సాక్షి, విశాఖపట్నం: దాదాపు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో పదవులు అనుభవించిన కొంత మంది కోల్డ్ స్టోరేజీ, డార్క్ రూం లీడర్లు కలిసి ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట టీడీపీ వాయిస్ వినిపించారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. ఈ చర్చా వేదికలో ఉత్తరాంధ్ర ప్రాంతవాసుల కంటే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారన్నారు.
విశాఖ పరిపాలనా రాజధానికి మద్దతుగా తీర్మానం చేసి, మిగతా అంశాలన్నీ చర్చించాల్సింది పోయి, అవేమీ లేకుండా తెలుగుదేశం టార్గెట్ చేసిన విధంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారని చెప్పారు. శనివారం ఆయన సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. తటస్థుల ముసుగులో టీడీపీ నాయకులే ఈ చర్చా వేదికలో ఉన్నారని, రాజకీయ విమర్శలు చేయడానికే ఉత్తరాంధ్ర చర్చ నిర్వహించారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన కొణతాల రామకృష్ణ ఈ చర్చా వేదికకు అధ్యక్షత వహించడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.
సీపీఐ రామకృష్ణ ‘చంద్రబాబు ఆఫ్ ఇండియా’గా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. వీరితో సహజీవనం సాగిస్తున్న నాదెండ్ల మనోహర్, ఏపీలో తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రరాజు రాజకీయ మేధావులా? అని ప్రశ్నించారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడుకి వయసు మీద పడిన దశలో అరగంట మాట్లాడిన తర్వాత కంట నీరు వస్తే అది భావోద్వేగానికి గురైనట్టు కొన్ని పచ్చ చా నళ్లు చూపించడం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు.
మార్చి 31 తర్వాత విశాఖ నుంచే పరిపాలన
►మార్చి 31 తర్వాత ఎప్పుడైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుంది. ప్రభుత్వ భూములు దోచుకున్నది టీడీపీ నేతలే. గీతం యూనివర్సిటీ టీడీపీ నాయకులది కాదా? 45 వేల కోట్ల పెట్టుబడులతో ఐటీ సెజ్.. మెడికల్ కళాశాలలు ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? బాక్సై ట్ కోసం జీవో ఇచ్చింది ఎవరు? చింతపల్లిలో ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఆందోళనలో పాల్గొనడం మరిచిపోయారా? రూ.4 వేల కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను కాపాడి, ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చాం.
►ఈనెల 6న గ్లోబల్ హెల్త్ సదస్సు జరిగింది. మార్చి 28, 29న, ఏప్రిల్ 24న జీ–20 సదస్సులున్నాయి. జనవరి 20, 21న ఐటీ సదస్సు ఏర్పాటు చేయనున్నాం. ఏపీలో బీఆర్‌ఎస్, కేఏ పాల్ గురించి మాట్లాడడం అనవసరం. టీడీపీ, ఎల్లో మీడియా జీవో నం.1ను వక్రీకరిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు.
Comments
Please login to add a commentAdd a comment