బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అమ్మమ్మ ఇంద్రానీ ఠాకూర్ కన్నుమూసింది. ఈ విషాద వార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమెతో కలిసున్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మా అమ్మమ్మ ఎంతో శక్తివంతమైనది. తనకు ఐదుగురు సంతానం. అందరికీ మంచి విద్య అందించాలని తాపత్రయపడింది. అంతేకాదు ఉన్నత విద్యతో పాటు పెళ్లయిన తర్వాత కూడా తన కూతుర్లు సొంతకాళ్లపై నిలబడాలని కోరుకుంది.
సొంత కాళ్లపై నిలబడాలని..
వంటింటికే పరిమితం కాకుండా వారికంటూ సొంత కెరీర్ ఉండాలని భావించింది. అప్పట్లోనే తన కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకుని పేరు తెచ్చుకున్నారు. అలా తన సంతానంలోని ఐదుగురు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అది చూసి ఆమె ఎంతో గర్వపడేది. తను ఐదు అడుగుల ఎనిమిది ఇంచుల పొడవుండేది. చాలా ఆరోగ్యంగానూ ఉండేది.
బ్రెయిన్ స్ట్రోక్
100 ఏళ్ల వయసుపైబడి ఉన్నప్పటికీ తన పనులన్నీ తనే చేసుకునేది. ఆమె ఎత్తూపొడుగు నాకు వచ్చింది. కొద్దిరోజుల క్రితం గది శుభ్రం చేస్తున్న సమయంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల మంచానికే పరిమితమైంది. తననలా చూసి మా మనసు తట్టుకోలేకపోయింది. మా అందరికీ తనే స్ఫూర్తి. తను మా డీఎన్‌ఏలోనే ఉంది. ఆమెను ఎన్నటికీ మర్చిపోలేం అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
సినిమా
కాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. కంగనా స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీ సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడంతో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
చదవండి: సాయిపల్లవి ఉన్నారా..? అంటూ ఆ యువకుడికి భారీగా ఫోన్ కాల్స్
Comments
Please login to add a commentAdd a comment