ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు
ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు
Published Sat, Mar 4 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
కాకినాడ సిటీ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి డయల్ యువర్ జేసీ నిర్వహించగా 18 ఫోన్లు వచ్చాయి. ఎక్కువగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆయా ఫోన్‌కాల్స్‌కు జేసీ సమాధానమిచ్చి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ జూన్ నెలాఖరు నాటికి గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ కనెక్షన్ లేనివారందరూ ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీఎస్‌ఓ వి.రవికిరణ్, కలెక్టరేట్ ఏఓ తేజేశ్వరరావు, డీఆర్‌డీఏ ఏపీడీ సోమేశ్వరరావు పాల్గొన్నారు.
టెలీకాన్ఫెరెన్స్
పౌరసరఫరాల అంశాలపై జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ శనివారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంఎస్‌ఓలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రేషన్ షాపుల్లో తప్పనిసరిగా నగదురహిత లావాదేవీలు ద్వారానే కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా ఉదయం, సాయంత్రం షాపులను తెరచి ఉం చాలని డీలర్లకు సూచించారు. ఉగాది సందర్భంగా కార్డుదారులకు అదనంగా అరకిలో పంచదార పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫెరెన్స్‌లో పౌరసరఫరాలశాఖాధికారి వి.రవికిరణ్ పాల్గొన్నారు.
Advertisement