dial
-
ఎమర్జెన్సీకి ఫోన్ చేసి తల్లిని కాపాడిన 4ఏళ్ల బుడతడు
నాలుగేళ్ల చిన్నారి ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్చేసి మరీ తన తల్లిని కాపాడుకున్నాడు. అసలేం జరిగిందంటే...తస్మానియాకి చెందిన నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితమే అంబులెన్స్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ని ఎలా డయల్ చేయాలో నేర్చుకున్నాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఆమె తల్లి మూర్చతో కింద పడిపోయింది. దీంతో సదరు బాలుడు ఆ ఎమర్జెన్సీ నెంబర్ '000కి' కాల్ చేసి అమ్మ కింద పడిపోయిందని చెప్పాడు. వెంటనే పారామెడికల్స్ వచ్చి ఆ బాలుడి తల్లికి సకాలంలో వైద్యం అందించి ఆమెను రక్షించారు. అంతేకాదు సదరు అంబులెన్స్ పారామెడికల్ అధికారులు ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక సర్టిఫికేట్‌ని కూడా ప్రధానం చేశారు. ఆ బాలుడి తల్లి ఒక నర్సు ఆమె ఫోన్ అన్‌లాక్‌లో ఉంటే ఎలా ఓపెన్ చేయాలో, ఎమర్జెన్సీ నెంబర్‌కి ఎలా కాల్ చేయాలో నేర్పించినట్లు తెలిపారు. అదే ఈ రోజు తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తన కొడుకు ఒక చిన్న హిరో అయిపోయాడంటూ మురిసిపోయారు. ఈ ఘటనతో ఆ బాలుడు వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఈ విషయం సోషల్ మాధ్యమాలో కూడా తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ పిల్లవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ...చిన్న ఛాంపియన్ అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: వైట్ హౌస్‌లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు) -
డయల్ 112
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అత్యవసర సేవలన్నీ ఒక్కతాటిపైకి రాబోతున్నాయి. ఇందుకోసం నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం (ఎన్‌ఈఆర్‌ఎస్) పేరుతో మైక్రో మిషన్‌ను కేంద్ర హోం శాఖ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ‘112’నంబర్‌ను కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రాల్లో అమలు లో ఉన్న 100, 101, 108 తదితర ఎమర్జెన్సీ నంబర్లను దీని పరిధిలోకి తీసుకొస్తోంది. వీలైనంత త్వరగా ‘112’ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర పోలీసు విభాగం కూడా కొత్త నంబర్‌పై ప్రచారం చేయాలని నిర్ణయించింది. డయల్ 100కు కాల్ చేసిన వారికి వచ్చే సందేశంలో 100కు బదులుగా డయల్ 112 అంటూ పొందుపరిచింది. దేశంలో 36 చోట్ల 24 గంటల కాల్ సెంటర్లు ‘112’వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలు నిర్విరామంగా పనిచేసే కంట్రోల్ రూమ్ తరహా కాల్ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. పోలీసు, మెడికల్, ఫైర్, విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు సహా ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు మొత్తం 9 రకాల అత్యవసర సేవలకు ఈ కాల్ సెంటర్‌ను ఆశ్రయించేలా ఏర్పాటు చేస్తోంది. ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్ ద్వారా కాల్, ఎస్సెమ్మెస్, ఈ మెయిల్, చాట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్‌లో ఏర్పాటు చేసే ప్యానిక్ బటన్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్, మొబైల్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ).. ఇలా అన్ని మాధ్యమాల ద్వారా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఫోన్ చేస్తే ఎక్కడున్నారో కనిపెట్టేలా.. అత్యవసర సాయం కోసం బాధితులు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసేటప్పుడు.. అన్ని సందర్భాల్లో పూర్తి వివరాలు అందించే పరిస్థితిలో ఉండరు. సమాచారం అందగానే ఎంత తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తే బాధితులకు అంత ఊరట ఉంటుంది. కాబట్టి కంట్రోల్ రూమ్‌కు వచ్చిన కాల్, మెసేజ్, మెయిల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించేందుకు రాష్ట్ర పోలీసుల దగ్గర ఇప్పటికే కొంత పరిజ్ఞానం ఉంది. తాజాగా ఎన్‌ఈఆర్‌ఎస్ అమలుతో మరింత అత్యాధునిక పరిజ్ఞానం చేకూరనుంది. ఇది పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తే జీఐఎస్ పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్ కంట్రోల్ రూమ్స్‌లో ఉంటా యి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యా దు చేస్తున్నారో తక్షణం గుర్తించవచ్చు. పో లీసుల రెస్పాన్స్ టైమ్ మరింత తగ్గనుంది. కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా.. ఎన్‌ఈఆర్‌ఎస్ వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేస్తోంది. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం అంది స్తుండగా.. సిబ్బంది, బాధితులను ఆదుకునేందుకు ఆయా ప్రాంతాలకు చేరుకోవడానికి వాహనాలు, తదితరాలను రా ష్ట్రం చూసుకుంటోంది. సిబ్బందిని రిక్రూట్మెంట్, ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు. వాహనాలు, ఇతర సౌకర్యాలను కేంద్రం అందించే వివిధ పథకాల కింద, రాష్ట్ర నిధులతో సమీకరించుకుంటున్నారు. ఇక వైపరీత్యాలు సంభ వించినప్పుడు సత్వర స్పందన కోసం పోలీసు విభా గంతో పాటు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, మున్సి పల్ కార్పొరేషన్లకు ఒకేసారి సమాచారం అందేలా ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ నేరాల్లో బాధితులుగా మారిన వారికి సహాయం చేయడానికి కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 1930 అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని కూ డా 112లో కలిపేయాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. -
ఫేస్బుక్లో పోస్టు.. మూడు కోట్లు జరిమానా
న్యూయార్క్: తన పాత స్నేహితుడే తన తనయుడిని చంపాడంటూ ఆరోపిస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టిన మహిళకు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినాలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది. యాష్‌విల్లేకు చెందిన జాక్వెలిన్ హమ్మన్డ్ అనే మహిళ 2015లో మద్యం సేవించి తన తనయుడిని చంపలేదని ఫేస్బుక్లో పోస్టు చేసింది. తన పాత స్నేహితుడు డైల్ తన కొడుకుని హతమార్చాడని ఆరోపించింది. కాగా, దీనిపై డైల్ కోర్టులో పరువునష్టం దావా వేశాడు. ఈ కేసును అప్పటి నుంచి విచారిస్తున్న కోర్టు హమ్మన్డ్‌కు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. హమ్మన్డ్ తనపై చేసిన ఆరోపణల్లో నిజంలేదని డైల్ చెప్పారు. హమ్మన్డ్ చేసిన ఆరోపణలు తనను తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. ఇతరులపై అనవసరంగా ఆరోపణలు చేసేవారికి ఈ కేసు తీర్పు ఓ గుణపాఠమని కేసును వాదించిన లాయర్ అన్నారు. -
ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కాకినాడ సిటీ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి డయల్ యువర్ జేసీ నిర్వహించగా 18 ఫోన్లు వచ్చాయి. ఎక్కువగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆయా ఫోన్‌కాల్స్‌కు జేసీ సమాధానమిచ్చి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ జూన్ నెలాఖరు నాటికి గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ కనెక్షన్ లేనివారందరూ ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీఎస్ఓ వి.రవికిరణ్, కలెక్టరేట్ ఏఓ తేజేశ్వరరావు, డీఆర్డీఏ ఏపీడీ సోమేశ్వరరావు పాల్గొన్నారు. టెలీకాన్ఫెరెన్స్ పౌరసరఫరాల అంశాలపై జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ శనివారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంఎస్ఓలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రేషన్ షాపుల్లో తప్పనిసరిగా నగదురహిత లావాదేవీలు ద్వారానే కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా ఉదయం, సాయంత్రం షాపులను తెరచి ఉం చాలని డీలర్లకు సూచించారు. ఉగాది సందర్భంగా కార్డుదారులకు అదనంగా అరకిలో పంచదార పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫెరెన్స్లో పౌరసరఫరాలశాఖాధికారి వి.రవికిరణ్ పాల్గొన్నారు. -
వ్రతాల రేట్లు పెంచకండి
‘డయల్ టు ఈఓ’లో ఓ భక్తుని సూచన పలు అంశాలను ప్రస్తావించిన భక్తులు అన్నవరం: సత్యదేవుని ఆలయంలో సామాన్య భక్తులు ఎక్కువగా ఆచరించే రూ.150, రూ.300, రూ.700 వ్రతాల రేట్లు రూ.50 నుంచి రూ.వంద వరకూ పెంచాలనుకోవడం తగదని కాకినాడకు చెందిన పి.మాధవరావు అనే భక్తుడు వ్యాఖ్యానించారు. పెంపు ప్రతిపాదనను ఉపసంహరించాలని కోరారు. ఈఓ నాగేశ్వరరావు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ ‘డయల్ టు ఈఓ’ నిర్వహించగా పలువురు భక్తులు పెక్కు అంశాలకు సంబంధించి ఫోన్లు చేశారు. మాధవరావు మాట్లాడుతూ గతంలో వ్రతం టిక్కెట్ రూ.75 మాత్రమే ఉండేదని, అప్పుడు ఇచ్చిన దానికన్నా తక్కువ పరిమాణంలో పూజాసామాగ్రి ఇస్తున్నారని, రేటు మాత్రం భారీగా పెంచేశారని అన్నారు. ఈఓ సమాధానమిస్తూ వ్రతనిర్వహణ సామగ్రి ధరలు పెరిగినందున టిక్కెట్ల రేట్లు పెంచక తప్పడం లేదన్నారు. రూ.1,500 వ్రతం టిక్కెట్ మినహా మిగిలిన వ్రతాల టిక్కెట్ ధరలు పెంచాలన్న పాలకవర్గం ప్రతిపాదనకు కమిషనర్ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. కాగా ఈఓకి వచ్చిన మరికొన్ని ఫోన్ల వివరాలివి.. కొన్ని అభియోగాలపై తొలగించిన వ్రతపురోహితుడు డీఎస్వీవీఎన్ శర్మ స్థానంలో ఆయన కుమారుడి నియామకం అక్రమమని కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. శర్మను గత మేలో కొన్ని కారణాల వల్ల తొలగించామని,, గత నెలలో ఆయన కుమారుడిని వ్రతపురోహితునిగా నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని ఈఓ తెలిపారు.అయితే సర్వీస్ నుంచి తొలగించిన పురోహితుని కుమారుడిని ఎలా నియమిస్తారనే విమర్శలు రావడంతో నియామకాన్ని నిలిపివేశామన్నారు. కమిషనర్ తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాపేశ్వరానికి చెందిన జోగానందం దేవస్థానం కాఫీ, టీ పాయింట్లలో కాఫీ నాణ్యతగా లేదని ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామన్నారు. కుర్చీలో కూర్చుని వ్రతమా? అమలాపురానికి చెందిన భీమశంకర్ ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా మాజీ ప్రధాని దేవెగౌడను కుర్చీలో కూర్చోబెట్టి వ్రతం చేయించడాన్ని తప్పుపట్టారు. అయితేS ఆరోగ్యం సహకరించని వారికి పీటల మీద కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఈఓ వివరించారు. మెట్లదారిలో రత్నగిరికి వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించాలని కాకినాడకు చెందిన రాఘవేంద్రరావు కోరగా చర్యలు తీసుకుంటామని ఈఓ చెప్పారు. నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులను పల్లకీబోయీలు డబ్బులు అడుగుతున్నారని గంగవరానికి చెందిన సతీష్ ఫిర్యాదు చేశారు. దేవస్థానం గోవులకు మంచిమేత పెట్టాలని, దేవస్థానం వైద్యశాల వైద్యుడు వేళకు విధులకు హాజరయ్యేలా చూడాలని అన్నవరానికి చెందిన సూర్యప్రకాశరావు కోరారు. దేవస్థానంలో మోటార్ సైకి ల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని సామర్లకోటకు చెందిన సత్యనారాయణ సూచించారు. పెంచిన డీ ఏ ముందుగా పెన్షనర్లకే చెల్లించేలా చూడాలని దేవస్థానం పెన్షనర్ల సంఘం నాయకుడు వరహాలు కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏసీ జగన్నాథరావు పాల్గొన్నారు. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ‘మసాలా’ బాండ్లు..!
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) రుణ భారం తగ్గించుకునే యత్నాల్లో ఉంది. రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు మసాలా బాండ్ల జారీ సహా పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ ఈ విషయమై మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. డీఐఏఎల్ రుణాన్ని తక్కువ వ్యయం రుణాలతో తీర్చివేయాలనుకుంటున్నట్టు తెలిపారు. రూ.3వేల కోట్లను మసాలా బాండ్లు లేదా డాలర్ ఆధారిత బాండ్ల జారీ ద్వారా సేకరించి పాత రుణాలను తీర్చివేయనున్నట్టు చెప్పారు. వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో వీటి జారీ ఉంటుందన్నారు. మసాలా బాండ్లు అనేవి విదేశీ మార్కెట్లో జారీ చేసే రూపాయి బాండ్లు. తక్కువ వ్యయానికే రుణాల సేకరణకు ఇదొక మార్గం. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంకుతోపాటు పలు సంస్థలు మసాలా బాండ్లను జారీ చేశాయి. నిధుల లేమితోచిన్న పరిశ్రమల కటకట... న్యూఢిల్లీ: లఘు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) నిధుల లేమితో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్-అసోచామ్ సంయుక్త అధ్యయనం తెలిపింది. మధ్యకా లికంగా ఈ రంగం నుంచి రూ.45 లక్షల కోట ్లకు రుణ డిమాండ్ ఉంటుందని పేర్కొన్న నివేదిక, సమీపకాలంలో రూ.5.15 లక్షల కోట్లు అవసరమని విశ్లేషించింది. నిధుల సమీకరణ సైతం ఎం ఎస్ఎంఈలకు క్లిష్టమైన సమస్యని పేర్కొంది. -
ఆ మెసేజ్ నమ్మొద్దు..!
డయల్ 1098... మెసేజ్... ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరస్ లా వ్యాపించి అందర్నీ మోసగిస్తోంది. భారత దేశంలో పేదపిల్లలకు అదనపు ఆహారాన్ని ఛైల్డ్ లైన్ ఇండియా ద్వారా అందించేందుకు... మోదీ ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశ పెట్టిందంటూ వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఇదో మంచి ప్రయత్నమే కావడంతో వాట్సాప్ గ్రూపులు, వ్యక్తులు ఈ సందేశానికి విపరీతంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా బూటకం అని, ఈ మెసేజ్ ను ఎవ్వరూ నమ్మొద్దని ఛైల్డ్ లైన్ ఇండియా హెచ్చరిస్తోంది. నిరుపేదలు, అన్నార్తులకు సహాయం అందించడం నిజంగా మెచ్చుకోదగ్గ కార్యక్రమం. అటువంటి కార్యక్రమాలు ఎవరు ప్రవేశ పెట్టినా దానికి ప్రచారం కల్పించడం కూడా అవసరం. అటువంటి పనులు చేసే ముందు కాస్త ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని ఇప్పడు 'డయల్ 1098' ద్వారా తెలుస్తోంది. మనకు వచ్చిన ఏ మెసేజ్ నైనా ముందు.. వెనుకా ఆలోచించకుండా ఫార్వర్డ్ చేసేయడం అంత మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భం హెచ్చరిస్తోంది. నిజంగా ఇతరులకు సహాయం చేయాలనుకున్నవారు ఇటువంటి మెసేజ్ లు చూసినప్పుడు కాస్త లోతుగా దృష్టి పెట్టాలని సూచిస్తోంది. గుడ్ న్యూస్ అంటూ... కొన్నాళ్ళ క్రితం నుంచీ వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న డయల్ 1098 మెసేజ్ గురించి ఎంతోమంది ఛైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ కు ఫోన్లు కూడా చేశారట. నిజంగా ఇటువంటి పథకం ఏమీ లేదని చెప్పడంతో ఎంతో నిరాశకు గురయ్యారట. పిల్లల హక్కులను కాపాడే ప్రముఖ ఎన్జీవో సంస్థ 1996లో ప్రారంభమైనప్పటినుంచీ వీధిబాలల (స్ట్రీట్ చిల్డ్రన్) కోసం ఓ ప్రత్యేక హెల్స్ లైన్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇటువంటి మెసేస్ లు వచ్చినపుడు, కార్యక్రమాల గురించి విన్నపుడు తమకు కాల్ చేయమని సలహా ఇస్తోంది. ఇటువంటి సందేహాలపై సలహాలను తమ వెబ్ సైట్ లో అందిస్తామని కూడా చెప్తోంది. పార్టీ పూర్తయిన తర్వాత మిగిలిన ఆహార పదార్థాలు తీసుకుంటారా అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేయడం సంస్థ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటువంటి చైన్ లింక్ మెసేజ్ లు, మెయిల్స్ నమ్మొద్దని, 1098 కేవలం చిన్నారుల భద్రత, రక్షణ కోసం ఏర్పాటు చేసిన నెంబర్ అని సంస్థ నిర్వాహకులు వివరిస్తున్నారు. తాము ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, పంచడం వంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ఇది పూర్తిగా మోసపూరిత మెసేజ్ అని చెప్తున్నారు. దయచేసి ఇటువంటి సందేశాలను సర్క్యులేట్ చేయొద్దని, ఈ విషయంలో తమకు సహకరించాలని కోరుతున్నారు. -
హలో... కలెక్టర్‌గారు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను పరిష్కరించే నిమిత్తం సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 20 మంది వరకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. వాటిలో కొన్ని.. శ్రీకాకుళం పట్టణంలోని నక్కలవీధిలో తాగునీటి సమస్య ఉందని వెంటనే పరిష్కరించాలని స్థానికులు కొంతమంది కోరగా పురపాలక కమిషనర్‌ను చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నరసన్నపేట మండలం కొత్తపాలవలస సర్పంచ్ తిరుమలరావు గ్రామంలో ఉన్న మంచినీటి బోరు పనిచేయడం లేదని మరమ్మతులు చేపట్టాలని కోరారు. కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని హిరమండలం ఆర్ఆర్ కాలనీకి చెందిన ఏవీ సురేష్ కోరారు. పెనుగొట్టివాడ వద్ద ఫ్లడ్వాల్ను నిర్మించాలని కొత్తూరు మండలం మాతల గ్రామానికి చెందిన బి. రామప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని శ్రీకాకుళం పీఎన్‌కాలనీ నుంచి పి. వెంకటేశ్వరరావు, ఆమదాలవలస 13వ వార్డు నుంచి పి. శ్రీనివాసరావు, నందిగాం మండలం హరిదాసుపురం నుంచి పి. నేతాజీ, మందస మండలం హరిపురం గ్రామం నుంచి జి. మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. చౌకధరల దుకాణం నెం-2 డీలర్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయని అతనిపై చర్యలు తీసుకోవాలని కొత్తూరు మండలం నివగాంకు చెందిన వేణుగోపాలరావు కోరారు. గ్రామానికి చెందిన ఎ. అప్పారావు, పట్నాన అప్పారావులకు గత ఆరు మాసాలుగా రేషన్‌ను మంజూరు చేయడం లేదని పొందూరు మండలం ఖాజీపేట నుంచి పి. రాజారావు ఫిర్యాదు చేశాడు. టెక్కలి మండలం పెద్దసాన గ్రామం నుంచి పి. అప్పన్న మాట్లాడుతూ చౌకధర దుకాణం నెం. 793ను బినామీ నడుపుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజేసీ ఎం హెచ్ షరీఫ్, డీఎంహెచ్‌వో గీతాంజలి, ఆర్డబ్యూఎస్ పీడీ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.