Germany scientists
-
2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రధాని మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని జర్మనీ, ఫ్రాన్సు, డెన్మార్క్లను సందర్శించనున్నారని శనివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్‌లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అవుతారు. -
నిద్రలేమికి ‘ఆక్టిమీటర్’తో చెక్!
బెర్లిన్: నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు ఓ కొత్త పరికరాన్ని రూపొందించారు. దీన్ని ఉపయోగించడం వల్ల మనకు నాణ్యమైన నిద్ర ఎంతవరకు అందింది, ఇంకా ఎంత నిద్ర అవసరమో సూచిస్తుంది. ఆక్టిమీటర్గా పిలిచే ఈ పరికరాన్ని చేతికి గడియారంలా ధరించాల్సి ఉంటుంది. లుడ్విగ్ మాక్సిమిలియన్ వర్సి టీ ఆఫ్ మునిచ్ (ఎల్ఎంయూ)కి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని తయారుచేశారు. ఈ ఆక్టిమీటర్ లేచినప్పటి నుంచి విశ్రాంతి తీసుకున్న సమయం, యాక్టివ్‌గా పనిచేస్తున్న సమయం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. 3 నెలల కాలానికి సరిపడా డాటాను భద్రపరుస్తుంది. 8 నుంచి 92 ఏళ్ల వయసు గల 574 మందిపై ఆక్టిమీటర్ అమర్చి..నిద్ర నమూనాలు సేకరించి శాస్త్రవేత్తలు పరిశోధించారు. -
భవిష్యత్తు ఇంధనం.. హైడ్రోజన్ !
హైడ్రోజన్.. భవిష్యత్తులో మానవాళిని నడిపే ఇంధనం. ప్రస్తుతానికి నీటి అణువులో దాగి ఉన్న ఈ మరేదాని నుంచైనా ఉత్పత్తి చేయగలిగితే.. మన ఇంధన అవసరాలు తీరినట్టే. దీనిపై దృష్టిసారించిన జర్మనీ శాస్త్రవేత్తలు సూర్యకాంతి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంపై దృష్టిసారించారు. ఒకవేళ ఇది సాధ్యమైతే సూర్యుడి నుంచి వెలువడే అపార కాంతిని హైడ్రోజన్‌గా మార్చి, పర్యావరణ అనుకూల ఇంధనంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఏకంగా ఓ కృత్రిమ సూర్యుడినే తయారు చేశారు. వివరాల్లోకెళ్తే... సిన్‌లైట్ టెస్ట్..: పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీ శాస్త్రజ్ఞులు గురువారం చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్లైట్లను అమర్చి వాటిని గురువారం స్విచాన్ చేసి పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా ‘సిన్‌లైట్’అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. జర్మనీలోని జ్యూలిచ్‌లో జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నిర్వహించారు. అసాధారణ ఉష్ణోగ్రత..: 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరించేలా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్ల ఎక్కువ రేడియేష న్‌తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3 వేల డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. కర్బన ఉద్గారాలు లేని ఇంధనం..: హైడ్రోజన్ మండినప్పుడు కర్బన ఉద్గారాలు వెలువడవు. తద్వారా గ్లోబల్ వార్మింగ్‌కు హైడ్రోజన్ కారణమవ్వదు. అందువల్ల దానిని భవిష్యత్తు ఇంధనంగా చాలా మంది భావిస్తున్నారు. కానీ హైడ్రోజన్ సహజంగా ప్రకృతిలో దొరకదు. నీటి నుంచి విడదీయాలి. దీనికి పెద్దమొత్తంలో విద్యుత్తు అవసరం. అంత విద్యుత్తు వాడకుండా సూర్యకాంతితో హైడ్రజోజన్ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరీక్షను నిర్వహించారు.