ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ సిటీ గ్రాప్ (Citigroup) ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (Q3) 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఈ ఏడాది కంపెనీ సీవెరన్స్ ఛార్జీలు (తొలగించిన ఉద్యోగులకు చెల్లించే పరిహారం) 650 మిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ నివేదించింది.
కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ మాసన్ అనలిస్టులతో కాన్ఫరెన్స్ కాల్‌లో ఆదాయాలపై చర్చిస్తూ ఈ ఏడాది మొత్తంగా కంపెనీ దాదాపు 7,000 ఉద్యోగాలను తగ్గించిందని చెప్పారు. మూడో త్రైమాసికంలో 2000 ఉద్యోగాలు తగ్గించగా అంతకుముందు జూన్ చివరి నాటికి 5000 ఉద్యోగాలు తగ్గించినట్లు పేర్కొన్నారు.
కంపెనీ హెడ్‌కౌంట్ తగ్గడానికి కారణం రీపోజిషనింగ్ ఛార్జీలే అని మాసన్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు సంస్థ నమోదు చేసిన ఛార్జీలు సిటీ గ్రూప్ గత నెలలో ప్రకటించిన పునర్వ్యవస్థీకరణను (ఐదు కీలక వ్యాపారాలపై సంస్థను తిరిగి కేంద్రీకరించే పునరుద్ధరణ)కి సంబంధించినది కాదని ఆయన స్పష్టం చేశారు.
కంపెనీ పునర్నిర్మాణం మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీస్తుందని సిటీ గ్రూప్ పేర్కొంది. అయితే ఆ సంఖ్య ఎంతన్నది స్పష్టత ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment