
Kangana Recall Her Europe Trip Incident: యూరప్ సోలో ట్రీప్‌కు వెళ్లిన తనపై ఓ వ్యక్తి దాడి చేశాడని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ షాకింగ్ విషయం చెప్పింది. తాజాగా ఆమె నటించిన థాకడ్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఈ చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా కంగనా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా గతంలో తాను యూరప్ ట్రీప్‌కు వెళ్లానని అక్కడ తన పర్సు కొట్టేశారని చెప్పుకొచ్చింది. ‘యూరప్ ట్రీప్‌లో భాగంగా ఇటలీ-స్విట్జర్లాండ్ బోర్డర్‌లో స్కీయింగ్ చేయడానికి వెళ్లాను.
చదవండి: షాకింగ్ లుక్‌లో కోవై సరళ, ఫొటో వైరల్
అక్కడ ఓ స్కూల్ ఉంది. ఆ భవంతిలో కొంతమంది రహస్యంగా జీవిస్తున్నారు. వారిని చూడగానే నాకు భయం వేసింది. దీంతో వెంటనే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని నిర్ణయించుకుని సమీపంలోని మోట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. స్టేషన్‌లో ఉండగానే ఓ వ్యక్తి నన్ను కొట్టాడు. ఆ తర్వాత నా పర్సు లాక్కున్నాడు. అందులో కొన్ని వేల డాలర్స్‌తో పాటు కార్డ్స్ కూడా ఉన్నాయి. అనంతరం నేను ట్రైన్ ఎక్కి నా బ్యాగ్ చూసుకుంటే పర్సు ఖాళీగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ‘ఆ సమయంలో నా దగ్గర ఒక్క పైసా లేదు. నేను ఓ కొత్త ప్రదేశంలో చిక్కుకుపోయాను. దీంతో నా సోదరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో తను నా మెనేజర్‌ను పంపించింది.
చదవండి: Cannes Film Festival: పూజా హెగ్డేకు చేదు అనుభవం
దీంతో ఆమె నా వద్దకీ మెనేజర్‌ని పంపింది. ఆ రోజు నా మెనేజర్ వచ్చే వరకు నేను ఆకలి, దప్పికలతోనే ఉండిపోయాను. యూరప్‌లో ఒక్కరు కూడా సహాయం చేయలేదు. కానీ, భారత్‌లో అయితే సమోసా అమ్మే వ్యక్తి కూడా కనీసం నీళ్లయినా ఇచ్చేవాడు’ అని కంగనా చెప్పింది. అయితే అదృష్టం ఏంటంటే ఆ సమయంలో తన పాస్‌పోర్టు మాత్రం చోరీ కాలేదని, లేదంటే పరిస్థితి ఇంకేలా ఉండేదో తలచుకుంటుంటేనే ఓళ్లు వణికిపోతుందని కంగనా పేర్కొంది. కాగా ఆమె నటించి ధాకడ్ చిత్రం శుక్రవారం(మే 20న) విడుదలైంది. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించాడు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, దివ్వా దత్తాలు కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment