హెజ్బొల్లా దాడిలో చిన్నారులు సహా... 12 మంది దుర్మరణం | Golan Heights attack: Israel hits Hezbollah targets after football pitch attack | Sakshi
Sakshi News home page

హెజ్బొల్లా దాడిలో చిన్నారులు సహా... 12 మంది దుర్మరణం

Jul 29 2024 5:48 AM | Updated on Jul 29 2024 5:48 AM

Golan Heights attack: Israel hits Hezbollah targets after football pitch attack

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌ ఆక్రమిత గొలాన్‌ హైట్స్‌ లోని ఫుట్‌బాల్‌ మైదానంపై శనివారం జరిగిన రాకెట్‌ దాడిలో చిన్నారులు, టీనేజర్లు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇజ్రాయెల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ల పనేనని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. 

ఇజ్రాయెల్‌లోని మిలటరీ ప్రాంతాలే లక్ష్యంగా తాము రాకెట్లను ప్రయోగించిన మాట వాస్తవమేనని హెజ్బొల్లా పేర్కొంది. అయితే, ఫుట్‌బాల్‌ మైదానంపై జరిగిన దాడికి బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement