ఏ టు జెడ్లో పీఎం ఎక్కడ? | digvijay singh crazy tweet over pm modi's foreign tours | Sakshi
Sakshi News home page

ఏ టు జెడ్లో పీఎం ఎక్కడ?

Published Tue, Nov 24 2015 7:37 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

ఏ టు జెడ్లో పీఎం ఎక్కడ? - Sakshi

ఏ టు జెడ్లో పీఎం ఎక్కడ?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస విదేశీ పర్యటనలపై ఎన్నెన్నో కుళ్లు జోకులు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుండటం తెలిసిందే. నిన్నటికి నిన్న 'మీరు విదేశాల్లో తిరగండి.. నేను రైతుల పొలాల్లో తిరుగుతా' అని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మోదీని ఉద్దేశించి సీరియస్ కామెంట్లు కూడా చేశారు.

 

ఇప్పుడదే అంశంపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చిన్నపాటి ట్వీట్ వదిలారు. అందులో ఓ టీచర్, విద్యార్థిల మధ్య సంవాదం ఇలా సాగుతుంది..

విద్యార్థిని ఉద్దేశించి టీచర్: ఒకసారి ఏబీసీడీలు గట్టిగా చదివి వినిపించు..
విద్యార్థి: ఏ బీ సీ డీ ఈ ఎఫ్ జీ హెచ్ ఐ జే కే ఎల్ ఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ టీ యూ..
టీచర్: అదేంట్రా.. మధ్యలో పీ, ఎం ఎగరగొట్టావేం?
విద్యార్థి: అదేంటి టీచర్ మన పీఎం ఫారిన్ లో కదా ఉన్నారు!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement