తన సంతకం ఫోర్జరీ చేసి మెడికల్ లీవ్ సర్టిఫికెట్స్ సృష్టించుకున్నట్టు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ పి.సుధీర్ ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ పోలీసులు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.మాధవిపై శుక్రవారం కేసు నమోదు చేశారు.
మెడికల్ లీవ్ కోసం సంతకం ఫోర్జరీ
Sep 9 2017 12:13 AM | Updated on Oct 4 2018 6:53 PM
వ్యవసాయ శాఖ ఏడీ మాధవిపై కేసు నమోదు
కొవ్వూరు : తన సంతకం ఫోర్జరీ చేసి మెడికల్ లీవ్ సర్టిఫికెట్స్ సృష్టించుకున్నట్టు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ పి.సుధీర్ ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ పోలీసులు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.మాధవిపై శుక్రవారం కేసు నమోదు చేశారు. మాధవి ప్రస్తుతం నిడదవోలులోని బైలాజికల్ ల్యాబ్‌లో ఏడీగా పనిచేస్తున్నారు. 23, 21 రోజుల సెలవుకు సంబంధించిన మెడికల్ లీవ్‌తో పాటు ఆర్యోగపరమైన సమస్యలున్నట్టు నాలుగు ధ్రువీకరణ పత్రాలతో ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి జిరాక్స్ పేపర్లపై అటిస్టేషన్ చేయాలని కోరాడన్నారు. దీంతో ఆ పత్రాలు పరిశీలించి అవాక్కయ్యాయని సుధీర్ తెలిపారు. ఆ వ్యక్తిని నిలదీసి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న పి.మాధవితో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సుధీర్ తెలిపారు. తన సంతకంతో పాటు సీల్ పోర్జరీ చేసినట్టు గుర్తించానన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మాధవిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ పి.ప్రసాదరావు తెలిపారు.
Advertisement
Advertisement