భవిష్యత్తు ఇంధనం.. హైడ్రోజన్‌ ! | German scientists turn on 'artificial sun' to help research climate-friendly fuel | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు ఇంధనం.. హైడ్రోజన్‌ !

Published Fri, Mar 24 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

భవిష్యత్తు ఇంధనం.. హైడ్రోజన్‌ !

భవిష్యత్తు ఇంధనం.. హైడ్రోజన్‌ !

హైడ్రోజన్‌.. భవిష్యత్తులో మానవాళిని నడిపే ఇంధనం. ప్రస్తుతానికి నీటి అణువులో దాగి ఉన్న ఈ మరేదాని నుంచైనా ఉత్పత్తి చేయగలిగితే.. మన ఇంధన అవసరాలు తీరినట్టే. దీనిపై దృష్టిసారించిన జర్మనీ శాస్త్రవేత్తలు సూర్యకాంతి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంపై దృష్టిసారించారు. ఒకవేళ ఇది సాధ్యమైతే సూర్యుడి నుంచి వెలువడే అపార కాంతిని హైడ్రోజన్‌గా మార్చి, పర్యావరణ అనుకూల ఇంధనంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఏకంగా ఓ కృత్రిమ సూర్యుడినే తయారు చేశారు. వివరాల్లోకెళ్తే...

సిన్‌లైట్‌ టెస్ట్‌..: పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీ శాస్త్రజ్ఞులు గురువారం చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్‌లైట్లను అమర్చి వాటిని గురువారం స్విచాన్‌ చేసి పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా ‘సిన్‌లైట్‌’అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. జర్మనీలోని జ్యూలిచ్‌లో జర్మన్‌ ఏరోస్పేస్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నిర్వహించారు.

అసాధారణ ఉష్ణోగ్రత..: 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరించేలా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్ల ఎక్కువ రేడియేష న్‌తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3 వేల డిగ్రీ సెల్సియస్‌ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు.

కర్బన ఉద్గారాలు లేని ఇంధనం..: హైడ్రోజన్‌ మండినప్పుడు కర్బన ఉద్గారాలు వెలువడవు. తద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌కు హైడ్రోజన్‌ కారణమవ్వదు. అందువల్ల దానిని భవిష్యత్తు ఇంధనంగా చాలా మంది భావిస్తున్నారు. కానీ హైడ్రోజన్‌ సహజంగా ప్రకృతిలో దొరకదు. నీటి నుంచి విడదీయాలి. దీనికి పెద్దమొత్తంలో విద్యుత్తు అవసరం. అంత విద్యుత్తు వాడకుండా సూర్యకాంతితో హైడ్రజోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరీక్షను నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement