debits
-
గ్యారెంటీ అప్పు.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 5,200 కోట్లు రుణం
-
రుణ పరిష్కార బాటలో విదర్భ
న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికలో ఉన్న విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్(వీఐపీఎల్) సలహాదారుగా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంపిక చేసుకుంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన వీఐపీఎల్ రుణ పరిష్కారానికి వీలుగా ఎస్బీఐ క్యాప్స్ బిడ్స్‌ను ఆహా్వనించనుంది. తద్వారా కంపెనీకిగల రూ. 2,000 కోట్ల రుణాల విక్రయం లేదా వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను చేపట్టనుంది. స్విస్ చాలెంజ్ విధానంలో రుణదాతలకు రుణాల గరిష్ట రికవరీకి ఎస్బీఐ క్యాప్స్ కృషి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెపె్టంబర్ 30లోగా రుణ పరిష్కార ప్రణాళికలను ముగించవలసి ఉంది. కాగా.. ఈ ప్రాసెస్(వీఐపీఎల్ రుణాలు, ఓటీఎస్) నిర్వహణను 2023 జూన్ 8న ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి పూర్తిచేయవలసి ఉంటుంది. అయితే రుణాలు, ఓటీఎస్‌కు సంబంధించి వీఐపీఎల్ రుణదాతలకు ఇప్పటికే మూడు సువో మోటో బిడ్స్ దాఖలుకాగా.. కంపెనీ తాజాగా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంచుకోవడం గమనార్హం! -
రుణ చెల్లింపులకు రెడీ: వేదాంతా
న్యూఢిల్లీ: రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు డైవర్సిఫైడ్ గ్రూప్ వేదాంతా రీసోర్సెస్ తాజాగా స్పష్టం చేసింది. మైనింగ్, మెటల్, చమురు, గ్యాస్ రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పాదుకొల్పే బాటలో 175 కోట్ల డాలర్ల రుణాలను పొందనున్నట్లు తెలియజేసింది. బ్యాంకుల నుంచి సిండికేట్, బైలేటరల్ రుణాలను అందుకునే సన్నాహాలు చివరి దశలో ఉన్నట్లు వెల్లడించింది. 2023 మార్చివరకూ అన్ని రుణాలనూ ముందస్తుగా చెల్లించినట్లు తెలియజేసింది. ఈ బాటలో 11 నెలల్లో 200 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు పేర్కొంది. రాను న్న ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అవసరమైన లిక్విడిటీని సమకూర్చుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. హిందుస్తాన్ జింక్(హెచ్‌జెడ్‌ఎల్)లో 6.8% వాటా మినహా ఎలాంటి తనఖాలూ లేవని వెల్లడించింది. అంతర్జాతీయ జింక్ ఆస్తుల విక్రయం లేదా 200 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకోకుంటే వేదాంతా క్రెడిట్ రేటింగ్స్ ఒత్తిడిలో పడే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఫిబ్రవరి నెల మొదట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేదాంతా తాజా వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. -
అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో డ్రామా!
సాక్షి, మియాపూర్: బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుడు అందుకోసం చేసిన అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులకు పట్టుబడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచి్చంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సంజీవరావు, అంకమ్మ దంపతులు 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. సంజీవరావు స్థానికంగా సెంట్రింగ్ పనులు చేసేవాడు. అతని చిన్న కుమారుడు పవన్ బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పవన్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతడి తండ్రి సంజీవరావు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో పవన్ తల్లి అంకమ్మకు గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసి మీ కుమారుడు పవన్ నా దగ్గరే ఉన్నాడని, రూ.50వేలు ఇచ్చి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముందుకెళ్లిన దర్యాప్తు బృందం ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి పవన్‌తో పాటు గుర్తుతెలియని మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించగా అసలు విషయం వెల్లడించారు బస్టాప్‌లో పరిచయంతో.. మూడు నెలల క్రితం కూకట్‌పల్లికి చెందిన కలిబింది వరలక్ష్మితో కూకట్పల్లి బస్‌స్టాప్‌లో పవన్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిరువురు ప్రతిరోజూ కలుసుకునే వారు. బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన పవన్ పలువురి వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు వరలక్ష్మి వద్ద రూ. 30వేలు అప్పుగా తీసుకున్నాడు. వారం రోజుల క్రితం డబ్బులు తిరిగి ఇవ్వాలని వరలక్ష్మి అతడిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇంట్లో డబ్బులు ఇవ్వరని భావించిన పవన్ ఆమెతో కలిసి కిడ్నాప్ డ్రామాకు పథకం వేశాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన పవన్ వరలక్ష్మీని కలిశాడు. ఇద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. పథకంలో భాగంగా వరలక్ష్మి పవన్ తల్లికి ఫోన్ చేసి రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..) -
అప్పనంగా నొక్కేశాడు... బ్యాంకు ఉద్యోగి నిర్వాకం
హిమాయత్‌నగర్: తన అకౌంట్ నుంచి స్నేహితుడికి ఆన్లైన్ ద్వారా పంపిన డబ్బులు సాంకేతిక సమస్యతో క్రెడిట్ కాలేదు. పంపిన వ్యక్తి అకౌంట్లో నుంచి మాత్రం డబ్బు డెబిట్ అయ్యింది. ఈ సమస్యను పరిష్కారించాలంటూ నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా.. కాల్ లిప్ట్ చేయలేదు. రెండు నిమిషాల తర్వాత ఓ వ్యక్తి కాల్ చేసి తాను సదరు బ్యాంక్ ఉద్యోగినని పరిచయం చేసు కున్నాడు. మాయ మాటలు చెప్పి ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయించి బాధితుని అకౌంట్లోంచి డబ్బులతో పాటు.. అతని ఆధారాలతో లక్షల రూపాయలు రు ణం పొంది మోసానికి పాల్పడిన ఘటన ఇది. బుధవారం బాధితుడు సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. స్నేహితుడికి ఆన్లైన్ ద్వారా డబ్బు పంపగా.. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేస్తున్న నగర వాసి తన స్నేహితుడికి డబ్బు అవసరం కావడంతో రూ. 15వేలు ఆన్లైన్ ద్వారా పంపాడు. నగర వాసి అ కౌంట్ నుంచి అవి డెబిట్ అయినప్పటికీ స్నేహితుడికి జమ కాలేదు. ఈ విషయాన్ని ఐసీఐసీఐ సిబ్బందికి చెప్పగా.. అతగాడు ఉద్యోగి ఫోన్లో ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయించాడు. ఆ తర్వాత ఉద్యోగికి చెందిన ఆధార్, పాన్‌కార్డ్, సాలరీ పేస్లిప్స్‌ను తీసుకున్నాడు. మొబైల్లో ఉన్న ఐసీఐసీఐ యాప్ అంతా బ్యాంకు ఉద్యోగినే హ్యాండిల్ చేస్తున్నాడు. ఉద్యోగి సిబిల్ స్కోర్ మంచిగా ఉండటంతో ఐసీఐసీఐ ఉద్యోగి బ్యాంకు నుంచి రూ.7. 