
2017లో భారత్‌కు పోప్
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వచ్చే ఏడాది భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు 2017 విదేశీ పర్యటనల షెడ్యూలును ఆదివారం ప్రకటించారు. పోర్చుగల్, బంగ్లాదేశ్, కొలంబియా, ఆఫ్రికాలూ జాబితాలో ఉన్నాయి. మే 13న పోర్చుగల్‌లోని మారియన్ చర్చిని సందర్శించడం ఖరారైంది. భారత్, బంగ్లాదేశ్ దేశాల పర్యటనలు కూడా దాదాపు ఖాయమయ్యాయి.