రుణ పరిష్కార బాటలో విదర్భ | SBI Caps appointed as advisor by lenders for debt resolution | Sakshi
Sakshi News home page

రుణ పరిష్కార బాటలో విదర్భ

Published Fri, Jun 23 2023 4:31 AM | Last Updated on Fri, Jun 23 2023 6:16 PM

SBI Caps appointed as advisor by lenders for debt resolution - Sakshi

న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికలో ఉన్న విదర్భ ఇండస్ట్రీస్‌ పవర్‌ లిమిటెడ్‌(వీఐపీఎల్‌) సలహాదారుగా ఎస్‌బీఐ క్యాప్స్‌ను ఎంపిక చేసుకుంది. అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన వీఐపీఎల్‌ రుణ పరిష్కారానికి వీలుగా ఎస్‌బీఐ క్యాప్స్‌ బిడ్స్‌ను ఆహా్వనించనుంది. తద్వారా కంపెనీకిగల రూ. 2,000 కోట్ల రుణాల విక్రయం లేదా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)ను చేపట్టనుంది.

స్విస్‌ చాలెంజ్‌ విధానంలో  రుణదాతలకు రుణాల గరిష్ట రికవరీకి ఎస్‌బీఐ క్యాప్స్‌ కృషి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెపె్టంబర్‌ 30లోగా రుణ పరిష్కార ప్రణాళికలను ముగించవలసి ఉంది. కాగా.. ఈ ప్రాసెస్‌(వీఐపీఎల్‌ రుణాలు, ఓటీఎస్‌) నిర్వహణను 2023 జూన్‌ 8న ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి పూర్తిచేయవలసి ఉంటుంది. అయితే రుణాలు, ఓటీఎస్‌కు సంబంధించి వీఐపీఎల్‌ రుణదాతలకు ఇప్పటికే మూడు సువో మోటో బిడ్స్‌ దాఖలుకాగా.. కంపెనీ తాజాగా ఎస్‌బీఐ క్యాప్స్‌ను ఎంచుకోవడం గమనార్హం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement