జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ‘మసాలా’ బాండ్లు..!
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) రుణ భారం తగ్గించుకునే యత్నాల్లో ఉంది. రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు మసాలా బాండ్ల జారీ సహా పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ ఈ విషయమై మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. డీఐఏఎల్ రుణాన్ని తక్కువ వ్యయం రుణాలతో తీర్చివేయాలనుకుంటున్నట్టు తెలిపారు.
రూ.3వేల కోట్లను మసాలా బాండ్లు లేదా డాలర్ ఆధారిత బాండ్ల జారీ ద్వారా సేకరించి పాత రుణాలను తీర్చివేయనున్నట్టు చెప్పారు. వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో వీటి జారీ ఉంటుందన్నారు. మసాలా బాండ్లు అనేవి విదేశీ మార్కెట్లో జారీ చేసే రూపాయి బాండ్లు. తక్కువ వ్యయానికే రుణాల సేకరణకు ఇదొక మార్గం. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతోపాటు పలు సంస్థలు మసాలా బాండ్లను జారీ చేశాయి.
నిధుల లేమితోచిన్న పరిశ్రమల కటకట...
న్యూఢిల్లీ: లఘు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) నిధుల లేమితో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్-అసోచామ్ సంయుక్త అధ్యయనం తెలిపింది. మధ్యకా లికంగా ఈ రంగం నుంచి రూ.45 లక్షల కోట ్లకు రుణ డిమాండ్ ఉంటుందని పేర్కొన్న నివేదిక, సమీపకాలంలో రూ.5.15 లక్షల కోట్లు అవసరమని విశ్లేషించింది. నిధుల సమీకరణ సైతం ఎం ఎస్‌ఎంఈలకు క్లిష్టమైన సమస్యని పేర్కొంది.