వివాహ సమయంలో డిజైనర్ ఇన్విటేషన్ కార్డ్‌లు చర్చనీయాంశంగా మారుతుంటాయి. కొన్ని పెళ్లి కార్డులలో లగ్జరీ చాక్లెట్‌లు ఉంటుండగా, మరికొన్ని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకునేలా బయోడిగ్రేడబుల్ కార్డ్‌లు రూపొందుతాయి. ఇటీవల ఒక వివాహ ఆహ్వాన కార్డ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది వధూవరుల చదువులను హైలెట్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఆహ్వానపత్రంలో వరుడి పేరు పక్కన ఐఐటి బాంబే అని, వధువు పేరు పక్కన ఐఐటి ఢిల్లీ అని ఉంది.
ఈ పెళ్లి ఆహ్వాన పత్రికను ఎక్స్‌లో షేర్ చేసిన మహేష్.. ‘పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ప్రేమేనని’ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. దీనిని షేర్ చేసినప్పటి నుండి ఈ కార్డ్‌కు 53 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. 400కి పైగా లైక్స్ లభించాయి. దీనిని చూసిన ఒక యూజర్ ‘కొన్ని దశాబ్దాల క్రితం డిగ్రీ పొందడం కష్టంగా ఉన్నప్పుడు బీఎస్‌సీ, బీకాం లాంటి డిగ్రీలను గొప్పగా పేర్కొనేవారు. ఈ ఆహ్వాన పత్రంలో ఇంటిపేరు లేకపోయినా వారి విద్యార్హతలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
మరొక యూజర్ ‘ఈ ఆహ్వాన పత్రంలో వధూవరుల జీతం జీతం, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను పేర్కొనకపోవడం నిరాశ పరుస్తోంది’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘అయ్యో.. ర్యాంక్ రాయలేదే’ అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది?
All you need is love to get married pic.twitter.com/sjd4SZSSJR
— Mahesh (@mister_whistler) September 12, 2023
Comments
Please login to add a commentAdd a comment