Golan Heights
-
సిరియా సైనిక స్థావరాల్లో 80 శాతం ధ్వంసం
ఇజ్రాయెల్: సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాల్లో 80 శాతం ప్రాంతాలపై దాడి చేసి ఆ దేశ సైనిక సామర్థ్యాలను చావుదెబ్బతీశామని ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలన అంతమైన కొద్ది రోజులకే సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై తమ సేనలు గురిపెట్టి పని పూర్తిచేశామని ఇజ్రాయెల్ తెలిపింది. గత 48 గంటల్లో 400కు పైగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌కు తూర్పున ఉన్న నిస్సైనీకరణ(బఫర్ జోన్) ప్రాంతంలోకి దళాలను పంపామని, 80 శాతం సిరియా సైనిక స్థావరాలను నేలమట్టంచేశామని వెల్లడించింది. ఆయుధ నిల్వలపై దాడి చేసి, అవి తిరుగుబాటుదారుల శక్తుల చేతుల్లో పడకుండా నిరోధించామని తెలిపింది. అన్ని రకాల ఆయుధాలు ధ్వంసం ‘‘అల్–బైదా పోర్టు, లటాకియా పోర్టు, డమాస్కస్, ఇతర కీలక నగరాల్లో శత్రు వుల యుద్ధవిమానాలను కూల్చే ఆయుధ వ్యవస్థలు, ఆయుధాగారాలకు చెందిన 15 నావికాదళ నౌకలను ధ్వంసం చేశాం. సముద్రతలంపై 80 నుంచి 190 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు సముద్రతలం నుంచి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణులను ధ్వంసంచేశాం. స్కడ్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, ఉపరితలం నుంచి సముద్రం వరకు, ఉపరితలం నుంచి గగనతలంలోకి, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణు లు, మానవసహిత యుద్ధ వాహకాలు (యూఏవీ), యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, రాడార్లు, ట్యాంకులు, హ్యాంగర్లు తదితర వ్యూహాత్మక ఆస్తులను నిరీ్వర్యం చేశాం’’అని సిరియా సైన్యం పేర్కొంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వందలాది దాడులు చేసింది.అసద్ పతనంపై నెతన్యాహు ఏమన్నారంటే..అసద్ పాలన అంతమై రోజు చారిత్రాత్మకమైన రోజు అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్, అసద్‌లకు ప్రధాన మద్దతుదారులైన హెజ్బొల్లాలను తాము చావు దెబ్బ కొట్టిన ఫలితమే అసద్ పాలన అంతానికి అసలు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అణచివేత పాలన నుంచి విముక్తి పొందాలనుకునేవారికి స్వేచ్ఛ, సాధికారత ఇజ్రాయెల్ కలి్పంచిందని ఆయన ఒక వీడియో ప్రకటనలో చెప్పారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను, ఇరాన్ మద్దతు ఉన్న పాలస్తీనా హమాస్ కీలక నేతలను, లెబనాన్ హెజ్బొల్లా సీనియర్ నాయకులను ఇజ్రాయెల్ వరసబెట్టి అనూహ్య దాడుల్లో అంతంచేయడం తెల్సిందే. -
హెజ్బొల్లా దాడిలో చిన్నారులు సహా... 12 మంది దుర్మరణం
టెల్అవీవ్: ఇజ్రాయెల్ ఆక్రమిత గొలాన్ హైట్స్ లోని ఫుట్‌బాల్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో చిన్నారులు, టీనేజర్లు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ల పనేనని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌లోని మిలటరీ ప్రాంతాలే లక్ష్యంగా తాము రాకెట్లను ప్రయోగించిన మాట వాస్తవమేనని హెజ్బొల్లా పేర్కొంది. అయితే, ఫుట్‌బాల్ మైదానంపై జరిగిన దాడికి బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది. -
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. భారత్ ఆమోదం
న్యూయార్క్: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 91 దేశాలు ఓటు వేశాయి. ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం నాడు ఓటింగ్ జరిగింది. "ఆక్రమిత సిరియన్ గోలన్ ప్రాంతం నుండి జూన్ 4,1967 నాటి రేఖ వరకు వైదొలగాలని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి తీర్మానిస్తోంది' అని పేర్కొంటూ ఐరాస అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. 1967 యుద్ధంలో సిరియా నుంచి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా సహా 91 దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మాణానికి 8 దేశాలు-- ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, మైక్రోనేషియా, ఇజ్రాయెల్, కెనడా, మార్షల్ దీవులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇదీ చదవండి: జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం -
గత జన్మలో వాడే నన్ను చంపాడు..
ఆడుతూ..పాడుతూ.. చలాకీగా తిరిగే మన హీరోని విలన్ అన్యాయంగా చంపేస్తాడు. దీంతో అతనిపై పగబట్టిన మన హీరో పునర్జన్మ ఎత్తి విలన్ని చంపేస్తాడు. ఇలా గత జన్మలను ఆధారంగా చేసుకుని వచ్చిన మగధీర, ఈగ లాంటి తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల్లో అనేక చిత్రాలు మనం చూసే ఉంటాం. గత జన్మలో జరిగిన సంఘటనలు పునర్జన్మలో గుర్తుకు రావడం నిజంగా ఉన్నాయంటారా..? అయితే పక్కనున్న చిత్రంలోని మూడేళ్ల బాలుడికే గత జన్మ గుర్తుకువచ్చింది.. ఇతడే మన హీరో. ఈ జన్మలో సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దులోని గోలన్ హైట్స్ అనే ప్రాంతంలో పుట్టాడు.ఈ బాలుడికి మాటలు రాగానే తన కుటుంబసభ్యులకు తన గత జన్మ గురించి చెప్పాడు. గత జన్మలో తనను ఓ వ్యక్తి గొడ్డలితో తలపై నరికి చంపేశాడని చెప్పడమే కాదు.. అప్పుడు గొడ్డలితో నరికిన చోట ఉన్న ఎర్రటి గుర్తులను కూడా వారికి చూపించాడు. అలాగే తాను గత జన్మలో నివసించిన గ్రామం, తన పేరు అన్ని విషయాలు వారికి తెలిపాడు. ఇక్కడే అసలు సమయం రానే వచ్చింది. అచ్చం సినిమాల్లో జరిగిన విధంగానే మన హీరోకి తనను నరికి చంపిన విలన్ ఎదురుపడ్డాడు. ఇంకేముంది వెంటనే వాడిని గుర్తుపట్టేశాడు మన హీరో. అలాగే వాడి పూర్తి పేరు చెప్పి.. ఇతడే తనను గత జన్మలో చంపేశాడని.. తన శరీరాన్ని చంపిన ప్రదేశాన్ని కూడా చూపించాడు. బాలుడు చెప్పిన ప్రదేశంలో తవ్వి చూడగా.. అక్కడ బాలుడి అస్థి పంజరంతోపాటు చంపేందుకు ఉపయోగించిన గొడ్డలి లభించాయి. ఇంకేముంది విలన్ తానే బాలుడిని గత జన్మలో చంపేశానని ఒప్పుకున్నాడు. ఇదంతా జర్మన్ థెరపిస్ట్ ట్రూట్జ్ హార్డో ‘చిల్డ్రన్ హూ హావ్ లివడ్ బిఫోర్: రీఇంకర్నేషన్ టుడే’ అనే పుస్తకంలో రాశాడు. ఇతను ప్రస్తుత జన్మలో గత జన్మలు గుర్తుకు వచ్చిన అనేకమందిపై ఈ పుస్తకంలో రాయగా.. అందులో ఒకటే ఈ బాలుడికి సంబంధించిన కథ.