ఎస్‌బీఐ కార్డ్ సంస్థ తన మొబైల్ యాప్‌లోకి చాట్‌బాట్ ఐఎల్‌ఏ (ఇంటరాక్టివ్ లైవ్ అసిస్టెంట్) ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని తీసుకురావడమే దీన్ని ఉద్దేశ్యం. 40కు పైగా వినూత్నమైన స్వయం సేవ ఫీచర్లతో ఉన్న ఐఎల్‌ఏను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా ఎస్‌బీఐ కార్డు నిలుస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ కన్వర్షన్, బ్యాలన్స్ బదిలీ, క్రెడిట్ కార్డుపై రుణం, ఇతర అకౌంట్ నిర్వహణ ఆప్షన్లు అన్నవి పరిశ్రమలోనే మొబైల్ చాట్‌బాట్ ద్వారా ఆఫర్ చేస్తుండడం మొదటిసారి అని పేర్కొంది. చాట్ బాట్‌పై లైవ్ చాట్ ఆప్షన్ కూడా ఉంది. దీని ద్వారా ప్రత్యేకమైన కేసుల్లో పరిష్కారాన్ని నేరుగా కస్టమర్ కేర్ ప్రతినిధి అందించడం జరుగుతుంది. ఎస్‌బీఐ కార్డ్ వెబ్‌సైట్‌పై ఐఎల్‌ఏ సేవను గతేడాది ప్రవేశపెట్టగా, తాజాగా దీన్ని మొబైల్ యాప్‌నకూ తీసుకొచ్చినట్టు అయింది.
Comments
Please login to add a commentAdd a comment