JAB
-
ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్‌లో భారత ప్రజావస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ నేతలు ఆయన్ను క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు కూడా. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన లండన్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. ఐనా ఏ వ్యక్తికి అయినా దేశం వెలుపల మాట్లాడే స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ తోపాటు బాధ్యతయుతంగా ప్రవర్తించడం అనేది అత్యంత ముఖ్యం అని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిగా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారాయన. ఆమె హయాంలోనే పౌర హక్కులు హరించడం జరిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు రాహుల్ నానమ్మ(ఇందిరా గాంధీ) చట్టబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి ఆర్టికల్ 356ని 150 సార్లు ప్రయోగించారన్నారు. అలాగే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను గురించ చెబుతూ ..దాన్ని దూరదృష్టితో కూడిన చర్యగా అభివర్ణించారు. చైనాకు సంబంధించిన బీఆర్ఐ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తోందని ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, అదానీ సమస్యపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కారణంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడంతో వాగ్వాదం తలెత్తింది. దీంతో సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదాపడ్డాయి. అదానీ స్టాక్స్ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాల చేయడంతో ఐదో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి వాయిదా పడింది. (చదవండి: సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. పిల్‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ మండిపాటు) -
ఉద్యోగులకు షాక్, టీకా వేయించుకుంటారా..ఉద్యోగం నుంచి తొలగించమంటారా!
ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు..వర్క్ కల్చర్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాయి. కానీ వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం తలొగ్గడం లేదు. గూగుల్,ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు వ్యాక్సినేషన్ అంశంలో ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవాలి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంచలన ప్రకటనలు చేయగా..ఇప్పుడు అదే దారిలో మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ 'సిటీ గ్రూప్' ప్రధాన కార్యాలయం 'వాల్ స్ట్రీట్' ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.వ్యాక్సిన్ వేయించుకుంటారా? లేదంటే విధుల నుంచి తొలగించమంటారా? అని ప్రశ్నిస్తూ గడువు విధించింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం..జనవరి 14 నాటికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అందించని ఉద్యోగుల్ని అన్ పెయిడ్ లీవ్‌తో పాటు, విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. కొంతమంది ఉద్యోగుల్ని బోనస్ అనర్హులుగా ప్రకటించనుంది. ఒకవేళ ఆఫీస్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు ఉంటే బోనస్‌లు తీసుకునే ముందు కంపెనీకి వ్యతిరేకంగా వ్యవహరించమని తెలిపే ఒప్పొంద పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. సిటీగ్రూప్ సిబ్బందిలో 90శాతం కంటే ఎక్కువ మంది అమెరికన్ ఉద్యోగులకు ఈ నియమాల్ని అందుబాటులోకి తెచ్చింది. మతపరమైన లేదా ఆరోగ్య పరంగా మినహాయింపు ఇచ్చింది. ఒమిక్రాన్ కేసులు తీవ్రతరం కావడంతో అమెరికాలో ఆయా సంస్థలు రిటర్న్-టు-ఆఫీస్ ప్లాన్, వర్క్‌ప్లేస్ లో వ్యాక్సినేషన్ వంటి అంశాల గురించి చర్చలు జరుపుతున్నాయి.ఈ నేపథ్యంలో సిటీ గ్రూప్ దాదాపు 70వేల మంది ఉద్యోగులకు జాబ్ కావాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని నియమాల్ని అమలు చేసింది. అదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్, జెపి మోర్గాన్ వంటి సంస్థలు ఉద్యోగులకు టీకా అవసరం ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వారంలో 5 రోజుల కంటే తక్కువ పనిదినాలున్న దేశాలు ఇవే..త్వరలో భారత్.. -
‘వ్యాక్సిన్ ఆఫర్’.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ !
దేశవ్యాప్తంగా తమ సినియా థియేటర్లు, మల్టీప్లెక్సులు జులై 30 నుంచి తెరుచుకుంటాయని మల్టీప్టెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్స్‌కి వచ్చే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘జాబ్ ఆఫర్’ను ప్రకటించింది. బొమ్మపడింది దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో క్రమంగా సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా తెరుచుకునేందుకు ఉత్సాహంగా ఉండగా కోవిడ నిబంధనల కారణంగా మల్టీప్లెక్స్‌లు కొంచెం తటపటాయిస్తున్నాయి. అయితే వందశాతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఆధీనంలో ఉన్న మల్టీప్లెక్సులు జులై 30 నుంచి ఓపెన్ చేశామని పీవీఆర్ ప్రకటించింది. అందరికీ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను వంద శాతం తప్పక పాటిస్తామని పీవీఆర్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్సులలో పని చేసే సిబ్బంది అందరికీ కో\విడ్ వ్యాక్సిన్ అందించామని తెలిపింది. ప్రేక్షకులు ఎటువంటి సందేహాలు లేకుండా సినిమాలను ఎంజాయ్ చేయవచ్చని చెప్పండి వ్యాక్సిన్ ఆఫర్ మల్టీప్లెక్సుల ఓపెనింగ్ సందర్భంగా వ్యాక్సిన్ ఆఫర్‌ని ప్రకటిచింది పీవీఆర్ సినిమాస్. వ్యాక్సిన్ తీసుకుని పీవీఆర్ సినిమాస్‌కి వచ్చిన వారికి ఎంపిక చేసిన కంటెంట్ (సినిమా)పై ఒక టికెట్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ఫుడ్ అండ్ బేవరేజెస్ సెక్షన్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ మల్టీప్లెక్సులు ఓపెన్ చేసిన ఒక వారం పాటు అమల్లో ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఎంపిక చేసిన కంటెంట్ ఏమిటనే దానిపై కచ్చితమైన వివరణ ఇవ్వలేదు. ఆయా మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే సినిమాలు, ఇతర కంటెంట్‌ను బట్టి ఇది మారే అవకాశం ఉంది. -
గబ్బిలమే కాదు.. కోడి, కుక్క, పిల్లి కూడా ప్రమాదకరమే
నానో టెక్నాలజీలో ఎన్నో ఆవిష్కరణలు కనుగొంటున్న సమయంలో కంటికి కనిపించని అతి చిన్న వైరస్ మానవ మనుగడను ప్రమాదంలో పడేసింది. కరోనా వైరస్ మనిషికి ఎలా సోకిందనే దానిపై అనేక వాదనలు ఉన్నా... ఇప్పటికీ గబ్బిలం నుంచి వచ్చిందని నమ్మేవారే ఎక్కువ. జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎప్పటి నుంచి ఉంది , దీన్ని అరికట్టేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెబ్‌డెస్క్: జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మనిషి ప్రయాణానికి సడెన్ బ్రేక్ వేసి, గట్టి జర్క్ ఇచ్చింది కరోనా వైరస్. గబ్బిలం నుంచి పాంగోలిన్ ద్వారా మనుషులకు సోకిన కరోనా రెండేళ్లుగా జన జీవనాన్ని స్థంభింపచేస్తోంది. ఒక్క గబ్బిలమనే కాదు ఎలుక, కుక్క, పంది, ఆవు, పావురం, కుందేలు ఇలా మన చుట్టూ మనతో పాటు కలిసి బతుకున్న ఎన్నో జంతువులు, పక్షులు, క్రిమి కీటకాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు వైరస్, బ్యాక్టీరియా, ఇతర పరాన్న జీవుల వ్యాప్తి జరుగుతుంది. అదే విధంగా మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దీని వల్ల ఇరువైపులా కొత్త రకం వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీన్నే జూనోసిస్ అంటారు. జూనోసెస్ వ్యాధులు పురాతన కాలం నుంచి జూనోసెస్ వల్ల ఎన్నో వ్యాధులు సోకాయి. ఉదాహరణకు కుక్కల నుంచి రేబిస్, గబ్బిలం నుంచి నిఫా, పశువుల నుంచి మ్యాడ్ కౌ, కోళ్ల నుంచి ఫ్లూ తదితర రోగాలు సంక్రమించాయి. ఇప్పటి వరకు వేల కొద్ది జూనోసిస్ వ్యాధులు సంక్రమించినా... ఎక్కువ ప్రభావం చూపించినవి 156 వరకు ఉన్నాయి. అందులో రేబీస్, ప్లేగు, టీబీ, కలరా, మలేరియా, సాల్మోనెల్లా, స్కాబీస్ వంటివి ఉన్నాయి. వీటిలో చాలా వాటికి టీకాలతో ప్రమాద తీవ్రత తగ్గించగలిగారు. ఇటీవల కాలంలో సార్స్, ఎబోలా, జీకా, నిఫా, సాల్మోనెల్లా, కరోనాలు మానవాళికి ముప్పుగా మారాయి. ఇందులో కరోనా అయితే ఏకంగా ప్యాండమిక్ స్థాయికి చేరుకుంది. లూయి ప్యాక్చర్ గుర్తుగా జూనోసిస్ వ్యాధుల నివారణ, చికిత్స కోసం ఎంతో కాలం శ్రమించగా చివరకు 1885 జులై 6న లూయి ప్యాక్చర్ తొలిసారిగా కుక్క నుంచి సోకిన రేబిస్కి టీకాను కనిపెట్టారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతీ ఏడు జులై 6న జూనోసెస్ డేను పాటిస్తున్నారు. ప్రివెంట్ ది ప్యాండెమిక్ కరోనా నేపథ్యంలో ఈ సారి జూనోసెస్ డే పట్ల ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా అనేక మంది జీవితాలు అంతమవగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరెందరో జీవితాలు ఇరుకున పడ్డాయి. దీంతో జూనోసెస్ వ్యాధులపై మరింత అవగాహన కల్పించాలనే నినాదం ముక్తకంఠంతో వినిపిస్తోంది. ‘ ప్రివెంట్ ద నెక్ట్స్ ప్యాండెమిక్ : జూనోటిక్ డిసీజెస్ అండ్ హౌ టూ బ్రేక్ ది చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ’ థీమ్‌తో 2021 కి సంబంధించిన జూనోసెస్ డేని నిర్వహిస్తున్నారు. లైవ్స్టాక్పై దృష్టి భూమిపై జనాభా రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో ఆహార అవసరాల కోసం కోళ్లు, మేకలు, పందులు, పశువులు, పక్షులు (లైవ్ స్టాక్)లతో పాటు ఇతర జీవజాలంపై ఆధారపడుతున్నాం. మాంసాహారం కోసం భారీ ఎత్తున లైవ్ స్టాక్ పెంచుతున్నాం. అయితే ఇందుకు తగ్గ జాగ్రత్తలు, మేలైన యాజమాన్య పద్దతులు అమలు చేయడంలో విఫలమవుతున్నాం. ఫలితంగా జంతువుల నుంచి మానవులకు వైరస్, బ్యాక్టరీయాల వ్యాప్తి పెరిగిపోతుంది. దీన్ని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్‌పై ఫోకస్ కరోనా మహమ్మారి ఇచ్చిన చేదు అనుభవంతో లైవ్ స్టాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకు తగ్గట్టుగా వెటర్నిటీ, మెడికల్, ఎన్విరాన్మెంట్ మూడింటిని సమ్మిళతం చేస్తూ సరికొత్త పరిశోధనలు చేయాలని డిసైడ్ అయ్యారు. తద్వారా అనారోగ్య సమస్యలు, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. -
2018 నుంచి ఐఐటీ ప్రవేశపరీక్ష ఆన్లైన్లోనే
చెన్నై: ఐఐటీ ప్రవేశపరీక్షను 2018 నుంచి పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహిస్తామని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) తెలిపింది. ఐఐటీల్లో అడ్మిషన్ల విధివిధానాలను రూపొందించే జేఏబీ ఆదివారం నాడిక్కడ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మద్రాస్ ఐఐటీ డైరెక్టర్, జేఏబీ చైర్మన్ ప్రొ.భాస్కర్ రామమూర్తి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షను 2018 నుంచి పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించాం. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇతర అంశాలను సమయానుగుణంగా వెల్లడిస్తామ’ని పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇంతకుముందే విద్యార్థులకు ఐఐటీ–జేఈఈ మెయిన్స్ పరీక్షను ఆన్లైన్లో రాసే అవకాశం కల్పించింది. అయితే ఈ ఏడాది మెయిన్స్ రాసిన 13 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 10% మంది మాత్రమే ఆన్లైన్ విధానాన్ని వినియోగించుకున్నారు. -
పాపం సీనియర్ నటిని బుక్ చేశారు
చెన్నై: తమిళనాడు లోని రెండు అగ్రపార్టీల మధ్య రాజకీయ పోరులో ఒక సీనియర్ నటి అనూహ్యంగా ఇరుక్కున్నారు. చెన్నైలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచార హోరులో ఒక ప్రకటన విమర్శల పాలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంకోసం మీడియాను విరివిగా వాడుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక టీవీ ప్రకటనల్లో ఊదరగొడుతున్న ప్రకటన వివాదస్పదమైంది. 'కన్నబిడ్డలే కూడు పెట్టలేదు, నాకు అన్నం పెట్టింది విప్లవనాయిక అమ్మనే' ఇది అన్నాడీఎంకే ఆధ్వర్యంలో అధినేత్రి పురిచ్చిత్తలైవిని ఆకాశానికెత్తుతూ సాగే ప్రకటన. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయలలిత చేపట్టిన 'అమ్మ క్యాంటీన్' పథకం వల్ల తమ కుటుంబం భోజనం చేస్తోందని, అన్నం పెట్టిన అమ్మకు ధన్యవాదాలు చెబుతున్నానంటూ రూపొందించిన యాడ్ ఫిల్మ్. 'ఆకాశంలో ఎగిరేవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఇంకెందుకండి, చాలమ్మా..'. ఇది అధికార పగ్గాల కోసం ఉబలాటపడుతూ ఎలాగైనా, అమ్మను గద్దెదించాలని ఆరాటపడుతున్న డీఎంకే ఎన్నికల ప్రచార ప్రకటన. ఈ రెండు ప్రచార ప్రకటనల దృశ్యాలు టీవీ ఛానెళ్లలో విసృత్తంగా రోజూ ప్రసారమవుతున్నాయి. అయితే ఇక్కడే వుంది అసలు కథ. ఆ రెండు ప్రచార ప్రకటన దృశ్యాల్లోనూ నటించిన నటి ఒక్కరే కావడం విశేషం. ఒకే వ్యక్తి ఒకసారి జయలలితను ప్రశంసిస్తూ, మరోసారి విమర్శిస్తూ నటించిన ఈ రెండు వేర్వేరు ప్రకటనలను టీవీలు పదేపదే ప్రసారం చేస్తున్నాయి. అంతేకాదు ఈ రెండు వీడియో సన్నివేశాలనూ వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేసారు. దీంతో వివాదం చెలరేగింది. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ప్రజలతో ఇలాంటి తప్పుడు సందేశాలను ఇప్పిస్తున్నారంటూ పలువురు ఆరోపించడంతో వ్యవహారం కాస్తా ముదిరి పాకానపడింది. పాపం ఈ రెండు ప్రకనటల్లో నటించిన నటి పేరు కస్తూరి(64) . ముద్దుపేరు కస్తూరి పాటి (అమ్మమ్మ). చెన్నై తేనాంపేటలోని గుడిసెలో నివసించే కస్తూరిని దీనిపై వివరణ కోరగా.. ఆమె ఇలా చెప్పుకొచ్చారు... తాను ఎంత చెప్పినా వినకుండా ఇలా రెండు ప్రకటనల్లోను తనచేత నటింపచేశారని వాపోయింది. 20 రోజుల కిందట అమ్మ ప్రకటన కోసమంటూ నటించడానికి తనను తీసుకెళ్లారనీ, అందుకుగాను తనకు రూ.1,500 ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత కొద్దిరోజులకే మరో యాడ్ ఫిలిమ్‌లో నటించాలంటూ తీసుకెళ్లారని, అక్కడకు వెళ్లాక విషయం తెలిసిన వెంటనే , తన అభ్యంతరాన్ని తెలియజేశానని తెలిపింది. ఆ ప్రకటన అమ్మజయలలితకు వ్యతిరేకంగా ఉందని, అప్పటికే తాను అమ్మకు సానుకూలంగా ఓ ప్రచార వీడియో నటించానని వాళ్లకు చెప్పినా.... అయినా ఫర్వాలేదులే అని నటింపచేశారని, ఇందుకు గానూ తనకు రూ.1000 ఇచ్చి పంపించి వేశారని చెప్పింది. అయితే తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకుంది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమలాంటి వాళ్లకు మంచి చేయాలని మాత్రం కోరుకుంటానని పేర్కొంది. కాగా ధనుష్ నటించిన మయక్కం ఎన్న, విజయ్ సేతుపతి నటించిన ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమార సంతానం నటించిన ఇనిమే ఇప్పడిదాన్ తదితర చిత్రాల్లో సహాయ నటిగా ఆమె నటించారు. -
ఐఐటీ అడ్మిషన్లకు ఒకే టెస్ట్?
- జేఈఈ(మెయిన్), జేఈఈ(అడ్వాన్స్) స్థానంలో ఐఐటీలకు ప్రత్యేక ప్రవేశపరీక్ష! - ప్రస్తుత విధానాన్ని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయా?.. 2012లో ప్రవేశపెట్టిన రెండంచెల ప్రవేశ పరీక్ష స్థానంలో మళ్లీ గతంలోలా ఐఐటీలకు ప్రత్యేకంగా ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి ఐఐటీ వర్గాలు. ప్రస్తుతమున్న రెండంచెల పరీక్షావిధానాన్ని సమీక్షించేందుకు ఈ ఆదివారం ఒక కమిటీని జాయింట్ ఆడ్మిషన్ బోర్డ్(జేఏబీ) ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రస్తుత పరీక్షా విధానాన్ని, గత పరీక్షా విధానాన్ని అధ్యయనం చేసి జేఏబీకి సిఫారసులు చేస్తుంది. అయితే, ఐఐటీలకు ప్రత్యేకంగా ఒకే పరీక్షను నిర్వహించాలన్న ప్రతిపాదనకే అత్యధిక ఐఐటీలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2012లో ప్రవేశపెట్టిన ప్రస్తుత విధానం ప్రకారం.. మొదట ‘జేఈఈ(జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్’ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రాయోజిత సంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినవారు మాత్రమే ‘జేఈఈ అడ్వాన్స్’పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఐఐటీల్లో అడ్మిషన్లు లభిస్తాయి. అయితే, ఈ విధానం చాలా సమయం తీసుకుంటోందని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో జేఏబీ ఈ విధానంపై ఆదివారం నాటి సమావేశంలో చర్చించి, కమిటీని ఏర్పాటు చేసింది. ఒకవేళ ఈ విధానం స్థానంలో, గతంలోలా ఐఐటీలకు ఒకే ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపితే.. యూపీయే హయాంనాటి మరో నిర్ణయం రద్దు అయినట్లు అవుతుంది.