సాక్షి, విశాఖపట్నం: బీసీ నేత అయ్యన్నను అరెస్టు చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాకు తెరతీసింది. అర్జంటుగా టీడీపీకి బీసీ కార్డు గుర్తుకొచ్చింది. నానా బూతులు తిడుతున్నప్పుడు అయ్యన్నకు గుర్తుకు రాని బీసీ కార్డు.. అయ్యన్నను అదుపు చేయనప్పుడు గుర్తుకు రాని బీసీ కార్డు.. అరెస్ట్ అనగానే టీడీపీకి గుర్తుకువచ్చిందా? అంటూ ఆ పార్టీ వైఖరీపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు.
కాగా, అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్‌గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే.
పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment