
న్యూఢిల్లీ: ఎంపీలు విదేశీ పర్యటనలు చేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలతో పాటు ఖర్చుల వివరాలు తప్పనిసరిగా వెల్లడించేలా చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ఎంపీ కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనల నేపథ్యంలో ఆ పార్టీ లక్ష్యంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రజా ప్రాతినిధ్య (సవరణ) బిల్లుకు సంబంధించిన ఓ ప్రైవేట్ మెంబర్స్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ‘విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి స్వీకరించిన ఏ రకమైన ఆతిథ్యం అయినా సరే దాని వివరాలు రాజ్యసభ చైర్మన్‌కు గానీ, లోక్‌సభ స్పీకర్‌కు గానీ వెల్లడించాలి’అని బిల్లు తెలిపింది. కాగా, ఎంపీలు విదేశీ పర్యటనల వివరాలు తెలపాలని 2017లోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయని, 2019 జూలైలోనూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ దీన్ని పునరుద్ఘాటించిందని జీవీఎల్ పేర్కొన్నారు.