న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నదానికి నిదర్శనంగా... భారత్‌లో ప్రస్తుతం 97.1 కోట్ల క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నట్టు వీసా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో చెప్పుకోతగ్గ భారీ సంఖ్య లో కార్డులు గత మూడేళ్ల కాలంలో జారీ అయినవేనని తెలిపింది. డెబిట్ కార్డుల వినియోగ పరిస్థితుల్లో మార్పులపై వీసా గ్రూపు భారత మేనేజర్ టీఆర్ రామచంద్రన్ మాట్లాడుతూ... ‘‘డిజిటల్ దేశంగా మారుతున్న భారత్‌లో డెబిట్ కార్డులు అసాధారణ స్థాయిలో ఉన్నా యి. గత 12 నెలల్లో డెబిట్ కార్డు లావాదేవీలు 23 శాతం పెరిగాయి. ప్రజలు తమ కార్డులను తరచుగా వినియోగిస్తుండడం ఉత్సాహాన్చిచ్చే సంకేతం. మరింత భద్రతతో కూడిన చెల్లిం పుల అనుభవం దిశగా పనిచేసేందుకు మాకు ఇది ప్రోత్సాహాన్నిస్తుంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment