Citigroup
-
ఉద్యోగులు వణికిపోతుంటే.. సీఈవోకి ఆనందం!
ఉద్యోగులకు వణికిపోతుంటే.. సీఈవోకి ఆనందం ఏంటి అనుకుంటున్నారా? రెండింటికీ సంబంధం లేదు కానీ ఆ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. వేలాది మంది ఉద్యోగులను తొలంచాలని యోచిస్తున్న సిటీ గ్రూప్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జేన్ ఫ్రేజర్ వేతన పరిహారాన్ని మాత్రం పెంచింది. సీఈవో జేన్ ఫ్రేజర్ 2023 వేతన పరిహారం సుమారు 6 శాతం పెరిగి 26 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.215 కోట్లు) చేరుకుందని సిటీ గ్రూప్ తాజా ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో ఆమె మూల వేతనం 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.12.5 కోట్లు) కాగా 3.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.30 కోట్లు) క్యాష్ బోనస్. మిగిలిన 20.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.172 కోట్లు) పర్ఫామెన్స్ ఆధారిత స్టాక్స్ అని ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి కంపెనీ సంస్థాగత, నిర్వహణలో మార్పులను అమలు చేయడంలో, అంతర్జాతీయంగా వ్యాపార వృద్ధిలో ఫ్రేజర్ చేసిన కృషి ఆధారంగా వేతన పరిహారాన్ని నిర్ణయించినట్లు బ్యాంక్ బోర్డు పేర్కొంది. ఇతర బ్యాంకింగ్ సంస్థల్లోనూ సీఈవోల వేతన పరిహారాలు ఇటీవల పెరిగాయి. జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ పరిహారం 4.3 శాతం, మోర్గాన్ స్టాన్లీస్ మాజీ సీఈవో జేమ్స్ గోర్మాన్ 17 శాతం పెరిగాయి. ఇక గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సీఈవో వేతన పరిహారమైతే ఏకంగా 24 శాతం పెరిగింది. యూఎస్ మల్టీనేషన్ ఇన్వెస్టర్ బ్యాంకు సిటీ గ్రూప్ గత నెలలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు రిగ్యులేటరీకు రిపోర్ట్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది. -
Citigroup Layoffs: 2,000 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ సిటీ గ్రాప్ (Citigroup) ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (Q3) 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఈ ఏడాది కంపెనీ సీవెరన్స్ ఛార్జీలు (తొలగించిన ఉద్యోగులకు చెల్లించే పరిహారం) 650 మిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ నివేదించింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ మాసన్ అనలిస్టులతో కాన్ఫరెన్స్ కాల్లో ఆదాయాలపై చర్చిస్తూ ఈ ఏడాది మొత్తంగా కంపెనీ దాదాపు 7,000 ఉద్యోగాలను తగ్గించిందని చెప్పారు. మూడో త్రైమాసికంలో 2000 ఉద్యోగాలు తగ్గించగా అంతకుముందు జూన్ చివరి నాటికి 5000 ఉద్యోగాలు తగ్గించినట్లు పేర్కొన్నారు. కంపెనీ హెడ్‌కౌంట్ తగ్గడానికి కారణం రీపోజిషనింగ్ ఛార్జీలే అని మాసన్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు సంస్థ నమోదు చేసిన ఛార్జీలు సిటీ గ్రూప్ గత నెలలో ప్రకటించిన పునర్వ్యవస్థీకరణను (ఐదు కీలక వ్యాపారాలపై సంస్థను తిరిగి కేంద్రీకరించే పునరుద్ధరణ)కి సంబంధించినది కాదని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ పునర్నిర్మాణం మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీస్తుందని సిటీ గ్రూప్ పేర్కొంది. అయితే ఆ సంఖ్య ఎంతన్నది స్పష్టత ఇవ్వలేదు. -
సిటీ గ్రూపు నుంచి డిజిటల్ క్రెడిట్ కార్డ్.. లాభాలేంటో తెలుసా?
పెద్ద మొత్తంలో రిటైల్ కొనుగోళ్లు జరిపే కస్టమర్ల కోసం సిటీ గ్రూపు సరికొత్త డిజిటల్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. సిటీ పే క్రెడిట్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ క్రెడిట్ కార్డు కేవలం డిజిటల్ రూపంలోనే ఉంటుందని సిటీ గ్రూపు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డ్ కోసం రిటైల్ భాగస్వాములను ఏర్పాటు చేస్తోన్న సిటీ గ్రూపు వ్యాపారుల కోసం ఇన్స్టాల్మెంట్-లోన్ ఉత్పత్తిని కూడా జోడించాలని యోచిస్తోంది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు సిటీ గ్రూప్ రిటైల్ సర్వీసెస్ యూనిట్ మాసీస్,వేఫైర్ వంటి రిటైలర్ల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ లేబుల్ కోబ్రాండ్ క్రెడిట్ కార్డ్‌లను అందిస్తుంది. సాధారణంగా ప్రైవేట్ లేబుల్ కార్డ్‌లు అనేవి కేవలం సదరు రిటైల్ సంస్థ వద్ద మాత్రమే ప్రత్యేకంగా పని చేస్తాయి. దాని స్టోర్లలో ఖర్చుతో ముడిపడి ఉన్న ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తాయి. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ కొత్త కార్డ్ సైన్ అప్ చేసే ఏ రిటైలర్ వద్దనైనా పని చేస్తుంది. దీని ద్వారా రిటైల్ సంస్థలు తమ కస్టమర్లకు ప్రమోషనల్ ఫైనాన్సింగ్‌ను అందించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కార్డ్ ఇండిపెండెంట్ క్రెడిట్ లైన్ వినియోగదారులకు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయడంలో సహాయపడుతుందని న్యూయార్క్ ఆధారిత సిటీ గ్రూప్ తెలిపింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
ఉద్యోగులకు షాక్, టీకా వేయించుకుంటారా..ఉద్యోగం నుంచి తొలగించమంటారా!
ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు..వర్క్ కల్చర్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాయి. కానీ వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం తలొగ్గడం లేదు. గూగుల్,ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు వ్యాక్సినేషన్ అంశంలో ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవాలి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంచలన ప్రకటనలు చేయగా..ఇప్పుడు అదే దారిలో మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ 'సిటీ గ్రూప్' ప్రధాన కార్యాలయం 'వాల్ స్ట్రీట్' ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.వ్యాక్సిన్ వేయించుకుంటారా? లేదంటే విధుల నుంచి తొలగించమంటారా? అని ప్రశ్నిస్తూ గడువు విధించింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం..జనవరి 14 నాటికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అందించని ఉద్యోగుల్ని అన్ పెయిడ్ లీవ్‌తో పాటు, విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. కొంతమంది ఉద్యోగుల్ని బోనస్ అనర్హులుగా ప్రకటించనుంది. ఒకవేళ ఆఫీస్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు ఉంటే బోనస్‌లు తీసుకునే ముందు కంపెనీకి వ్యతిరేకంగా వ్యవహరించమని తెలిపే ఒప్పొంద పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. సిటీగ్రూప్ సిబ్బందిలో 90శాతం కంటే ఎక్కువ మంది అమెరికన్ ఉద్యోగులకు ఈ నియమాల్ని అందుబాటులోకి తెచ్చింది. మతపరమైన లేదా ఆరోగ్య పరంగా మినహాయింపు ఇచ్చింది. ఒమిక్రాన్ కేసులు తీవ్రతరం కావడంతో అమెరికాలో ఆయా సంస్థలు రిటర్న్-టు-ఆఫీస్ ప్లాన్, వర్క్‌ప్లేస్ లో వ్యాక్సినేషన్ వంటి అంశాల గురించి చర్చలు జరుపుతున్నాయి.ఈ నేపథ్యంలో సిటీ గ్రూప్ దాదాపు 70వేల మంది ఉద్యోగులకు జాబ్ కావాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని నియమాల్ని అమలు చేసింది. అదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్, జెపి మోర్గాన్ వంటి సంస్థలు ఉద్యోగులకు టీకా అవసరం ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వారంలో 5 రోజుల కంటే తక్కువ పనిదినాలున్న దేశాలు ఇవే..త్వరలో భారత్.. -
వ్యాక్సిన్ మస్ట్.. లేదంటే జాబ్‌కే ఎసరు?
ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గరిష్ట సంఖ్యలో ఉద్యోగులను ఇంకొంతకాలం వర్క్‌ఫ్రమ్ హోంకే పరిమితం చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఆఫీసులకు వచ్చినా.. హైబ్రిడ్ వర్క్‌లో కొనసాగినా.. వర్క్‌ఫ్రమ్ హోంలో ఉన్నా సరే వ్యాక్సిన్ వేయించుకుని తీరాలని కండిషన్లు పెడుతున్నాయి కంపెనీలు. లేకుంటే ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయి. ఈ మధ్యే గూగుల్, ఇంటెల్ కంపెనీలు ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు పంపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో దిగ్గజం చేరింది. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ ఇన్కార్పొరేటెడ్, ఎంప్లాయిస్‌కు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను కంపెనీ ఎంప్లాయిస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని జనవరి 14వ తేదీన డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ అప్లోడ్ చేయని పక్షంలో అన్‌పెయిడ్ లీవ్ కింద వాళ్లను పరిగణించి.. ఈ నెలాఖరులోపు వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ముందస్తు సంతకాలు ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్‌కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఉద్యోగ నియామకాల టైంలోనూ, ఉద్యోగులకు బోనస్‌లు చెల్లించే ఒప్పందాల సమయంలోనూ వ్యాక్సినేషన్ పాలసీని ముందుపెడుతూ తప్పనిసరిగా సంతకాలు చేయించుకుంటున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్లకు ఎవరైతే దూరంగా ఉంటారో.. వాళ్లను అన్‌పెయిడ్ సెలవులపై పంపించడం, జీతాల కోతల, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతతో పాటు ప్రభుత్వాలు తీసుకొస్తున్న వ్యాక్సినేషన్ మస్ట్ పాలసీలకు తలొగ్గుతున్న దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా ఈ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నాయి. అయితే మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. మన దేశంలోనూ.. వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో మినహాయింపులు సైతం ఇవ్వట్లేదు. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్‌కు ‘హై రిస్క్’ ట్యాగ్‌ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావించి వ్యాక్సిన్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. చదవండి: ఉద్యోగులకు గుడ్‌న్యూస్! డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు
ట్యాక్సీ సేవల దిగ్గజం ఓలా పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. తద్వారా రూ. 7,000–11,000 కోట్ల మధ్య నిధుల సమీకరణ చేపట్టాలని ఓలా మాతృ సంస్ధ ఏఎన్ఐ టెక్నాలజీస్ భావిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ నిర్వహణకు సిటీగ్రూప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర ఎంపిక చేసిన సంస్థలతో చర్చలు చేపట్టింది. ఆస్టిన్ జీఐఎస్‌లో టెక్‌మహీంద్రా పెట్టుబడులు న్యూఢిల్లీ: ఆస్టిన్ జీఐఎస్‌లో 13.8 శాతం వాటాను టెక్ మహీంద్రా తన యూఎస్ సబ్సిడరీ (టెక్‌మహీంద్రా ఐఎన్‌సీ) రూపంలో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 1.25 మిలియన్ డాలర్లు (రూ.9.37కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఐవోటీ/5జీ విభాగంలో సేవల విస్తరణకు ఈ కొనుగోలు తోడ్పడనుందని కంపెనీ ప్రకటించింది. -
పది కోట్ల జీతం...శాండ్విచ్లకు కక్కుర్తిపడి..
లండన్ : యూరప్‌లో బ్యాంకింగ్ లావాదేవీలతో అత్యధిక లాభాలు గడిస్తున్న ‘సిటీ గ్రూప్’ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న పరాశ్ షా చిల్లర వేశాల కారణంగా బంగారం లాంటి తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఏటా దాదాపు తొమ్మిదన్నర కోట్ల రూపాయల జీతం అందుకుంటున్న ఆయన లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో ఉన్న బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి తరచుగా ఆహారాన్ని దొంగలిస్తున్నారట. పలుసార్లు శాండ్విచ్లు దొంగలించారట. ఆయన అలా ఎంతకాలం నుంచి ఎన్ని శాండ్విచ్లు దొంగలించారో తెలియదుగానీ, ఈ విషయం తెల్సిన యాజమాన్యం ఆగ్రహించి ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ‘ఫైనాన్సియల్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. పరాశ్ షా సెలవుల్లో వివిధ దేశాల్లో పర్యటించే అలవాటు ఉందని ఆయన ఫేస్బుక్ పేజీలు చూస్తే అర్థం అవుతోంది. ఆయన పెరూలోని ‘మాచు పిచ్చూ’ పర్యాటక కేంద్రాన్ని సందర్శించినట్లు ఆయన ఫొటోలను చూస్తే అర్థం అవుతోంది. లండన్‌లోని ఎడ్మాంటన్‌లో గ్రామర్ స్కూల్లో చదవిన షా, బాత్ యూనివర్శిటీలో 2010లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. హెచ్ఎస్బీసీలో ఇన్కమ్ ట్రేడింగ్ బిజినెస్‌లో ఏడేళ్లు పనిచేసి 2017లో సిటీ గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం యూరప్‌తోపాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా బ్యాంకింగ్ కార్యకలాపాలకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. అంత ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి శాండ్విచ్ డబ్బుల కోసం కక్కుర్తి పడడం చూసే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇలాగే కక్కుర్తి పడిన పలువురు బ్యాంకర్లు సస్పెండయిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ఓ ఫ్రెండ్ బైక్ నుంచి 500 రూపాయల విలువచేసే ఓ పార్ట్‌ను దొంగలించినందుకు ఓ లండన్ బ్యాంకర్‌ను 2016లో జపాన్‌కు చెందిన మిజువో బ్యాంక్ ఉద్యోగం నుంచి తొలగించింది. బ్లాక్‌రాక్ ఎగ్జిక్యూటివ్ జోనాథన్ బుర్రోస్ టిక్కెట్లు తీసుకోకుండా రైల్లో ప్రయాణించి దొరికి పోయారు. బ్రిటన్ ఆర్థిక రంగంలో ఆయన ఎక్కడా పనిచేయకుండా ‘ఫైనాన్సియల్ కండక్ట్ అథారిటీ’ ఆయనపై నిషేధం విధించింది. ఆయన బ్రిటన్ ఆగ్నేయ రైల్వేకు 39 లక్షల రూపాయలను చెల్లించడం ద్వారా కేసును సర్దుబాటు చేసుకున్నారు. -
ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లు కిందికి!
నోట్ల రద్దుపై సిటీ గ్రూప్, హెచ్ఎస్బీసీ, కొటక్ అంచనా న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం రానున్న నెలల్లో అదుపులో ఉంటుందని పలు ఆర్థిక సేవల దిగ్గజ సంస్థలు అంచనా వేస్తున్నారుు. ఈ నేపథ్యంలో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్ప కాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) తగ్గే అవకాశం ఉందని సిటీగ్రూప్, కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, హెచ్ఎస్బీసీ సంస్థలు అభిప్రాయపడుతున్నారుు. డిసెంబర్ 7వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో మూడు సంస్థల నివేదికలు... వాటి అంచనాలను చూస్తే... ద్రవ్యోల్బణం 4 శాతం లోపే..: సిటీ గ్రూప్ నవంబర్ - డిసెంబర్లో వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 4 శాతం దిగువనే ఉంటుంది. అరుుతే మార్చి నాటికి 4.5 శాతానికి చేరే వీలుంటుంది. ఈ నేపథ్యంలో పరపతి విధాన తదుపరి సరళీకరణ ఉండే వీలుంది. ‘‘డిసెంబర్లో రేటు కోత ఉంటుందన్న మా అంచనాలను కొనసాగిస్తున్నాం. అరుుతే ఇక్కడ ఆయా అంచనాలు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వంటి అంశాలపైనా ఆధారపడి ఉంటుంది. ద్రవ్యలభ్యత, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం’’అని సిటీగ్రూప్ నివేదిక తెలిపింది. నోట్ల రద్దుతో డిమాండ్ డౌన్: కొటక్ పెద్ద నోట్ల రద్దుతో స్వల్పకాలంలో వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు దోహదం చేసే అంశం. ఇది ద్రవ్యోల్బణం అదుపునకు, ఆర్బీఐ రేటు కోతకు దోహదపడే వీలుంది. డిసెంబర్లో 25 బేసిస్ పారుుంట్ల రెపో రేటు తగ్గే వీలుంది. డిమాండ్ భారీగా పడిపోతే రేటు కోత 50 బేసిస్ పారుుంట్ల వరకూ సైతం తగ్గవచ్చు. పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం రియల్టీ సంబంధిత రంగాలు, రిటైల్ వ్యాపారం, ఇతర వినియోగ వస్తువుల విభాగాలపై ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం 5 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. హెచ్ఎస్బీసీదీ అదే మాట పెద్దనోట్ల రద్దు కారణంగా వ్యవస్థలో డిమాండ్ తగ్గుతుందని హెచ్ఎస్బీసీ కూడా తన నివేదికలో పేర్కొంది. ఇది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడే అంశమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రోపో రేటు పావుశాతం తగ్గే వీలుందని తెలిపింది ‘ మార్చి నాటికి ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం. పెద్ద నోట్ల రద్దు, క్రూడ్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో అదుపులో ఉండడం వంటి అంశాలు అటు టోకు ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడే అంశాలు. అరుుతే ఆయా అంశాలన్నీ అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల తీవ్రతపై ఆధారపడి ఉంటాయని కూడా నివేదిక పేర్కొంది. -
భారత్ వృద్ధి 7.7 శాతం: సిటీ గ్రూప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2016-17) భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.7 శాతం నమోదవుతుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం- సిటీగ్రూప్ నివేదిక ఒకటి తెలిపింది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వృద్ధి సూచీలు బలహీనంగా కనబడుతున్నప్పటికీ 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. ఏప్రిల్, మే నెలల్లో వాణిజ్య వాహన అమ్మకాలు, మౌలిక రంగంలో రుణ వృద్ధి, విద్యుత్ డిమాండ్, ఎయిర్ కార్గో వంటి విభాగాలు బలహీన ధోరణిని కనబరిచినట్లు నివేదిక విశ్లేషించింది. తగిన వర్షపాతంతో గ్రామీణ డిమాండ్ మెరుగుదల, 7వ వేతన సంఘం సిఫార్సుల అమలు వల్ల వినియోగం పెరగడం తమ వృద్ధి అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆయా అంశాలు పెట్టుబడుల వృద్ధికీ కొంతమేర దోహదపడతాయని అంచనావేసింది. -
భారీ ఐపీఓ బాటలో వొడాఫోన్!
రూ.13,200-16,500 కోట్ల రేంజ్లో హాంకాంగ్: భారత్‌లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రావడానికి వొడాఫోన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించడానికి సిటిగ్రూప్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్, యూబీఎస్ గ్రూప్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి దిగ్గజ సంస్థలను వొడాఫోన్ గ్రూప్ ఆహ్వానించిందని సమాచారం. ఐపీఓ వ్యవహారాలను చూడడానికి రెండు వారాల్లో ఆరు సంస్థలను ఎంపిక చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆరు సంస్థలను ఈ ఐపీఓ విలువ 200 కోట్ల డాలర్ల నుంచి 250 కోట్ల డాలర్ల(రూ.13,200 కోట్ల నుంచి రూ.16,500 కోట్లు) రేంజ్లో ఉంటుందని ఆ వర్గాల అంచనా. 2010లో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా కంపెనీ ఐపీఓ ద్వారా 350 కోట్ల డాలర్లు సమీకరించింది. దాని తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. విశ్లేషకుల అంచనా ప్రకారం వొడాఫోన్ ఇండియా విలువ 2,000 కోట్ల డాలర్లు(రూ.1,32,000 కోట్లు) ఉంటుందని అంచనా. -
భారత్ వృద్ధి రేటు సానుకూలమే: సిటీగ్రూప్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగానే ఉన్నట్లు గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం- సిటీగ్రూప్ తాజా నివేదిక పేర్కొంది. వృద్ధి రేటు 7.5 శాతంగా అంచనావేసింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5 శాతంగా ఉంటుందని తెలిపింది. వర్షాభావ పరిస్థితులు తలెత్తినా- తట్టుకోగల పరిస్థితులు దేశానికి ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 7 శాతం ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారత్ వృద్ధి రేటుకు పలు రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు కోతలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే సిటీగ్రూప్, ఓఈసీడీ వంటి సంస్థలు మాత్రం భారత్ వృద్ధి తీరుపట్ల సానుకూల ధోరణిలో ఉన్నాయి. -
ఈ ఏడాది 5.6% వృద్ధికి చాన్స్: సిటీ గ్రూప్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో దేశ జీడీపీ 5.6% స్థాయిలో వృద్ధి చెందే అవకాశముందని సిటీగ్రూప్ అంచనా వేసింది. సంస్కరణలు వేగవంతంకావడం, ద్రవ్యోల్బణం దిగిరావడం వంటి అంశాలు ఇందుకు దోహదపడతాయని ఒక నివేదికలో సిటీగ్రూప్ పేర్కొంది. రెండో క్వార్టర్లో ఆర్థిక వృద్ధి 5.3%కు పరమితమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఊపందుకున్న సంస్కరణలు, మెరుగుపడుతున్న లిక్విడిటీ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని అభిప్రాయపడింది. ఈ ఏడాది తొలి క్వార్టర్లో జీడీపీ 5.7% వృద్ధి సాధించినప్పటికీ, రెండో క్వార్టర్లో 5.3%కు పరిమితమైంది. వెరసి ఈ ఏడాది ప్రథమార్ధంలో 5.5% ఆర్థిక వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే కాలంలో సాధించిన 4.9%తో పోలిస్తే 12% పురోగమించినట్లే. కాగా, గతేడాది పూర్తికాలానికి 4.7% వృద్ధి నమోదుకాగా, ఈ ఆర్థిక సంవత్సరం 5.6%కు చేరవచ్చునని సిటీగ్రూప్ అంచనా వేసింది. వేగవంతమైన సంస్కరణలు, మెరుగుపడ్డ లిక్విడిటీ పరిస్థితులు, ప్రాజెక్ట్‌లకు అనుమతులు వంటి అంశాలు తాజా అంచనాలకు కారణమని తెలిపింది. -
ఐపీవోకి చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా
హాంకాంగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాల్లో ఉంది. ఇందుకు వీలుగా ఆరు మర్చంట్ బ్యాంకర్లతో చర్చలు నిర్వహిస్తోంది. అమెరికా మార్కెట్లలో చేపట్టనున్న ఐపీవో ద్వారా కంపెనీ 15 బిలియన్ డాలర్ల వరకూ సమీకరించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే 2012లో వచ్చిన ఫేస్బుక్ ఇష్యూ తరువాత అతిపెద్ద ఐపీవోగా నిలిచే అవకాశముంది. ఇష్యూ నిర్వహించేందుకు(అండర్‌రైటింగ్) సిటీగ్రూప్, డాయిష్ బ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ తదితర సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో ప్రారంభంకానున్న ఈ ఇష్యూ ఊహించినదానికంటే అధిక విలువను సాధించే అవకాశమున్నదని, తద్వారా టెక్నాలజీ పరిశ్రమలో రెండో అతిపెద్ద ఇష్యూగా నిలవవచ్చునని పేర్కొన్నాయి. ఈబే, అమెజాన్ కలిపితే... ఈ కామర్స్ దిగ్గజాలు ఈబే, అమెజాన్.కామ్ల సంయుక్త బిజినెస్‌కంటే అలీబాబా వ్యాపారమే అధికంకావడం విశేషం. సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది పనిచేస్తున్నారు. చైనా ఈ కామర్స్ మార్కెట్లో 80% వాటా కంపెనీదే. అలీబాబాలో 37% వాటాతో సాఫ్ట్‌బ్యాంక్, 24% వాటా కలిగిన యాహూ అతిపెద్ద వాటాదారులుగా ఉన్నాయి. అలీబాబా వ్యవస్థాపకులు, కొంతమంది సీనియర్ మేనేజర్లకు కలిపి 13% వరకూ వాటా ఉంది. -
వచ్చే ఏడాది 5.6% వృద్ధి: సిటీ గ్రూప్
న్యూఢిల్లీ: వచ్చే 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీడీ) వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండొచ్చని సిటీ గ్రూప్ అంచనా వేసింది. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం కొలువుదీరటం, పెట్టుబడులు పుంజుకోవడం, మెరుగైన రుతుపవనాలు వంటివి దీనికి అత్యంత కీలకమని నివేదికలో పేర్కొంది. ‘ఎల్ నినో’ ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవచ్చని.. దీంతో వ్యవసాయ ఉత్పాదకత తగ్గే రిస్క్‌లు పొంచిఉన్నట్లు సీటీ గ్రూప్ వెల్లడించింది. కంపెనీలు పెట్టుబడులపై నిర్ణయాలకు ఎన్నికలు పూర్తయ్యేదాకా వేచిచూడనున్నాయని అభిప్రాయపడింది. కేంద్రీయ గణంకాల సంస్థ(సీఎస్ఓ) ఈ ఏడాది(2013-14) వృద్ధి రేటు 4.9%గా ఉండొచ్చని ముందస్తు అంచనాల్లో పేర్కొనడం తెలిసిందే. సిటీ గ్రూప్ ఈ ఏడాది వృద్ధి 4.8%గా అంచనా వేసింది. ద్రవ్యలోటు 4.7 శాతానికి: ఆర్థిక శాఖ ఈ ఏడాది(2013-14) ద్రవ్యలోటు 4.7 శాతానికి కట్టడికావచ్చని(లక్ష్యం 4.8%) ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. 2జీ స్పెక్ట్రం వేలానికి స్పందన బాగుండటం(6 రోజుల్లో రూ.56,500 కోట్ల బిడ్లు లభించాయి), కోల్ ఇండియా భారీ డివిడెండ్ ఇతరత్రా అంశాలు ఇందుకు దోహదం చేయనున్నాయని చెప్పారు.