నిద్రలేమికి ‘ఆక్టిమీటర్‌’తో చెక్‌! | germany scientists invention on sleeping issues | Sakshi
Sakshi News home page

నిద్రలేమికి ‘ఆక్టిమీటర్‌’తో చెక్‌!

Published Sat, Dec 30 2017 2:51 AM | Last Updated on Sat, Dec 30 2017 2:51 AM

germany scientists invention on sleeping issues - Sakshi

బెర్లిన్‌: నిద్రలేమి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు ఓ కొత్త పరికరాన్ని రూపొందించారు. దీన్ని ఉపయోగించడం వల్ల మనకు నాణ్యమైన నిద్ర ఎంతవరకు అందింది, ఇంకా ఎంత నిద్ర అవసరమో సూచిస్తుంది. ఆక్టిమీటర్‌గా పిలిచే ఈ పరికరాన్ని చేతికి గడియారంలా ధరించాల్సి ఉంటుంది. లుడ్విగ్‌ మాక్సిమిలియన్‌ వర్సి టీ ఆఫ్‌ మునిచ్‌ (ఎల్‌ఎంయూ)కి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని తయారుచేశారు. ఈ ఆక్టిమీటర్‌ లేచినప్పటి నుంచి విశ్రాంతి తీసుకున్న సమయం, యాక్టివ్‌గా పనిచేస్తున్న సమయం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. 3 నెలల కాలానికి సరిపడా డాటాను భద్రపరుస్తుంది. 8 నుంచి 92 ఏళ్ల వయసు గల 574 మందిపై  ఆక్టిమీటర్‌ అమర్చి..నిద్ర నమూనాలు సేకరించి శాస్త్రవేత్తలు పరిశోధించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement