న్యూయార్క్: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 91 దేశాలు ఓటు వేశాయి. ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం నాడు ఓటింగ్ జరిగింది.
"ఆక్రమిత సిరియన్ గోలన్ ప్రాంతం నుండి జూన్ 4,1967 నాటి రేఖ వరకు వైదొలగాలని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి తీర్మానిస్తోంది' అని పేర్కొంటూ ఐరాస అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. 1967 యుద్ధంలో సిరియా నుంచి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది.
భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా సహా 91 దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మాణానికి 8 దేశాలు-- ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, మైక్రోనేషియా, ఇజ్రాయెల్, కెనడా, మార్షల్ దీవులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి.
ఇదీ చదవండి: జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
Comments
Please login to add a commentAdd a comment