5 లక్షల రుణం కో సం అప్లై చేయగా.. అదే రోజు అకౌంట్లో క్రెడిట్ అయ్యింది. ఆ మొత్తాన్ని ఐసీఐసీఐ ఉద్యోగి వేర్వేరు ఖాతాల్లోకి జమ చేసుకుని ఖర్చు చేసుకున్నాడు. అకౌంట్లోంచి రూ.42 వేలు మాయం.. అంతకముందు బాధితుడి అకౌంట్లో ఉన్న రూ.42 వేలు సైతం కాజేశాడు. ఇదంతా ఈ ఏడాది జనవరి నెలలో జరగగా తనకు న్యాయం చేయాలని, మీ ఉద్యోగి తనని మోసం చేశాడంటూ ఐసీఐసీఐ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్లి బాధితుడు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు అధికారులు వారం రోజుల తర్వాత రూ.7.5 లక్షల బాధితుడి అకౌంట్లో క్రెడిట్ చేశారు. ఇక్కడే బ్యాంకు అధికారులు తెలివిగా ఓ పని చేశారు, వాటిని క్రెడిట్ చేసినప్పటికీ అవి వాడకుండా ఉండేందుకు నిబంధనలు విధించారు. తన అకౌంట్లో డబ్బు ఉంది కదా అని ధైర్యంగా ఉన్న బాధితుడు కొద్దిరోజులకు తీసుకునేందుకు ప్రయతి్నంచగా రాలేదు. ఇదే విషయంపై మరో మారు బ్యాంకును ఆశ్రయించగా మరలా నిబంధనలు ఎత్తివేసి కొన్ని గంటల్లోనే నిబంధలను విధించారు. దీనిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూ విసిగిపోయిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. (చదవండి: ముడిచమురు ధర తగ్గినా పెట్రో ధరలు తగ్గించరా? ) -
ప్రజల బంగారంపై పాక్ ప్రభుత్వం కన్ను
ఇస్లామాబాద్: నానాటికీ క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునేందుకు ప్రజల నుంచి బంగారాన్ని అప్పుగా తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం యోచిస్తోంది. పాక్ ఆర్థిక పరిస్థితి ఇటీవల కాలంలో వేగంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ఈఈసీ (ఎకనమిక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) ప్రజల నుంచి బంగారం తీసుకునే ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం కమర్షియల్ బ్యాంకులు ప్రజల నుంచి బంగారం రుణంగా తీసుకొని వడ్డీ చెల్లిస్తాయి. ఇలా సేకరించిన బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో డిపాజిట్ చేసి విదేశీ నిల్వలు పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. పాక్ ప్రజల వద్ద దాదాపు 5వేల టన్నుల బంగారం ఉంటుందని అంచనా. -
అమెరికా ‘రు(ర)ణ’ రాజకీయం!
అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దేశం అప్పులు.. వాటి చెల్లింపులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ నాటకం ఇంకొన్ని వారాలపాటు సాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి జానెట్ ఎల్లెన్ తాజా ప్రకటనను బట్టి పరిమితిని సకాలంలో పెంచకపోతే డిసెంబరు 15వ తేదీ తరువాత అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారి రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఎదుర్కోనుంది. అమెరికాకు అప్పులేంటి? చెల్లించ లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా.. అలాగే ఇదీనూ. కాకపోతే ఇక్కడ సమస్య డబ్బుల్లేకపోవడం కాదు. అప్పులపై ఉన్న పరిమితిని పెంచితేగానీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం!! పెంచకపోతే ఏమవుతుంది? రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా తొలిసారి తాను చెల్లించాల్సిన రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబరులో ఈ మొత్తం దాదాపు 28 లక్షల కోట్ల డాలర్ల వరకూ ఉంది. సకాలంలో రుణ వాయిదా చెల్లించకపోవడం ప్రతి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాలకు అందే నిధులు తగ్గుతాయి. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ అంచనా ప్రకారం సకాలంలో రుణ పరిమితి పెంచని పక్షంలో అమెరికన్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయంలో నలభైశాతం కోత పడే అవకాశం ఉంది. రక్షణ దళాల సిబ్బందికి పూర్తిస్థాయిలో, సకాలంలో వేతనాలు, ఫింఛన్ల వంటివి చెల్లించలేమని పెంటగాన్ అక్టోబరులోనే ఒక ప్రకటన జారీ చేసింది. వాయిదా చెల్లింపులో విఫలమైతే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఇవన్నీ కలగలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందన్నమాట. తాత్కాలిక ఉపశమనంగా 480 బిలియన్ డాలర్ల అదనపు రుణం తెచ్చుకోవడానికి అక్టోబరులో సెనేట్ ఒకే చెప్పింది.రుణపరిమితిని పెంచుకోవడానికి, రిపబ్లికన్లను ఒప్పించడానికి బైడెన్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్ష రిపబ్లికన్లు ఏమంటున్నారు? వివాదానికి బాధ్యత డెమొక్రాట్లదేనన్నది రిపబ్లికన్ల వాదన. తమ మద్దతు లేకుండా కొత్త అంశాలపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటూండటం వల్లనే వారు నిస్పృహకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. డెమోక్రాట్లు ఇంకోసారి ఏకపక్షంగా పన్నులు విధించడం, ఖర్చు పెట్టడాన్ని తాము అనుమతించేది లేదని మైనార్టీ నేత మిచ్ మెక్కానెల్ స్పష్టం చేశారు. తమ ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు డెమొక్రాట్లు బడ్జెట్ సమీక్షను అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇంత చేయగలిగిన వాళ్లు రుణ పరిమితి పెంపుపై కూడా ఏదో ఒక చర్య తీసుకోవాలని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ డెమొక్రాట్ల వాదనలేమిటి? రుణ పరిమితి పెంపును రిపబ్లికన్లు అడ్డుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని, ప్రమాదకరమైనవని, అమర్యాదకరమైనవి కూడా అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అమెరికన్ సెనేట్‌లో దాదాపు 50 మంది డెమొక్రాట్లు (100 సభ్యులుండే అమెరికా ఎగువసభ సెనేట్‌లో 48 మంది డెమొక్రాట్లకు ఇద్దరు స్వంత్రుల మద్దతు ఉంది. మిగతా 50 మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు) ఉండగా... రుణ పరిమితిని పెంచేందుకు కనీసం మరో పది రిపబ్లికన్ ఓట్లూ అవసరమవుతున్నాయి. మొత్తం రుణాల్లో బైడెన్ హయాంలోనివి మూడు శాతం మాత్రమేనని, మిగిలినవన్నీ గత ప్రభుత్వాలవేనని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్ హయాంలో తాము మూడుసార్లు రుణ పరిమితి పెంపునకు సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమిటీ రుణ పరిమితి కథ? అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరించే పన్నుల మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే అప్పులు చేస్తుంది. ఈ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తుంది. అప్పుల కోసం అగ్రరాజ్యం విడుదల చేసే బాండ్లు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడులుగా భావిస్తారు. 1939లో అమెరికన్ పార్లమెంటు ప్రభుత్వం చేయగలిగే అప్పులపై ఒక పరిమితిని విధిస్తూ చట్టం చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ కనీసం వందసార్లు ఈ పరిమితిని పెంచుకున్నారు. అంటే.. అవసరాన్ని బట్టి మరిన్ని అప్పులు చేసేందుకు ఎప్పటికప్పుడు అవకాశం కల్పించుకున్నారన్నమాట. అయితే ఇలా పరిమితి పెంచుకోవాలన్న ప్రతిసారి కూడా దానిపై కాంగ్రెస్‌లోని ఇరు పక్షాల మధ్య చర్చోపచర్చలు జరుగుతాయి. చివరకు ఇరుపక్షాలు కొన్ని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావడం పరిమితిని పెంచుకోవడం కద్దు. అయితే ఇటీవలి కాలంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. 2013లోనూ రుణ పరిమితిని దాటేసే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యయ ప్రణాళికను రిపబ్లికన్లు పూర్తిగా అడ్డుకున్నారు. అదేమాదిరిగా ఈ సారి కూడా రిపబ్లికన్లు రుణ పరిమితి అంశాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాదాన్ని సృష్టించారు. అయితే... ఇలాంటి విషయాలు చివరి నిమిషం వరకూ సాగడం.. చివరకు రాజీమార్గాలపై తెరవెనుక మంతనాలు, పట్టువిడుపులు, కొన్ని సవరణల తరువాత ఓకే కావడం చరిత్రలో ఇప్పటివరకూ జరిగిన తంతు! -
భారత్ విదేశీ రుణ భారం 570 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం 2021 మార్చి నాటికి వార్షికంగా 2.1 శాతం పెరిగి 570 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం 2020 మార్చి ముగిసే నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో విదేశీ రుణ భారం 20.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి ఈ విలువ 21.1 శాతానికి చేరింది. ఒక్క సావరిన్ డెట్ వార్షికంగా 6.2 శాతం పెరిగి 107.2 బిలియన్ డాలర్లకు చేరింది. నాన్ సావరిన్ రుణాలు 1.2 శాతం పెరిగి 462.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. నాన్ సావరిన్ డెట్‌లో వాణిజ్య రుణాలు, ఎన్ఆర్ఐ డిపాజిట్లు, స్వల్ప కాలిక వాణిజ్య రుణ అకౌంట్ వెయిటేజ్ 95 శాతం కావడం గమనార్హం. ఎన్ఆర్ఐ డిపాజిట్లు వార్షికంగా 8.7 శాతం పెరిగి 141.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య రుణాల విలువ 0.4 శాతం తగ్గి 197 బిలియన్ డాలర్లకు చేరింది. స్వల్పకాలిక వాణిజ్య రుణ అకౌంట్ 4.1 శాతం తగ్గి 97.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2021 మార్చి నాటికి దీర్ఘకాలిక రుణం (ఏడాది దాటి వాస్తవ మెచ్యూరిటీ ఉన్నవి) 468.9 బిలియన్ డాలర్లు. వార్షికంగా ఈ విభాగంతో 17.3 బిలియన్ డాలర్లు పెరిగింది. -
రుణాలపై చక్రవడ్డీ మాఫీ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో రుణగ్రహీతలకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కోవిడ్–19 సమయంలో ప్రకటించిన మారటోరియంను ఉపయోగించుకున్న వారితోపాటు యథాప్రకారం వాయిదాలు చెల్లించిన వారికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. ఈ పథకం అమలుతో కేంద్రంపై రూ.6,500 కోట్ల మేర భారం పడనుంది. రూ.2 కోట్ల రుణగ్రహీతలకు లబ్ధి కలిగేలా సాధ్యమైనంత త్వరగా వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలనీ, ‘సామాన్యుడి దీపావళి’ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం పలు మార్గదర్శకాలను ప్రకటించింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు రూ.2 కోట్లలోపు బకాయి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఫిబ్రవరి 29వ తేదీ నాటికి వాటిని నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా ప్రకటించి ఉండకూడదు. ఆ మొత్తాన్ని ఈ ఏడాది మార్చి 27వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకాన్ని పూర్తిగా గానీ పాక్షికంగా గానీ వినియోగించుకున్న వారి ఖాతాల్లో రుణ సంస్థలు జమ చేయాల్సి ఉంది. మారటోరియం అవకాశాన్ని వినియోగిం చుకోని, ఎప్పటి మాదిరిగా వాయిదాలు చెల్లించే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలతో ఆయా సంస్థలు కేంద్రం నుంచి రీయింబర్స్మెంట్ పొందవచ్చు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో రుణాల చెల్లింపులపై కేంద్రం విధించిన 6 నెలల మారటోరియం అమలుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ 2వ తేదీన జరగనుంది. -
రూ. 30 వేల కోట్లు కడతాం
న్యూఢిల్లీ: రుణ బాకీలను సెటిల్ చేసుకునేందుకు, 13 గ్రూప్ కంపెనీలపై దివాలా చర్యలను ఆపివేయించుకునేందుకు వీడియోకాన్ గ్రూప్ మాజీ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్ కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రుణదాతలకు రూ. 30,000 కోట్లు కడతామంటూ ఆఫర్ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రుణదాతల కమిటీ (సీవోసీ) ముందు ఉంచినట్లు ధూత్ వెల్లడించారు. రుణదాతలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీనికి అంగీకరించిన పక్షంలో ఈ ఏడాది ఆఖరు నాటికి సెటిల్మెంట్పై తుది నిర్ణయం రావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న 15 గ్రూప్ కంపెనీలకు గాను 13 సంస్థలకు సంబంధించి ఈ ఆఫర్‌ను ప్రతిపాదించినట్లు ధూత్ చెప్పారు. కేఏఐఎల్, ట్రెండ్ అనే రెండు సంస్థలను ఇందులో చేర్చలేదని వివరించారు. ‘వచ్చే 30 నుంచి 60 రోజుల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నాను‘ అని ధూత్ పేర్కొన్నారు. దివాలా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు, మరింత మెరుగైన విలువను రాబట్టేందుకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మొత్తం 15 గ్రూప్ కంపెనీల కేసులను కలిపి విచారణ జరుపుతోంది. -
‘నన్ను చంపేయండి.. ఇన్సూరెన్స్ వస్తుంది’
న్యూఢిల్లీ: అప్పులు పాలైన ఓ వ్యాపారవేత్త తాను చనిపోతే.. కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి.. వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో తన హత్యకు తానే సుపారి ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారవేత్తను హత్య చేసిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నాడు. వివరాలు.. చనిపోయిన వ్యాపారవేత్త ఆనంద్ విహారి ఈ నెల 9 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో జూన్ 10న రన్హోలా పోలీస్ స్టేషన్‌కు ఒక పీసీఆర్ కాల్ వచ్చింది. బాప్రోలా విహార్‌లోని ఖేడి వాలా పుల్ సమీపంలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఉన్నాడని కాల్ చేసిన వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఫోన్ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ 35 సంవత్సరాల వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన తరువాత, ఆ వ్యక్తి చేతులు కట్టివేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా మృతుడిని తప్పిపోయిన వ్యాపారవేత్త ఆనంద్ విహారిగా గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతుడి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. ఆనంద్ విహారి తప్పిపోయినట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈలోపు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా పోలీసులు ఒక నిందితుడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా నేరంలో తన పాత్రను అంగీకరించాడు. అంతేకాక తనతో పాటు మరో ఇద్దరికి కూడా ఈ నేరంలో పాత్ర ఉన్నట్లు సదరు నిందితుడు తెలిపాడు. ఓ మైనర్ కుర్రాడు చెప్పడంతో సదరు వ్యాపారవేత్తను హత్య చేసినట్లు అతడు వెల్లడించాడు. ఈ క్రమంలో మైనర్ కుర్రాడిని పట్టుకుని ఆరా తీయగా అతడు ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడించాడు. సదరు వ్యాపారవేత్త అప్పుల పాలయ్యాడని.. తాను చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని.. దాంతో కుటుంబ సభ్యులైన బాగుంటారని భావించాడు. ఈ క్రమంలో తనను చంపాల్సిందిగా మైనర్ కుర్రాడికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలో మరో ఇద్దరితో కలిసి అతడు వ్యాపారవేత్తను హత్య చేశాడు. -
‘అప్పు’డే వద్దు!
ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి (అప్పటికి వార్షిక ప్రాతిపదికన చూస్తే) బ్యాంకింగ్ రుణాలు 97.71 లక్షల కోట్లు. ► 2018 ఇదే కాలానికి రుణాల పరిమాణం రూ.89.82 లక్షల కోట్లు. ► అంటే వృద్ధి రేటు 8.79 శాతమన్నమాట. ► వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ► 2019 సెప్టెంబర్ 13 ముగిసిన పక్షం రోజులకు చూస్తే, రుణాల పరిమాణం రూ.97.01 లక్షల కోట్లుగా ఉంది. 2018 ఇదే కాలంలో పోల్చితే వృద్ధి రేటు 10.26 శాతంగా ఉంది. డిపాజిట్లూ మందగమనమే... ఇక బ్యాంకుల్లో డిపాజిట్ల విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా వృద్ధిరేటు మందగమనంలోకి జారిపోయింది. 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షం రోజులకు డిపాజిట్లు రూ. 129.06 లక్షల కోట్లు. 2018 ఇదే కాలానికి ఈ మొత్తం రూ.118 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 9.38 శాతంగా ఉంది. 2019 సెప్టెంబర్ 13తో ముగిసిన పక్షం రోజులకు చూస్తే, వృద్ధి రేటు 10.02 శాతంగా ఉంది. -
అప్పుల్లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం రికార్డు
-
