
కనపడితే చాలు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, షేక్ హ్యాండ్‌లు, ఫొటోగ్రాఫర్స్ క్లిక్‌లు... ఇలా ఒకటా రెండా ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేయడానికి బాలీవుడ్ యాక్టర్ దీపికా పదుకోన్‌కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులోనూ ‘పద్మావతి’ సినిమా రిలీజ్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి, ఈవిడగారు కనపడితే చాలు.. ఆ సినిమా గురించి ప్రశ్నలు. అందుకే దీపిక తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఫుల్‌గా బ్లాక్ డ్రెస్ వేసుకుని, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని...ఆస్ట్రియాలోని వియన్నా వీధుల్లో హ్యాపీగా జాలీగా విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఒక్కసారి ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో చూడండి.. దీపికా న్యూ అప్పియరన్స్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. మరోవైపు దీపిక లవర్ (ఈ ఇద్దరి గురించి బాలీవుడ్‌లో అలానే అనుకుంటారు) రణ్‌వీర్ సింగ్ లండన్‌లో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సో.. వీరిద్దరూ కలిసి యూరప్‌లో టైఅప్ అవుతారని, అక్కడ న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారన్నది చాలామంది ఊహ. మరి... ఈ ఊహ ఎంతవరకు నిజమవుతోంది జస్ట్ నాలుగు రోజుల్లో తెలిసిపోతుందిలేండి.
వియన్నాలో దీపిక
Comments
Please login to add a commentAdd a comment