినామినేషన్ నోట్లతో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది.
ఇప్పటివరకు రూ.2.5 లక్షల కోట్లు
ఉపసంహరించిన రూ. 2,000 కరెన్సీ నోట్లను సెప్టెంబర్ చివరి నాటికి మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని కోరిన ఆర్బీఐ ఇందు కోసం అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది. కాగా ఇప్పటివరకు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కివచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
మొత్తంగా రూ.3.6 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉండగా మూడింట రెండు వంతులకు పైగా నోట్లు తిరిగి వచ్చాయి. అంటే ఇంకా దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా రూ.2,000 నోట్లను వెంటనే డిపాజిట్ చేయాలని ఆర్బీఐ అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే!
Comments
Please login to add a commentAdd a comment