ఫేస్‌బుక్‌లో పోస్టు.. మూడు కోట్లు జరిమానా
ఫేస్‌బుక్‌లో పోస్టు.. మూడు కోట్లు జరిమానా
Published Sat, Apr 1 2017 9:46 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
న్యూయార్క్: తన పాత స్నేహితుడే తన తనయుడిని చంపాడంటూ ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన మహిళకు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినాలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది. యాష్‌విల్లేకు చెందిన జాక్వెలిన్ హమ్మన్డ్ అనే మహిళ 2015లో మద్యం సేవించి తన తనయుడిని చంపలేదని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. తన పాత స్నేహితుడు డైల్ తన కొడుకుని హతమార్చాడని ఆరోపించింది.
కాగా, దీనిపై డైల్ కోర్టులో పరువునష్టం దావా వేశాడు. ఈ కేసును అప్పటి నుంచి విచారిస్తున్న కోర్టు హమ్మన్డ్‌కు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. హమ్మన్డ్ తనపై చేసిన ఆరోపణల్లో నిజంలేదని డైల్ చెప్పారు. హమ్మన్డ్ చేసిన ఆరోపణలు తనను తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. ఇతరులపై అనవసరంగా ఆరోపణలు చేసేవారికి ఈ కేసు తీర్పు ఓ గుణపాఠమని కేసును వాదించిన లాయర్ అన్నారు.
Advertisement
Advertisement