ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు..వర్క్ కల్చర్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాయి. కానీ వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం తలొగ్గడం లేదు. గూగుల్,ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు వ్యాక్సినేషన్ అంశంలో ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవాలి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంచలన ప్రకటనలు చేయగా..ఇప్పుడు అదే దారిలో మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ 'సిటీ గ్రూప్' ప్రధాన కార్యాలయం 'వాల్ స్ట్రీట్' ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.వ్యాక్సిన్ వేయించుకుంటారా? లేదంటే విధుల నుంచి తొలగించమంటారా? అని ప్రశ్నిస్తూ గడువు విధించింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం..జనవరి 14 నాటికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అందించని ఉద్యోగుల్ని అన్ పెయిడ్ లీవ్‌తో పాటు, విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది.
కొంతమంది ఉద్యోగుల్ని బోనస్ అనర్హులుగా ప్రకటించనుంది. ఒకవేళ ఆఫీస్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు ఉంటే బోనస్‌లు తీసుకునే ముందు కంపెనీకి వ్యతిరేకంగా వ్యవహరించమని తెలిపే ఒప్పొంద పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. సిటీగ్రూప్ సిబ్బందిలో 90శాతం కంటే ఎక్కువ మంది అమెరికన్ ఉద్యోగులకు ఈ నియమాల్ని అందుబాటులోకి తెచ్చింది. మతపరమైన లేదా ఆరోగ్య పరంగా మినహాయింపు ఇచ్చింది.
ఒమిక్రాన్ కేసులు తీవ్రతరం కావడంతో అమెరికాలో ఆయా సంస్థలు రిటర్న్-టు-ఆఫీస్ ప్లాన్, వర్క్‌ప్లేస్ లో వ్యాక్సినేషన్ వంటి అంశాల గురించి చర్చలు జరుపుతున్నాయి.ఈ నేపథ్యంలో సిటీ గ్రూప్ దాదాపు 70వేల మంది ఉద్యోగులకు జాబ్ కావాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని నియమాల్ని అమలు చేసింది. అదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్, జెపి మోర్గాన్ వంటి సంస్థలు ఉద్యోగులకు టీకా అవసరం ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: వారంలో 5 రోజుల కంటే తక్కువ పనిదినాలున్న దేశాలు ఇవే..త్వరలో భారత్..
Comments
Please login to add a commentAdd a comment