
ఈ నెల 25న బెల్జియంకు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. నాటో దేశాల సదస్సు నిమిత్తం ట్రంప్ వచ్చే నెల 25న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు వెళ్లనున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. నాటోతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం, కూటమికి సంబంధించి కీలక అంశాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై ఈ సందర్భంగా ట్రంప్ చర్చిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత ట్రంప్ జీ–20 సదస్సు కోసం జర్మనీకి కూడా వెళ్తారు.
జీ–20 సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే మోదీని శ్వేతసౌధానికి ట్రంప్ ఆహ్వానించగా, ట్రంప్‌ను భారత్ పర్యటనకు మోదీ ఆహ్వానించారు. అయితే జీ–20 సదస్సులో ఇరు దేశాధినేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ట్రంప్ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో నాటోపై వ్యతిరేకత వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఇది అమెరికాకు అనవసరపు ఖర్చుతో కూడిన ఖర్చంటూ టంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.