ప్రతీకాత్మక చిత్రం
హిమాయత్‌నగర్: తన అకౌంట్ నుంచి స్నేహితుడికి ఆన్‌లైన్ ద్వారా పంపిన డబ్బులు సాంకేతిక సమస్యతో క్రెడిట్ కాలేదు. పంపిన వ్యక్తి అకౌంట్‌లో నుంచి మాత్రం డబ్బు డెబిట్ అయ్యింది. ఈ సమస్యను పరిష్కారించాలంటూ నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా.. కాల్ లిప్ట్ చేయలేదు. రెండు నిమిషాల తర్వాత ఓ వ్యక్తి కాల్ చేసి తాను సదరు బ్యాంక్ ఉద్యోగినని పరిచయం చేసు కున్నాడు.
మాయ మాటలు చెప్పి ఎనీడెస్క్ యాప్ ఇన్‌స్టాల్ చేయించి బాధితుని అకౌంట్‌లోంచి డబ్బులతో పాటు.. అతని ఆధారాలతో లక్షల రూపాయలు రు ణం పొంది మోసానికి పాల్పడిన ఘటన ఇది. బుధవారం బాధితుడు సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి..
స్నేహితుడికి ఆన్‌లైన్ ద్వారా డబ్బు పంపగా..
ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేస్తున్న నగర వాసి తన స్నేహితుడికి డబ్బు అవసరం కావడంతో రూ. 15వేలు ఆన్‌లైన్ ద్వారా పంపాడు. నగర వాసి అ కౌంట్ నుంచి అవి డెబిట్ అయినప్పటికీ స్నేహితుడికి జమ కాలేదు. ఈ విషయాన్ని ఐసీఐసీఐ సిబ్బందికి చెప్పగా.. అతగాడు ఉద్యోగి ఫోన్‌లో ఎనీడెస్క్ యాప్ ఇన్‌స్టాల్ చేయించాడు. ఆ తర్వాత ఉద్యోగికి చెందిన ఆధార్, పాన్‌కార్డ్, సాలరీ పేస్లిప్స్‌ను తీసుకున్నాడు.
మొబైల్లో ఉన్న ఐసీఐసీఐ యాప్ అంతా బ్యాంకు ఉద్యోగినే హ్యాండిల్ చేస్తున్నాడు. ఉద్యోగి సిబిల్ స్కోర్ మంచిగా ఉండటంతో ఐసీఐసీఐ ఉద్యోగి బ్యాంకు నుంచి రూ.7. 5 లక్షల రుణం కో సం అప్‌లై చేయగా.. అదే రోజు అకౌంట్‌లో క్రెడిట్ అయ్యింది. ఆ మొత్తాన్ని ఐసీఐసీఐ ఉద్యోగి వేర్వేరు ఖాతాల్లోకి జమ చేసుకుని ఖర్చు చేసుకున్నాడు.
అకౌంట్‌లోంచి రూ.42 వేలు మాయం..
అంతకముందు బాధితుడి అకౌంట్‌లో ఉన్న రూ.42 వేలు సైతం కాజేశాడు. ఇదంతా ఈ ఏడాది జనవరి నెలలో జరగగా తనకు న్యాయం చేయాలని, మీ ఉద్యోగి తనని మోసం చేశాడంటూ ఐసీఐసీఐ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్లి బాధితుడు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు అధికారులు వారం రోజుల తర్వాత రూ.7.5 లక్షల బాధితుడి అకౌంట్‌లో క్రెడిట్ చేశారు. ఇక్కడే బ్యాంకు అధికారులు తెలివిగా ఓ పని చేశారు, వాటిని క్రెడిట్ చేసినప్పటికీ అవి వాడకుండా ఉండేందుకు నిబంధనలు విధించారు.
తన అకౌంట్‌లో డబ్బు ఉంది కదా అని ధైర్యంగా ఉన్న బాధితుడు కొద్దిరోజులకు తీసుకునేందుకు ప్రయతి్నంచగా రాలేదు. ఇదే విషయంపై మరో మారు బ్యాంకును ఆశ్రయించగా మరలా నిబంధనలు ఎత్తివేసి కొన్ని గంటల్లోనే నిబంధలను విధించారు. దీనిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూ విసిగిపోయిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
(చదవండి: ముడిచమురు ధర తగ్గినా పెట్రో ధరలు తగ్గించరా? )
Comments
Please login to add a commentAdd a comment