న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్‌లో యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ ఫ్రాన్సులో అయిదు రోజులపాటు పర్యటించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 7న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో యూరోపియన్ కమిషన్ ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. 8న ప్యారిస్‌లో యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్‌లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 9న ప్యారిస్‌లో లేబర్ యూనియన్ ఆఫ్ ఫ్రాన్సు సమావేశంలో పాల్గొంటారు. 10న నార్వే రాజధాని ఓస్లోకు వెళతారు. అక్కడి ప్రవాస భారతీయులతో రాహుల్ గాంధీ ముఖాముఖి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వివరించాయి.
ఇక అదే టైంలో.. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 సమావేశాలను ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. సరిగ్గా అదే టైంలో రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్తుండటం గమనార్హం. ఇక విదేశీ పర్యటనలో రాహుల్ భారత్ అంతర్గత వ్యవహారాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారంటూ కేంద్రంలోని బీజేపీ మండిపడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment