your
-
మీ మూడ్ ని మార్చేసే పూ బాలలు.. (ఫొటోలు)
-
నెలకో పార్టీ పెట్టి.. మెదడును సానబెట్టి..
నూతన సంవత్సరం వచ్చింది.. ‘ఇకపై రోజూ వ్యాయామం చేస్తా.. పొద్దున్నే లేచి బుక్స్ పట్టుకుంటా.. సిగరెట్ మానేస్తా.. మందు ముట్టుకోను..’ ఎవరికి వారు పెట్టుకునే ఇలాంటి టార్గెట్లెన్నో.. వీటిని కొద్దిరోజులు గట్టిగానే పాటించి.. ఆ తర్వాత వట్టిగానే వదిలేస్తుండటమూ కామనే. మరి ఇలా కొత్త సంవత్సరం కోసం కొత్త కొత్తగా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుంటే బాగుంటుందని ‘కృత్రిమ మేధ (ఏఐ)’ ప్రోగ్రామ్‌లను అడిగితే ఏమేం సూచించాయో తెలుసా..? – సాక్షి సెంట్రల్ డెస్క్ కొత్తగా ఏం చేస్తే బాగుంటుందని? ఇటీవల ఏఐ ప్రోగ్రామ్‌ల వినియోగం పెరిగిపోయింది. ఫొటోలను, వీడియోలను సృష్టించడం నుంచి కంప్యూటర్ కోడ్లను రాసిపెట్టడం, కెరీర్ సలహాల దాకా ఎన్నో పనులకు ఏఐని వాడేస్తున్నారు. ఈ క్రమంలో డెయిలీమెయిల్ వెబ్సైట్.. గూగుల్‌కు చెందిన ‘బార్డ్’, మైక్రోసాఫ్ట్ బింగ్‌కు అనుసంధానం చేసిన ‘చాట్‌జీపీటీ’, అమెజాన్ సహకారంతో అభివృద్ధి చేసిన ‘క్లాడ్’ఏఐ ప్రోగ్రామ్‌లను విభిన్నమైన ప్రశ్న అడిగింది. ఈ 2024 సంవత్సరంలో.. విభిన్నమైన లక్ష్యాలను సూచించాలని, అయితే అవి సులువుగా సాధించగలిగేలా ఉండాలని కోరింది. దీనికి ఏఐ ప్రోగ్రామ్‌లు నిజంగానే వినూత్న ఐడియాలు ఇచ్చాయి. కృత్రిమ మేధ అంటేనే డిజిటల్ ప్రోగ్రామ్‌లు. అయినా సాంకేతికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలంటూ సూచనలు చేయడం గమనార్హం. నెలకో డిన్నర్ థీమ్ పార్టీ ప్రతినెలా ఓ రోజు విభిన్నమైన థీమ్‌తో డిన్నర్ పార్టీ చేసుకోవాలని గూగుల్ బార్డ్ సూచించింది. ‘‘పురాతన విందుల నుంచి స్పేస్‌లో ప్రయాణం దాకా భిన్నమైన థీమ్‌లు పెట్టుకుని డిన్నర్ పార్టీ చేసుకోండి. ప్రతిసారి సరికొత్త వంటకాలను ప్రయత్నించండి. ఇలాంటి పారీ్టల వల్ల స్నేహం, బంధాలు బలపడతాయి. ఒత్తిళ్లు దూరమవుతాయి..’’అని పేర్కొంది. మీ కుటుంబ మూలాల్లోకి వెళ్లండి ‘‘మీ కుటుంబం మూలాల్లోకి వెళ్లండి. దూరపు బంధువులు, పెద్దలను కలసి కుటుంబ చరిత్రను, పూరీ్వకుల ఘనతను తెలుసుకోండి. ఫ్యామిలీ ట్రీని రూపొందించుకోండి. మీకు ఎన్నో ఉత్కంఠ భరిత అంశాలు తెలియవచ్చు. అంతా సరికొత్తగా ఉంటుంది..’’అని గూగుల్ బార్డ్ సూచించింది. వారానికోసారి చేతి రాతతో లెటర్ రాయండి ప్రతి వారం చేతిరాతతో కూడిన లేఖలు రాసే అలవాటు చేసుకోవాలని క్లాడ్ ఏఐ సూచించింది. ‘‘దూరంగా ఉన్న బంధువులు, స్నేహితులకు ఒకప్పటి తరహాలో చేతి రాతతో లెటర్లు రాయండి. మీ అనుభూతులను, ఆలోచనలను అందులో పంచుకోండి. ఈ అనుభవం ఎంతో బాగుంటుంది’’అని క్లాడ్ పేర్కొంది. ‘డిజిటల్ డిటాక్స్’ మొదలుపెట్టండి కొత్త సంవత్సరం సందర్భంగా డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండే (డిజిటల్ డిటాక్స్) తీర్మానం చేసుకోవాలని చాట్‌జీపీటీ పేర్కొంది. ‘‘వారంలో ఒక రోజు లేదా రోజులో కొన్ని గంటల పాటు ఫోన్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలాంటి డిజిటల్ పరికరాలు వాడొద్దన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ సమయంలో పుస్తకాలు చదవడం, మెడిటేషన్, ప్రకృతిలో గడపడం వంటివి చేయండి..’’అని సూచించింది. వారానికో రోజు పూర్తి వెజ్.. మీ ఆహార అలవాట్లను నియంత్రించుకుని, వారానికి ఓ రోజు పూర్తిగా శాఖాహారమే తీసుకునేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని ‘చాట్‌జీపీటీ’సూచించింది. ‘‘వారానికి ఒక రోజు పూర్తిగా వెజ్. అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త వంటకాలు, రుచులను ఆస్వాదించండి. ఇది మీకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుతుంది. పర్యావరణానికీ ఎంతో మంచిది..’’అని పేర్కొంది. కొత్త ఏడాది కోసం ‘ఏఐ’ చెప్పిన సరికొత్త లక్ష్యాలు మీకు నచ్చిన అంశంపై రోజుకో వాక్యం ‘‘మీకు నచ్చిన, బాగా ఆసక్తి ఉన్న అంశంపై డైరీ లాంటి ఓ జర్నల్ను మొదలుపెట్టండి. అందులో రోజుకు కనీసం ఒక్క వాక్యాన్ని తప్పనిసరిగా రాస్తూ వెళ్లండి. కొంతకాలానికి ఈ జర్నల్ ఎంతో ఆలోచనాత్మకంగా రూపుదిద్దుకుంటుంది..’’అని చాట్‌జీపీటీ సూచించింది. చిన్ననాటి భయాన్ని దూరం చేసుకోండి ప్రతి ఒక్కరికీ చిన్ననాటి భయాలు కొన్ని ఉంటాయి. నదులు, సముద్రాల్లోకి దిగడానికి.. రోలర్ కోస్టర్, జెయింట్ వీల్ వంటివి ఎక్కడానికి భయపడుతుంటారు. పబ్లిక్ మీటింగ్‌లలో మాట్లాడటానికి మొహమాటపడతారు.. సాలె పురుగులు, బల్లులను చూస్తే దూరంగా పరుగెడతారు. ఇలాంటి వాటిని వదిలించుకునేలా కొత్త సంవత్సరం ప్రయత్నించాలని క్లాడ్ ఏఐ సూచించింది. ఖర్చులకు బడ్జెట్.. పొదుపుపై ఫోకస్ ఈ ఏడాది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని బింగ్–చాట్‌జీపీటీ పేర్కొంది. ‘‘ప్రతి ఖర్చును నమోదు చేస్తూ బడ్జెట్ రూపొందించుకోండి, కచ్చితంగా డబ్బును పొదుపు చేయండి, జాగ్రత్తపడుతూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి’’అని సూచించింది. మెదడును సానబెట్టండి కొత్త సంవత్సరంలో మీ మెదడుకు పనిచెప్పి, చురుగ్గా ఉండేలా ప్రయత్నించాలని గూగుల్ బార్డ్ సూచించింది. ఏదైనా ఒక తేదీ చెప్తే.. అది ఏ వారమో చెప్పగలిగేలా ప్రయత్నం చేయాలని.. ఇది చూసి అంతా ఆశ్చర్యపోతారని పేర్కొంది. -
మీ పాన్ యాక్టివ్‌గా ఉందా? చెక్ చేశారా?
న్యూఢిల్లీ: నకిలీ పాన్ నంబర్ల ఏరివేతలో ప్రభుత్వం, ఆదాయపన్ను శాఖ చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇప్పటికే దాదాపు 11లక్షలకు పైగా పాన్ కార్డులు రద్దయ్యాయి. జులై 27, 2012 నాటికి 11,44,211 నకిలీ ప్యాన్ కార్డులను క్యాన్సిల్ చేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరు నాటికి ఆధార్ తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో మన పాన్ నెంబర్ యాక్టివ్ గా ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. 1. ఆదాయం పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్-www.incometaxindiaefiling.gov.in ను సందర్శించండి 2. హోమ్ పేజీలో, 'సర్వీసులు' అనే టాబ్ క్రింద, 'నో యువర్ పాన్' క్లిక్ చేయండి. 3. పేరు, జెండర్, మతం, జనన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి 'సబ్ మిట్' అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. 4. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఒక-టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి వేలిడేట్ అనే బటన్ క్లిక్ చేయండి. 5. దీంతో పాన్ చెల్లుబాటులో ఉన్నట్లయితే రిమార్క్ కాలంలో 'యాక్టివ్'అన్న సందేశం వస్తుంది. పాన్ ఆధార్ లింకింగ్ విషయానికి వస్తే...ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ ద్వారా చాలా సులువుగా ఆధార్తోను పాన్ లింక్ చేయవచ్చు. incometaxindiaefiling.gov.in. లాగిన్ అయ్యి లేదా డైరెక్టుగా లింక్ ఆధార్ అంటే.. పాప్ అప్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ నిర్దేశిత కాలంలో ఆధార్ నెంబర్, పాన్ నంబర్ ఎంట్రీ చేయాలి. కాప్చాకోడ్ను ఎంటర్ చేసిన లింక్‌ఆధార్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. పుట్టిన తేదీ, ఇంటిపేరు, పేరు, ఆధార్, పాన్‌తో సరిపోలితే వెంటనే ఆధార్‌తో పాన్ విజయవంతంగా అనుసంధాన మైనట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. లేదా ఎస్ఎమ్మెస్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. UIDPAN స్పేస్ , 12 అంకెల ఆధార్ నంబర్... స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నెంబర్ ఎంటర్ చేసి తే567678 or 56161 నెంబరుకు ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది. దీన్ని నిర్ధారిస్తూ మన మొబైల్‌కు ఒక సందేశం వస్తుంది. దీంతో కీలకమైన ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తవుతుంది. కాగా ఆదాయ పన్ను దాఖలుకు ఆధార్‌తో పాన్ అనుసంధానం తప్పనిసరి. అలాగే ఆగస్టు 31 లోపు ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దవుతాయని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కాకినాడ సిటీ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి డయల్ యువర్ జేసీ నిర్వహించగా 18 ఫోన్లు వచ్చాయి. ఎక్కువగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆయా ఫోన్‌కాల్స్‌కు జేసీ సమాధానమిచ్చి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ జూన్ నెలాఖరు నాటికి గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ కనెక్షన్ లేనివారందరూ ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీఎస్ఓ వి.రవికిరణ్, కలెక్టరేట్ ఏఓ తేజేశ్వరరావు, డీఆర్డీఏ ఏపీడీ సోమేశ్వరరావు పాల్గొన్నారు. టెలీకాన్ఫెరెన్స్ పౌరసరఫరాల అంశాలపై జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ శనివారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంఎస్ఓలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రేషన్ షాపుల్లో తప్పనిసరిగా నగదురహిత లావాదేవీలు ద్వారానే కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా ఉదయం, సాయంత్రం షాపులను తెరచి ఉం చాలని డీలర్లకు సూచించారు. ఉగాది సందర్భంగా కార్డుదారులకు అదనంగా అరకిలో పంచదార పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫెరెన్స్లో పౌరసరఫరాలశాఖాధికారి వి.రవికిరణ్ పాల్గొన్నారు. -
టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి
డాక్టర్ రాధాకృష్ణమూర్తి విజయలో ముగిసిన జాతీయ స్థాయి సింపోజియం తనికెళ్ల (కొణిజర్ల) : టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం విద్యార్థులపై ఉందని శ్రీకవిత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. మండలంలోని తనికెళ్ల సమీపంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ వారి ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్నికల్, కల్చరల్ ఫెస్ట్ యంగ్స్ప్రింగ్స్ 2016 ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు గెలుపు, ఓటములను పక్కన బెట్టి ఇలాంటి పోటీల్లో పాల్గొని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలన్నారు. టెక్నాలజీపై అవగాహన పెంచుకున్నప్పుడే భవిష్యత్‌లో రాణించగలుగుతారన్నారు. కళాశాల డైరక్టర్ ఎంఈఓ కె. రవీందర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు శిక్షణ పొందాలన్నారు. శనివారం నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్‌లో జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. పలు రకాల నృత్యాలు ఉర్రూత లూగించాయి. నాటికలు, హాస్యవల్లరిలు ఆసక్తిని రేకిత్తించాయి. కార్యక్రమంలో శ్రీకవిత మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్, కళాశాల కరస్పాడెంట్ ఎన్. బుచ్చిరామారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పీ.ఏ. అబ్దుల్ సలీమ్, వైస్ ప్రిన్సిపాల్ వి.చిన్నయ్య, సీఎస్సీ హెచ్ఓడీ పి.అశోక్‌కుమార్, వివిధ విభాగాల హెచ్ఓడీలు, కార్యక్రమ విద్యార్థి కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.