
అసలు జీతాలు తీసుకుంటామా లేదా..!
సాధారణ రోజుల్లోనే చిల్లర ఖర్చులకు కూడా సరిపోయేంత డబ్బును అటు ఏటీఎంల ద్వారాగానీ, బ్యాంకుల ద్వారా గానీ అందించలేనిది.. ఇక ఒకటో తారీఖు లక్షల్లో.. వేలల్లో జీతభత్యాలు తీసుకునే వారికి అందించగలుగుతారా.. ఆ రోజు పరిస్థితి ఊహించుకుంటేనే కంగారుపుట్టుకొస్తుందంటున్నారు. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో ప్రజలైతే తెగ ఆందోళనలకు కూరుకుపోయారు. ఆదివారం ఏటీఎంల వద్ద ఇక్కడ పెద్ద మొత్తంలో ఏటీఎంల వద్ద బారులు తీరారు.
కానీ, ఏ ఒక్కరి చేతినిండా కూడా డబ్బు లేదు. పైగా నిరాశతో ఏటీఎంలు ఖాళీ అయిపోయానని వెనుదిరుగుతున్నారు. తమకు అత్యవసరంగా చెల్లించాల్సిన చిట్ ఫండ్స్, లోన్లు చాలానే ఉన్నాయని, బయట తీర్చాల్సిన రుణాలు ఉన్నాయని, జీతాలు రాకముందే ఏటీఎంల వద్ద ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక వచ్చాక ఎలా ఉంటుందా అని ఆలోచిస్తే తమకు తెగ భయమేస్తోందని కేవల్ మెహతా అనే ఓ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ తెలిపాడు.