భారీగా పెరుగుతున్న కార్డుల వినియోగం: వీసా
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నదానికి నిదర్శనంగా... భారత్‌లో ప్రస్తుతం 97.1 కోట్ల క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నట్టు వీసా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో చెప్పుకోతగ్గ భారీ సంఖ్య లో కార్డులు గత మూడేళ్ల కాలంలో జారీ అయినవేనని తెలిపింది. డెబిట్ కార్డుల వినియోగ పరిస్థితుల్లో మార్పులపై వీసా గ్రూపు భారత మేనేజర్ టీఆర్ రామచంద్రన్ మాట్లాడుతూ... ‘‘డిజిటల్ దేశంగా మారుతున్న భారత్‌లో డెబిట్ కార్డులు అసాధారణ స్థాయిలో ఉన్నా యి. గత 12 నెలల్లో డెబిట్ కార్డు లావాదేవీలు 23 శాతం పెరిగాయి. ప్రజలు తమ కార్డులను తరచుగా వినియోగిస్తుండడం ఉత్సాహాన్చిచ్చే సంకేతం. మరింత భద్రతతో కూడిన చెల్లిం పుల అనుభవం దిశగా పనిచేసేందుకు మాకు ఇది ప్రోత్సాహాన్నిస్తుంది’’ అని పేర్కొన్నారు. -
కేసీఆర్ ఆస్తులు.. అప్పులు
సాక్షి, గజ్వేల్(సిద్దిపేట జిల్లా): ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గజ్వేల్‌లో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఫాం–26తోపాటు ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్లో సమర్పించారు. తనకు ఎటువంటి సొంత వాహనాలు లేవని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ మొత్తం ఆస్తుల విలువ- రూ.22,60,77,936 చరాస్తులు- రూ.10,40,77,946 స్థిరాస్తులు- రూ.12.20 కోట్లు(పొలం, ఇళ్లు, ఫామ్‌హౌస్ వగైరా..) ఫిక్స్డ్ డిపాజిట్లు- రూ.5,63,73,946 తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.55,00,000 తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.4,16,25,000 కేసీఆర్ వద్ద ఉన్న బంగారం- 75 గ్రాములు (విలువ రూ.2,40,000) మొత్తం అప్పులు- రూ.8,88,47,570 ఇందులో కుమారుడు కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ రూ.82,82,570 కోడలు శైలిమ వద్ద తీసుకున్న అప్పు- రూ.24,65,000 బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏడాదికి కడుతున్న బీమా- రూ.99 వేలు తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 64 కేసులు ఉన్నట్లు కేసీఆర్ తన అఫిడవిట్లో చూపించారు. కేసీఆర్ సతీమణి శోభ పేరుమీద రూ.94,59,779 విలువైన ఆస్తులున్నాయి. ఇందులో బంగారం, వజ్రాలు, ముత్యాలు, ఇతర ఆభరణాల విలువే అధికం. ఆమె వద్ద 2.2 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 93,66,184. -
అప్పులబాదతో యువరైతు ఆత్మహత్య
నాగార్జునసాగర్: రెండు సంవత్సరాలుగా కాలం కలిసిరాక పోవడంతో.. పెట్టిన పెట్టుబడి తిరిగి రాక.. తెచ్చిన అప్పు కొండ లా పెరిగిపోయి.. దిక్కుతోచక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామ పంచాయతి పరిధిలోని సుబ్బరాయ తండలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రమావత్ శ్రీను(29) తనకున్న నాలుగెకరాల భూమితో పాటు గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ఐదెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా పంట దిగుబడి సరిగా రాలేదు. తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు దీంతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం
ప్రకాశం: అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండల పరిధిలోని నూతలపాడు గ్రామానికి చెందిన భవనం వెంకట సుబ్బారెడ్డి(32) బుధవారం వేకువజామున తన పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుబ్బారెడ్డి ఏటా 15 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే, గత మూడేళ్లుగా నష్టాలు రావడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన బంధువులు వాపోయారు. మృతునికి సుమారు రూ.5 లక్షల మేర వివిధ బ్యాంకుల్లో రుణాలు ఉన్నట్టు తెలిపారు. అలాగే, గ్రామంలో కూడా సుమారు రూ.20 లక్షలు అప్పులున్నట్లు సమాచారం.