పెద్ద మొత్తంలో రిటైల్ కొనుగోళ్లు జరిపే కస్టమర్ల కోసం సిటీ గ్రూపు సరికొత్త డిజిటల్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. సిటీ పే క్రెడిట్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ క్రెడిట్ కార్డు కేవలం డిజిటల్ రూపంలోనే ఉంటుందని సిటీ గ్రూపు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డ్ కోసం రిటైల్ భాగస్వాములను ఏర్పాటు చేస్తోన్న సిటీ గ్రూపు వ్యాపారుల కోసం ఇన్‌స్టాల్‌మెంట్-లోన్ ఉత్పత్తిని కూడా జోడించాలని యోచిస్తోంది.
ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు
సిటీ గ్రూప్ రిటైల్ సర్వీసెస్ యూనిట్ మాసీస్,వేఫైర్ వంటి రిటైలర్‌ల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ లేబుల్ కోబ్రాండ్ క్రెడిట్ కార్డ్‌లను అందిస్తుంది. సాధారణంగా ప్రైవేట్ లేబుల్ కార్డ్‌లు అనేవి కేవలం సదరు రిటైల్ సంస్థ వద్ద మాత్రమే ప్రత్యేకంగా పని చేస్తాయి. దాని స్టోర్‌లలో ఖర్చుతో ముడిపడి ఉన్న ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తాయి.
అయితే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ కొత్త కార్డ్ సైన్ అప్ చేసే ఏ రిటైలర్ వద్దనైనా పని చేస్తుంది. దీని ద్వారా రిటైల్ సంస్థలు తమ కస్టమర్‌లకు ప్రమోషనల్ ఫైనాన్సింగ్‌ను అందించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కార్డ్ ఇండిపెండెంట్ క్రెడిట్ లైన్ వినియోగదారులకు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయడంలో సహాయపడుతుందని న్యూయార్క్ ఆధారిత సిటీ గ్రూప్ తెలిపింది.
ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment