ఫ్యాషన్ షోలో పాల్గొన్న విద్యార్థినులు
- డాక్టర్ రాధాకృష్ణమూర్తి
- విజయలో ముగిసిన జాతీయ స్థాయి సింపోజియం
తనికెళ్ల (కొణిజర్ల) : టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం విద్యార్థులపై ఉందని శ్రీకవిత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. మండలంలోని తనికెళ్ల సమీపంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్‌సీ వారి ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్నికల్, కల్చరల్ ఫెస్ట్ యంగ్‌స్ప్రింగ్స్ 2016 ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు గెలుపు, ఓటములను పక్కన బెట్టి ఇలాంటి పోటీల్లో పాల్గొని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలన్నారు. టెక్నాలజీపై అవగాహన పెంచుకున్నప్పుడే భవిష్యత్‌లో రాణించగలుగుతారన్నారు. కళాశాల డైరక్టర్ ఎంఈఓ కె. రవీందర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు శిక్షణ పొందాలన్నారు. శనివారం నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్‌లో జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. పలు రకాల నృత్యాలు ఉర్రూత లూగించాయి. నాటికలు, హాస్యవల్లరిలు ఆసక్తిని రేకిత్తించాయి. కార్యక్రమంలో శ్రీకవిత మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్, కళాశాల కరస్పాడెంట్ ఎన్. బుచ్చిరామారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పీ.ఏ. అబ్దుల్ సలీమ్, వైస్ ప్రిన్సిపాల్ వి.చిన్నయ్య, సీఎస్‌సీ హెచ్‌ఓడీ పి.అశోక్‌కుమార్, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, కార్యక్రమ విద్యార్థి కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.