మీ పాన్ యాక్టివ్‌గా ఉందా? చెక్ చేశారా?
న్యూఢిల్లీ: నకిలీ పాన్ నంబర్ల ఏరివేతలో ప్రభుత్వం, ఆదాయపన్ను శాఖ చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇప్పటికే దాదాపు 11లక్షలకు పైగా పాన్ కార్డులు రద్దయ్యాయి. జులై 27, 2012 నాటికి 11,44,211 నకిలీ ప్యాన్ కార్డులను క్యాన్సిల్ చేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరు నాటికి ఆధార్ తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో మన పాన్ నెంబర్ యాక్టివ్ గా ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు.
1. ఆదాయం పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్-www.incometaxindiaefiling.gov.in ను సందర్శించండి
2. హోమ్ పేజీలో, 'సర్వీసులు' అనే టాబ్ క్రింద, 'నో యువర్ పాన్' క్లిక్ చేయండి.
3. పేరు, జెండర్, మతం, జనన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి 'సబ్ మిట్' అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.
4. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఒక-టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి వేలిడేట్ అనే బటన్ క్లిక్ చేయండి.
5. దీంతో పాన్ చెల్లుబాటులో ఉన్నట్లయితే రిమార్క్ కాలంలో 'యాక్టివ్'అన్న సందేశం వస్తుంది.
పాన్ ఆధార్ లింకింగ్ విషయానికి వస్తే...ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా చాలా సులువుగా ఆధార్‌తోను పాన్ లింక్ చేయవచ్చు. incometaxindiaefiling.gov.in. లాగిన్ అయ్యి లేదా డైరెక్టుగా లింక్ ఆధార్ అంటే.. పాప్ అప్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ నిర్దేశిత కాలంలో ఆధార్ నెంబర్, పాన్ నంబర్ ఎంట్రీ చేయాలి. కాప్చాకోడ్‌ను ఎంటర్ చేసిన లింక్‌ఆధార్ అనే ఆప‍్షన్‌ను క్లిక్ చేయాలి. పుట్టిన తేదీ, ఇంటిపేరు, పేరు, ఆధార్, పాన్‌తో సరిపోలితే వెంటనే ఆధార్‌తో పాన్ విజయవంతంగా అనుసంధాన మైనట్టుగా ఒక మెసేజ్ వస్తుంది.
లేదా ఎస్‌ఎమ‍్మెస్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. UIDPAN స్పేస్ , 12 అంకెల ఆధార్ నంబర్... స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నెంబర్ ఎంటర్ చేసి తే567678 or 56161 నెంబరుకు ఎస్‌ఎంఎస్ చేస్తే సరిపోతుంది. దీన్ని నిర్ధారిస్తూ మన మొబైల్‌కు ఒక సందేశం వస్తుంది. దీంతో కీలకమైన ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తవుతుంది.
కాగా ఆదాయ పన్ను దాఖలుకు ఆధార్‌తో పాన్ అనుసంధానం తప్పనిసరి. అలాగే ఆగస్టు 31 లోపు ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దవుతాయని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.