విదేశీ ఉద్యోగులు, విద్యార్థులపై ట్రంప్ బాంబ్! | Trump Bomb on Foreign employees and students | Sakshi
Sakshi News home page

విదేశీ ఉద్యోగులు, విద్యార్థులపై ట్రంప్ బాంబ్!

Published Mon, Jan 30 2017 8:54 PM | Last Updated on Thu, Oct 4 2018 6:53 PM

విదేశీ ఉద్యోగులు, విద్యార్థులపై ట్రంప్ బాంబ్! - Sakshi

విదేశీ ఉద్యోగులు, విద్యార్థులపై ట్రంప్ బాంబ్!

► వీసా నిబంధనల సమీక్ష – అమలు తీరుపై తనిఖీలు – విద్యార్థులపై ‘పర్యవేక్షణ’  
► కొత్త నిబంధనలతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సిద్ధం చేసిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు
► అమలైతే అమెరికాలో భారత ఉద్యోగులు, విద్యార్థులకు పెరగనున్న కష్టాలు


ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధిస్తూ ఇటీవలే కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసిన అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉద్యోగాల కోసం, ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్తగా రాబోయే వారిపైనే కాదు.. ఇప్పటికే చట్టబద్ధంగా హెచ్-1బి, ఎల్-1, ఎఫ్-1 వీసాలపై వచ్చిన విదేశీయులపైనా భారీ బాంబు వేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో విదేశీ ఉద్యోగుల్లోనూ, విద్యార్థుల్లోనూ భారతీయులే భారీగా ఉన్నారు. సంబంధిత వీసా నిబంధనలను సమీక్షించటంతో పాటు.. ఆయా వీసాలపై వచ్చిన వారు చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నారా? అనేది ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని అంతర్గత భద్రత, కార్మికశాఖలను ఆదేశిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వును ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేసింది.

‘చట్టబద్ధమైన వలసలను పరిమితం చేయడం: విదేశీ కార్మిక వీసా పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా అమెరికా ఉద్యోగాలు, కార్మికులకు రక్షణ కల్పించడం’ అనే శీర్షికతో ఉన్న ఈ ఉత్తర్వుపై ట్రంప్‌ సంతకం చేస్తే.. విదేశీ విద్యార్థులపై అమెరికా ‘పర్యవేక్షణ’ పెరుగుతుంది. ఎల్‌-1 వీసా దారులు పనిచేసే క్షేత్రాలను అమెరికా అంతర్గత భద్రత అధికారులు తనిఖీ చేసే వీలుంటుంది. హెచ్‌-1బీ వీసా గల వారి జీవిత భాగస్వాములు (భర్త లేదా భార్య) అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అనుమతిస్తూ ఒబామా సర్కారు తీసుకున్న నిర్ణయం రద్దవుతుంది. అంతేకాదు.. అమెరికాలోని భారతీయ సంస్థలు, భారత ఉద్యోగులూ ఇక్కట్లలో పడతారు. ఇక హెచ్‌-1బి వీసా పొందడం చాలా చాలా కష్టమవుతుంది. చాలా ఖరీదు కూడా అవుతుంది.

అంతేకాదు.. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న వారిలో చైనీయుల తర్వాత భారతీయులే అత్యధికులు. చదువు పూర్తయిన తరువాత ‘వర్క్‌ వీసా’ అవకాశాలు మెరుగుగా ఉండటంతో భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మాథమాటిక్స్‌) విద్యార్థులు ఐచ్ఛిక ప్రాక్టికల్‌ శిక్షణ (ఓపీటీ)ను గరిష్టంగా మూడేళ్ల వరకూ పొడిగించుకునే అవకాశం ఉండటంతో.. దీనిని భారతీయ విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకుంటారు. అయితే.. ఈ ఓపీటీ పొడిగింపు, కాల పరిధిని తగ్గించాలని ట్రంప్‌ సర్కారు భావిస్తోంది. అదే జరిగితే.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న 1,65,918 మంది విద్యార్థుల భవిష్యత్‌ ఆశలు ఆవిరవుతాయి.
- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి

(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

(ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?)

(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)

(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)

(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement